Saturday Motivational : మారని గతం గురించి ప్రస్తుతంలో మరణిస్తే ఏం లాభం
Saturday Motivational Quote : కొంతమంది 'మారని గతంతో ప్రస్తుతం మరణిస్తూ ఉంటారు'. ఇది చెప్పేందుకు చిన్న విషయమే.. కానీ వారి హృదయంలో మాత్రం.. బాగా లోతుగా ఉంటుంది. కానీ గడిచిన గతంతో ప్రస్తుతంలో బతికితే.. ప్రస్తుతంలో ఏమీ ఉండదు.
గతం గురించి ఆలోచించి.. ప్రస్తుతంలో జీవించలేకపోవడమంతా.. చెత్త పని మరొకటి లేదు. ప్రస్తుతం.. గతమయ్యాక.. మళ్లీ అవే గతం తాలుకు స్మృతులు భవిష్యత్ లోనూ ఉంటాయి. సో.. ఈరోజు ప్రస్తుతం.. రేపటి గతమవుతుంది. రేపు ఆనందంగా ఉండాలంటే.. ఈరోజును కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అప్పడే రేపటి గతం.. కూడా ఆనందంగా ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
ఉదాహరణకు.. ఓ ప్రేమికుల జంట ఉంది. ఒకరికి తెలియకుండా.. ఒకరిని ఒకరు మోసం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే దగ్గరకు వచ్చేసరికి.. ప్రేమగా ఉంటారు. నువ్వులేని జీవితం నాకొద్దు అని చెబుతుంటారు. ఏదో ఓ రోజున వారిద్దరి గురించి.. వారికే తెలుస్తుంది. నువ్ నన్ను.. మోసం చేశావ్.. నువ్ నన్ను మోసం చేశావ్ అని నిందించుకుంటారు. అలాంటి మ్యాటర్ ఇక అక్కడకి వదిలేస్తే బెటర్. లేదు.. నువ్ ఎందుకు అలా చేశావ్.. అంటు ప్రశ్నలు, మెసేజులు చేస్తూ ఉంటే.. ఆ ఇద్దరూ గతంలోనే ఉంటూ ప్రస్తుతాన్ని నాశనం చేసుకుంటారు. దీనికి బదులు ఎవరి దారి వారు చూసుకోని ప్రస్తుతంలో బతికేస్తే మంచిది కదా. పైన చెప్పింది ఎగ్జాంపుల్ మాత్రమే.. లవ్ లోనే అని కాదు.. చాలామంది అనేక విషయాల్లో గతంలోనే బతుకుతారు.
ప్రస్తుతాన్ని నాశనం చేసుకునేవారు రోడ్డు మీదకు వెళ్తే.. చాలా మంది కనిపిస్తారు. కానీ అలా బతికితేనే అసలు సమస్య. జీవితంలో చాలా విషయాలు సమయం, నిర్ణయం అనే రెండు ముఖ్యమైన అంశాలతోనే ముడిపడి ఉంటాయి. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలే.. ఆ సమయంలో మనం స్పందించే తీరే.. మన తర్వాతి జీవితం. మన ఆలోచనలు ముందుకు వెళ్లాలి గానీ.. గతంలోకి తీసుకెళ్లి.. జీవితంలో వెనక్కు లాగొద్దు.
ఇప్పుడు మీరు ప్రస్తుతంలో బతికేతేనే.. మీతోపాటుగా మీ చుట్టుపక్కల వాళ్లు ఆనందంగా ఉంటారు. ఇంకా మీరు గతంలోనే బతికితే.. కొన్ని రోజులు చూసి.. మిమ్మల్ని వదిలేయోచ్చు. అందుకే గతాన్ని ప్రస్తుతం చేసుకోవడం మానేస్తే మంచిది. అడుగు ముందుకు పడాలంటే.. అడ్వాన్స్డ్ గానే ఉండాలి. అలాంటిది మీరు పాత విషయాలను, చేదు జ్ఞాపకాలను గుర్తూ చేస్తూ.. ఉంటే ఇంకా వెనక్కు వెళ్తూనే ఉంటారు. మీ చుట్టుపక్కల వాళ్లు ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. సో.. ప్రస్తుతంలో బతకండి.. గతం ప్రస్తుతానికి పునాదిలా ఉండాలి గానీ.. సంద్రంలో ముంచేసే నౌకలా ఉండకూడదు.
గతం గురువు లాంటిది..
మళ్లీ చేయకూడని విషయాలేంటో నేర్పుతుంది..
కొందరిని కోల్పోయామనిపిస్తుంది.. కానీ ఎవరినీ వదులుకోకుడదో చెబుతుంది.
ఎవరూ నేర్పలేని జీవిత పాఠాలను నేర్పేది గతమే..
అందుకే గతంలో నేర్చుకున్న పాఠాలతో ముందుకు వెళ్లాలి.. అదే గతంలో ఉండిపోకూడదు
ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. కరిగిపోతున్న కాలం.. గతాన్ని గుర్తు చేసి నవ్వుతుంది.. కానీ అవేమీ పట్టించుకోవద్దు.. అప్పుడే ముందుకు వెళ్లేందుకు మీకు అవకాశాలు ఎక్కువ.