Samsung Galaxy A04s। గెలాక్సీ A-సిరీస్ విస్తరిస్తూ, మరో ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్-samsung galaxy a04s smartphone launched check price and more details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Samsung Galaxy A04s Smartphone Launched, Check Price And More Details

Samsung Galaxy A04s। గెలాక్సీ A-సిరీస్ విస్తరిస్తూ, మరో ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్

HT Telugu Desk HT Telugu
Sep 01, 2022 11:17 PM IST

శాంసంగ్ తాజాగా Samsung Galaxy A04s పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy A04s
Samsung Galaxy A04s

శాంసంగ్ కంపెనీ భారత మార్కెట్లో తమ గెలాక్సీ A-సిరీస్‌ పరిధిని మరింత విస్తరించింది. తాజాగా Samsung Galaxy A04s పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది గత ఏడాది ప్రారంభించిన నుండి Galaxy A03లకు సీక్వెల్ కాగా, ఇటీవలే లాంచ్ చేసిన Galaxy A04కి అప్‌గ్రేడ్ వెర్షన్.

సరికొత్త Samsung Galaxy A04s అనేది ఒక ఎంట్రీ-లెవల్ ఫోన్, అయినప్పటికీ ఇది చాలా సమర్థవంతమైనది. ఈ ఫోన్ Android 12 అలాగే One UI కోర్ 4.1 ఆధారంగా పనిచేస్తుంది. ఇంకా అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, ఎక్సినోస్ చిప్‌సెట్, ట్రిపుల్ కెమెరా సెటప్ అలాగే ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ర్యామ్, స్టోరేజ్ పరంగా మూడు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి, బేసిక్ మోడల్ 3GB/32GB, మిడ్- రేంజ్ వేరియంట్ 4GB/64GB, టాప్- స్పెక్ వేరియంట్ 4GB/128GB. ఇక, కలర్ ఆప్షన్స్ పరిశీలిస్తే బ్లాక్, గ్రీన్, వైట్, కాపర్ వంటి నాలుగు కలర్లలో లభిస్తుంది.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. ధర ఎంత? తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy A04s స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగిన 6.5-అంగుళాల HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లే
  • 3GB/4GB ర్యామ్, 32GB/64GB/128 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం

కనెక్టివిటీ పరంగా Galaxy A04sలో USB టైప్-C పోర్ట్, Wi-Fi 5, బ్లూటూత్ 5.0, 4G, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, హెడ్‌ఫోన్ జాక్ సహా మరిన్ని ఉన్నాయి.

అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, లభ్యత గురించి కంపెనీ స్పష్టతనివ్వలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్