Saturday Motivation : నీ శారీరక ఆరోగ్యమే.. మానసిక ఆరోగ్యం.. గట్టిగా జిమ్ చేయ్-saturday motivation how to motivate yourself with workout heres simple tips for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : నీ శారీరక ఆరోగ్యమే.. మానసిక ఆరోగ్యం.. గట్టిగా జిమ్ చేయ్

Saturday Motivation : నీ శారీరక ఆరోగ్యమే.. మానసిక ఆరోగ్యం.. గట్టిగా జిమ్ చేయ్

HT Telugu Desk HT Telugu
Sep 02, 2023 05:00 AM IST

Saturday Motivation : మానసికంగా అంతా అయిపోయింది అనుకుంటున్నారా? అలాంటప్పుడే జిమ్ వెళ్లండి. గట్టిగా జిమ్ చేయండి. మీ చెమటతో శరీరమంతా తడవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే.. మానసికంగా బలంగా ఉంటారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. కానీ చాలా సార్లు మనం వర్కవుట్ చేయడం ప్రారంభించి కొన్ని రోజుల తర్వాత మానేస్తాం. బహుశా ఇది మీకు కూడా జరగవచ్చు. వర్కవుట్ రొటీన్ డిస్టర్బ్ అయితే.. దాన్ని పునఃప్రారంభించడం కచ్చితంగా చాలా సోమరితనంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీ వ్యాయామ దినచర్యను మళ్లీ ప్రారంభించినట్లయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటించాలి.

ఇది మిమ్మల్ని మీరు మంచి మార్గంలో ప్రేరేపించడానికి సహాయపడుతుంది. ఏదైనా పని వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రేరణ పొందగలరు. మీరు ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం చేస్తే, ఈ రొటీన్‌ను మళ్లీ మళ్లీ బ్రేక్ చేయవచ్చు. కానీ మీకు ఏదైనా మానసిక సమస్యలు ఉన్నా.. రెగ్యులర్‍గా జిమ్ చేయండి. ధ్యాస అటు వైపు వెళ్తుంది. రెగ్యులర్ వర్కవుట్‌లు చేయడం ద్వారా మీ సమస్య పరిష్కారమవుతుందని, మీరు మానసికంగా గట్టిగా ఉన్నారని మీకు అనిపిస్తే.. మరింత ఉత్సాహంగా ఉంటారు.

తరచూ జిమ్ చేయడం బ్రేక్ చేయడం కూడా మంచిది కాదు. మీకు ఇలా జరగడానికి గల కారణాలపై దృష్టి పెట్టాలి. శారీరకంగా ఏదైనా పని చేసి అలసిపోతే.. మరుసటి రోజు జిమ్ చేయోద్దని సాకును చుపిస్తారు. కానీ మీరు మానసికంగానూ బలంగా ఉండేందుకు కూడా జిమ్ చేయండి. మిమ్మల్ని మీరు మరింత ప్రేరేపించడానికి, వ్యాయామం సమయంలో మీ ఆసక్తిని కొనసాగించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజూ వేర్వేరు సమయాల్లో వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.

కొంతమంది వ్యాయామం చేయడం ప్రారంభిస్తారు. కానీ త్వరలోనే ఆసక్తి తగ్గుతుంది. ఈ పరిస్థితిలో శిక్షకుడి సహాయం తీసుకోవడం మంచిది. శిక్షకుడు వర్కవుట్ అంతటా మిమ్మల్ని ప్రేరేపించేలా చేస్తాడు. వారి మార్గదర్శకత్వం కారణంగా, మీరు సరైన మార్గంలో జిమ్ చేయగలుగుతారు. మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

శారీరక ఆరోగ్యం కాపాడుకోవడంలో మానసిక ఆరోగ్యం దాగి ఉంది. డ్రిపెష‌న్, ఆందోళ‌న వంటి మాన‌సిక అనారోగ్యాల నుంచి బయటపడేందుకు జిమ్ చాలా ఉపయోగరం. ఏవేవో ఆలోచనలు ఉన్నప్పుడు ఓ గంట జిమ్ చేసి రండి.. ఎంతో ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. మానసికంగా సరిగా లేకుంటే.. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. వ్యాయామం అనేది శారీర‌క ఆరోగ్యానికి ఎంత అవ‌స‌ర‌మో.. మానసిక ఆరోగ్యానికి కూడా అంతే అవసరం. పరిశోధనలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి.

Whats_app_banner