Sankranti: సంక్రాంతికి కచ్చితంగా తినాల్సిన ఆహారం కలగూర, ఈ కూరను ఎలా వండాలంటే-sankranti recipe kalagura know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sankranti: సంక్రాంతికి కచ్చితంగా తినాల్సిన ఆహారం కలగూర, ఈ కూరను ఎలా వండాలంటే

Sankranti: సంక్రాంతికి కచ్చితంగా తినాల్సిన ఆహారం కలగూర, ఈ కూరను ఎలా వండాలంటే

Haritha Chappa HT Telugu
Jan 13, 2025 11:30 AM IST

Kalagura Recipe:సంక్రాంతికి ఖచ్చితంగా తినాల్సిన కలగూర కూర ఇది. ఆనవాయితీగా తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల దీన్ని తింటారు. అన్నం చపాతీతో అదిరిపోతుంది.

సంక్రాంతికి కలగూర రెసిపీ
సంక్రాంతికి కలగూర రెసిపీ (Youtube)

సంక్రాంతి వచ్చిందంటే ఆనవాయితీగా వండాల్సిన వంటలు కొన్ని ఉన్నాయి. వాటిలో అరిసెలు, సున్నుండలు, జంతికలు ఎలానో కలగూర కూడా అంతే కచ్చితంగా ఉండాలి. కలగూరతో కమ్మని ఇగురు కూర లేదా పులుసు చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో అనేక రకాల కూరగాయలను కలిపి చేస్తారు. కాబట్టి కలగూర అనే పేరును పెట్టారు. ఎన్నో రకాల ఆకుకూరలను కూడా వేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కలగూర రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

yearly horoscope entry point

కలగూర కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

మెంతికూర తరుగు - ఒక కప్పు

తోటకూర తరుగు - రెండు కప్పులు

నీరు - తగినంత

చుక్కకూర తరుగు - ఒక కప్పు

వంకాయలు - రెండు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

శెనగపిండి - మూడు స్పూన్లు

ధనియాల పొడి - ఒక స్పూను

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

టమోటోలు - రెండు

పచ్చిమిర్చి - నాలుగు

ఉల్లిపాయలు - రెండు

కరివేపాకులు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

వెల్లుల్లి రెబ్బలు - పది

జీలకర్ర - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - మూడు స్పూన్లు

నూనె - తగినంత

ఎండుమిర్చి - రెండు

ఆవాలు - ఒక స్పూను

కలగూర రెసిపీ

1. కలగూరలో మనం అనేక రకాల కూరగాయలను కలిపి వండుతాము.

2. మీకు కావాలనుకుంటే మరిన్ని కూరగాయలను కలుపుకోవచ్చు.

3. ఇక్కడ మేము మూడు రకాల ఆకుకూరలు, వంకాయ, టమాట, ఉల్లిపాయలు వంటివి కలిపాము.

4. స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేయండి.

5. అందులో రెండు ఎండుమిర్చిని, మూడు స్పూన్ల పచ్చిశనగపప్పును వేసి వేయించండి.

6. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకులు, వెల్లుల్లి తరుగును వేసి వేయించండి.

7. అలా అవి వేగాక ఉల్లిపాయ తరుగు కూడా వేసి వేయించండి.

8. చిటికెడు ఉప్పును కూడా వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి.

9. అందులోనే పచ్చిమిర్చి తరుగును కూడా వేసి బాగా వేయించండి.

10. ఇవన్నీ వేగాక టమాటా ముక్కలను సన్నగా తరిగి అందులో వేసి బాగా కలపండి.

11. అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి.

12. ఇవి ఉడకడానికి మూడు స్పూన్ల నీళ్లు కూడా వేసి బాగా కలిపి చిన్న మంట మీద మూత పెట్టి ఉంచండి.

13. టమోటాలు మెత్తగా ఉడికి గుజ్జులాగా అవుతాయి. అప్పుడు ఒకటిన్నర స్పూను కారం కూడా వేయండి.

14. దాన్ని బాగా కలపండి. ఇప్పుడు వంకాయలను మీడియం సైజు ముక్కలుగా కోసుకొని అందులో వేసి బాగా కలపండి.

15.పైన మూత పెట్టి వంకాయలు మెత్తగా అయ్యేవరకు ఉడికించండి.

16. అవసరమైతే కొంచెం నీటిని వేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆకుకూరలు అన్నిటిని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోండి.

17. మెంతులు, చుక్కకూర, తోటకూర అన్నింటినీ వేసి బాగా కలపండి.

18. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి మూత పెట్టండి.

19. ఇప్పుడు చింతపండును నానబెట్టి ఆ నీటిని కూడా వేసి బాగా కలపండి.

20. ఆ నీళ్లలోనే సెనగపిండిని కూడా వేసి ఒకసారి గిలక్కొట్టి ఈ మిశ్రమంలో వేసేయండి.

21. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి.

22. అంతే కలగూర కూర రెడీ అయినట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

23. ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేస్తే ఎన్నో ఆకుకూరలను వేసాము.

24. మీకు కావాలనుకుంటే దొండకాయ, చిక్కుడుకాయ వంటి కూరలను కూడా ఇందులో వేసుకోవచ్చు. ఈ కూర అద్భుతంగా ఉండడం ఖాయం.

సంక్రాంతికి అన్ని రకాల కూరలను వండిచేసే ఈ కలగూర తినడం వల్ల శరీరానికి పోషకాహార లోపం రాదు. అందుకనే సంక్రాంతికి కచ్చితంగా దీన్ని తినేలా ఒక ఆచారంలా పెట్టారు. దీన్ని వండడం రాక ఎంతో మంది వదిలేస్తూ ఉంటారు. కలగూరను చక్కగా వండితే రుచి అద్భుతంగా ఉంటుంది.

Whats_app_banner