Saturday Motivation : సింగిల్ కొట్టేవాడు ఫిల్డర్లను చూస్తాడు.. సిక్సులు కొట్టేవాడు బౌండరీ చూస్తాడు
Saturday Motivation : కొంతమంది ధైర్యం లేక ఏదీ చేయరు. చేస్తే ఏమవుతుందోననే భయంతో ఉంటారు. ఏదైనా చేయాలంటే.. వందసార్లు ఆలోచిస్తారు. అడుగు మాత్రం వేయరు. ఒకవేళ అడుగు వేసినా.. ఉన్నచోటే తిరుగుతూ ఉంటారు. గమ్యం వైపు వెళ్లేందుకు పెద్దగా ప్రయత్నం చేయరు.
ధైర్యం లేకపోతే మనిషి ఏం చేయలేడు. మనిషికి ఉండే ధైర్యం ఎలా ఉండాలంటే.. క్రికెట్లో బౌండరీని మాత్రమే చూసేలా ఉండాలి. సింగిల్ కొట్టేలా ధైర్యం ఉంటే.. చాలా కష్టపడాల్సి వస్తుంది. క్రికెట్ నే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక మ్యాచ్ గెలవాలంటే.. సింగిల్స్ మాత్రమే తీస్తే.. ప్లేయర్స్ కి ఎంత కష్టం ఉంటుంది. అదే బౌండరీలు కొడితే.. అవలీలగా గెలిచేస్తారు. కష్టం కూడా తక్కువే ఉంటుంది... చూడాల్సింది ఫిల్డర్లను కాదు.. బౌండరీనే. మీ జీవితంలోనూ చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మీరు చేరాల్సిన గమ్యం బౌండరీలాంటిది.. దాని మీదే ఫోకస్ ఉండాలి. కష్టాలను దాటితేనే సుఖం. ఓ చిన్న కథ చదవండి..
సహదేవ, మహాదేవ అనే ఇద్దరు విద్యార్థులు ఒక పెద్ద గురుకులంలో చాలా కాలంగా చదువుతున్నారు. ఆ ఇద్దరు విద్యార్థులు చాలా సన్నిహితులు. అందులో మహాదేవ నిజాయితీపరుడు. మనసులో ఏదీ పెట్టుకోడు. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడతాడు. తాను నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలనే తపన అతనికి ఉంది. ప్రతి ఒక్కరూ తనలాగే నిజాయితీగా ఉండాలని కోరుకునే వ్యక్తి.
ఇక అతడి మిత్రుడు సహదేవ కాస్త డిఫరెంట్. అతను బహిరంగంగా ఏమీ చెప్పడు. కానీ చాలా ఓపికగా ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా, అవమానించినా, మోసం చేసినా మనసులో పెట్టుకుని బాధపడేవాడు. ఒకసారి ఆడుకుంటుండగా ఓ విద్యార్థి అతనిపైకి ఎక్కి కొట్టాడు. ఈ సమయంలో మహదేవ అక్కడ లేడు.
దీంతో సహదేవ అస్వస్థతకు గురయ్యాడు. స్నేహితుడికి బాగా లేదని తెలిసి.. వైద్యుడి వద్దకు తీసుకెళ్తాడు మహదేవ. అయితే వారితోపాటుగా ఓ గురువు కూడా వెళ్తాడు. వెళ్లే సమయంలో సహదేవుడితో గురువు ఇలా అంటాడు..'ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి కాదు. నీ మనసుకు సంబంధించిన వ్యాధి. నువ్వే నయం చేసుకోవాలి.' అన్నాడు.
సహదేవునికి చాలా సహనం ఉంది.. కానీ మనస్సులో ధైర్యం లేదు.. ఇదే విషయాన్ని చెప్పాడు గురువు. ఇవి కూడా ఒక రకమైన వ్యాధి. కాబట్టి ఆ వ్యాధి నయమైతే అంతా సరిగా ఉంటుందని తెలిపాడు.
మనం కూడా జీవితంలో ధైర్యం లేక.. గమ్యం వైపు చూడం. ఉన్నచోటే.. సింగిల్స్ తీస్తూ.. ఉండిపోతాం. అదే ఒక్కసారి తలెత్తి.. బౌండరీ వైపు చూడండి. ఎంతో గొప్పగా ఉంటుంది. ఒక్కసారి విజయం అనే బౌండరీ లైన్ తాకితే.. మీకు వచ్చే తృప్తే వేరు. కానీ ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని మనసులో నింపుకోవాలి. అప్పుడే.. సింగిల్స్ అనే సమస్యల చుట్టూ కాకుండా... సిక్స్ అనే గెలుపు చుట్టూ మీ మనసు తిరుగుతుంది.
చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు.. కానీ బతికేందుకు అది జీవితాంతం కావాలి..
నిజమైన మరణం అంటే.. ప్రాణం కోల్పోవడం కాదు.. ధైర్యం కోల్పోవడం..!