Saturday Motivation : కొన్ని బంధాలకు దూరమవ్వడమే నిజమైన ఆనందం.. మిస్ చేసుకోకండి-saturday motivation real happiness is to get away from some bonds dont miss it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : కొన్ని బంధాలకు దూరమవ్వడమే నిజమైన ఆనందం.. మిస్ చేసుకోకండి

Saturday Motivation : కొన్ని బంధాలకు దూరమవ్వడమే నిజమైన ఆనందం.. మిస్ చేసుకోకండి

Anand Sai HT Telugu
Apr 13, 2024 05:00 AM IST

Saturday Motivation In Telugu : విడిపోవడం వల్ల కలిగే బాధ చాలా ఉంటుంది. కానీ కొన్ని విషపూరిత సంబంధాలలో విడిపోవడం మాత్రమే శాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ సంబంధంలో ప్రేమ కంటే మోసం, బాధ, హింస, అభద్రత ఎక్కువ.

కొన్ని బంధాల్లో విడిపోవడమే మంచిది
కొన్ని బంధాల్లో విడిపోవడమే మంచిది (unsplash)

బంధం అంటే స్వచ్ఛంగా ఉండాలి. ఏ బంధమైనా నిలవాలంటే కచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కానీ కొన్ని బంధాల్లో మోసం ఎక్కువగా ఉంటుంది. అలాంటి బంధం కోసం రోజూ బాధపడి మనశ్శాంతి పొగొట్టుకోవాలి. మీ సంబంధం ఇలాగే ఉంటే, అది విషపూరిత సంబంధం. విడిపోవడమే ఉత్తమం:

కొందరు రోజూ గొడవపడుతారు. కానీ ప్రేమగా ఉంటారు. ఒకరినొకరు ప్రేమించే జంటలు చాలా అందంగా జీవిస్తాయి. కానీ శారీరక హింస, మానసిక హింసతో కొన్నిసార్లు విడిచిపెట్టే సంబంధాలు ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కలుస్తారు. కానీ మళ్లీ అదే కథ రిపీట్ అవుతుంది. ఈ రకమైన సంబంధం విషపూరిత సంబంధం, అటువంటి సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం మంచిది.

మీరు ప్రేమించిన వ్యక్తి కోసం అన్ని త్యాగాలు చేసినా వారి నుంచి ప్రేమ లభించకపోతే వారి దూరంగా ఉండండి. ప్రేమ కోసం కుటుంబాన్ని, ఆస్తులను, హోదాను త్యాగం చేసే వారిని చూస్తాం. అయితే ఆ వ్యక్తి కోసం మీరు చాలా త్యాగం చేసినప్పటికీ, ఆ వ్యక్తి మీ పట్ల ప్రేమగానో, గౌరవంగానో ఎలాంటి మాటలు మాట్లాడకపోతే విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవాలి.

మీరు బ్రేకప్ గురించి ప్రతిసారీ ఆలోచిస్తూ ఉంటే ఈ సంబంధంలో మీరు సుఖంగా లేకుంటే మన భావాలను గౌరవించడం లేదని, మనల్ని ప్రేమించడం లేదని అర్థం అయితే రిలేషన్ షిప్ వదిలివేయడం మంచిది. మనం తరచూ ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యక్తి మన హృదయానికి దగ్గరగా లేడు అని అర్థం. ఇది ప్రేమ కాదు.. అలాంటి బంధం నుంచి బయటపడితే ఇద్దరికీ మేలు జరుగుతుంది.

మనం ఎంతగానో విశ్వసించే వ్యక్తి మోసం చేసినా వారి మోసం గురించి మీకు తెలిసి మీకు క్షమాపణలు చెప్పి, అదే తప్పును పదే పదే చేస్తే వారికి దూరం అవ్వడం మంచిది. లేకపోతే మీరు చాలా మానసికంగా బాధపడాల్సి వస్తుంది. ప్రేమ అంటే ఆ రిలేషన్ షిప్ లో నిబద్ధత ఉండాలి. లేకపోతే అలాంటి రిలేషన్ షిప్ లో కొనసాగడం బాధ తప్ప మరేమీ మిగలదు.

మీరు ప్రేమికులుగా మారితే భవిష్యత్తు గురించి కలలు కంటారు. కానీ మీరు ప్రేమించిన వ్యక్తి భవిష్యత్ ప్రణాళికలలో లేరని మీకు తెలిసినప్పుడు, అలాంటి సంబంధంలో కొనసాగడం గురించి ఆలోచించడం మంచిది. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు అలాంటి సంబంధం గురించి జాగ్రత్తగా ఉండాలి.

మనం ఎంతగానో ఇష్టపడే వృత్తిని మన భాగస్వామి గౌరవించకపోతే మీరు కచ్చితంగా దూరంగా ఉండాలి. మన భావాలను గౌరవించరు. స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. అలాంటి సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారితో రిలేషన్ షిప్ కొనసాగించాలా వద్దా అని ఆలోచిస్తే మంచిది.. లేకుంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.

మనం అంటే ఇష్టం లేని వాళ్లకు దగ్గరగా ఉండి.. దూరం అవ్వడం కంటే.. దూరంగా ఉండి ఆనందంగా ఉండటం మంచిది. మీ లైఫ్ మీరు చూసుకోవాలి.

WhatsApp channel