Saturday Motivation : జీవితంలో ఒక్కో దశలో.. ఒక్కొక్కరికి విభిన్న అనుభవాలు కలుగుతాయి. అవి మనల్ని విభిన్నంగా ప్రేరేపిస్తాయి. కానీ వేర్వేరు పరిస్థితులకు తగిన విధంగా స్పందించడం అందరూ నేర్చుకోవాలి. తద్వారా మన ప్రతిచర్యలు అర్థవంతంగా ఉంటాయి. అంతేకాకుండా అవి ఎవరిపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపించవు. కొన్నిసార్లు.. కొన్ని విషయాల్లో మనం ప్రతిస్పందించడానికి బదులు మనం మూగబోతాము. కానీ కొన్ని సమయాల్లో.. మనకు బలమైన అభిప్రాయం ఉంటుంది. దానిని వ్యక్తపరచాలని కూడా చూస్తాము. కానీ అలా చేయడం వల్ల పరిణామాలు మారిపోయే అవకాశముంది. మన భావాలను వ్యక్తపరచే ముందు.. దాని తర్వాత జరిగే పర్యావసనాల గురించి ఆలోచించండి. ఎందుకంటే మీ మాటలు మీకు ఇబ్బంది కలిగించకపోవచ్చు కానీ.. వేరొకరిపై ప్రతికూలప్రభావాన్ని చూపే అవకాశముంది.,మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పోలిస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాల ఫలితాన్ని అంచనా వేసి.. దానికి అనుగుణంగా సైలంట్‌గా ఉండిపోవడమే మంచిది. అంటే ప్రతిసారి సైలంట్‌గా ఉండమని అర్థం కాదు. తప్పు జరిగితే వ్యతిరేకంగా పోరాడాలి. అయితే ప్రతిస్పందించే ముందు పరిస్థితిని అంచనా వేయండం చాలా ముఖ్యం. మీ ప్రతిచర్య ఇతరులను ప్రతికూలంగా ప్రభావితం చేయకూడదు. మౌనంగా ఉండడం ద్వారా అనవసరమైన నాటకీయతను నివారించవచ్చు. ఇది ఎల్లప్పుడూ అందరికీ మంచిదని గుర్తుంచుకోవాలి. సమస్యను పరిష్కరించడానికి మరింత సరైన సమయాలు, సందర్భాలు కూడా రావొచ్చు.,కొన్నిసార్లు మౌనంగా ఉండకపోవడం వల్ల మీరు కోరుకోని పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి మౌనంగా ఉండండి. మౌనంగా ఉండడం అంటే మీరు చేయాల్సిన పనికి దూరంగా ఉన్నారని అర్థం కాదు. మాటలు కంటే చర్యలు బిగ్గరగా మాట్లాడతాయి. కాబట్టి సైలంట్‌గా మీ పని మీరు చేసుకోండి. అది అర్థవంతంగా ఉంటుంది. సమస్యను పరిష్కరించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.,