Samantha Watch Price: సమంత ధరించిన ఈ స్టైలిష్ వాచ్ ధర తెలిస్తే అవాక్కవుతారు! ఓ లగ్జరీ కారే కొనేయొచ్చు
Samantha Ruth Prabhu Watch Price: సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ స్క్రీనింగ్‍కు హాజరైన సమంత ఓ ప్రీమియం వాచ్ ధరించారు. ఇది బాగా హైలైట్ అయింది. దీని ధర తెలిస్తే అవాక్కవడం ఖాయమే. ఆ వివరాలు ఇవే..
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్ చేసిన ‘సిటాడెల్: హనీబన్నీ’ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. అంతకు ముందే ఈ సిరీస్ స్పెషల్ స్క్రీనింగ్ ముంబైలో జరిగింది. ఈ స్క్రీనింగ్‍కు సమంత హాజరయ్యారు. గోల్డ్ కలర్ స్ట్రాప్‍లెస్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు. అయితే, సమంత ధరించిన గోల్డ్ బ్రాస్‍లెట్ వాచ్ హైలైట్ అయింది. ఈ వాచ్ ధర ఆశ్చర్యపోయేంత ఉంది.
వాచ్ ధర ఇదే
సమంత ధరించిన ఆ ప్రీమియర్ స్టైలిష్ వాచ్.. బల్గారీ బ్రాండ్‍కు చెందినది. ఆ వాచ్ పేరు ‘సెర్పెంటీ టుబోగాస్ వాచ్’. బల్గారీ అఫీషియల్ వెబ్‍సైట్‍లో ఈ వాచ్ అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం వాచ్ ధర రూ.45,47,000గా ఉంది. వాచ్‍కే ఇంత రేటా అని అవాక్కయేలా చేస్తోంది. ఈ వాచ్ ధర రూ.45లక్షలకు పైగా ఉండగా.. అంత డబ్బుతో ఏకంగా ఓ లగ్జరీ ప్రీమియం ఎస్‍యూవీ కారే కొనేయొచ్చంటూ కామెంట్లు వస్తున్నాయి.
గోల్డ్, డైమండ్స్.. వాచ్ వివరాలు ఇవే
సమంత ధరించిన సెర్పెంటీ టుబోగాస్ డబుల్ స్పైరల్ వాచ్.. 18 క్యారెట్ గోల్డ్ కేస్, బ్రాస్‍లెట్‍తో ఉంది. ఈ వాచ్ డయల్ అంచుల వెంట కట్ డైమండ్స్ ఉన్నాయి. సిల్వర్ ఓలైన్ డయల్‍తో ఈ వాచ్ రూపొందింది. మహిళ శరీర కర్వ్స్, సెర్పెంట్ (పాము) ఫ్లుయిడ్ షేప్‍లను స్ఫూర్తిగా తీసుకొని షార్ప్లీ లైన్‍లతో, నిర్దిష్టమైన టెక్నిక్‍తో ఈ వాచ్‍ను డిజైన్ చేసినట్టు వెబ్‍సైట్‍లో బల్గారీ పేర్కొంది.
ఈ సెర్పెంటీ టుబోగాస్ డబుల్ స్పైరల్ వాచ్.. 35 మిల్లీమీటర్ల 18 క్యారెట్ల గోల్డ్ కర్వ్డ్ కేస్ సెట్, కట్ డైమండ్స్, గోల్డ్ క్రౌన్ సెట్‍ను కలిగి ఉన్నాయి.
సమంత డ్రెస్ ఇలా..
సిటాడెల్: హనీబన్నీ సిరీస్ స్పెషల్ స్క్రీనింగ్‍కు గోల్డ్ కలర్ సిల్హౌట్ డ్రెస్ ధరించి వచ్చారు సమంత. ఈ డ్రెస్‍ను క్రేషా బజాజ్ డిజైన్ చేశారు. స్ట్రాప్‍లెస్, ప్లంగింగ్ నెక్‍లైన్, బ్యాక్ స్లిట్‍తో సమంత ధరించిన ఈ డ్రెస్ ఉంది. మెటల్ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్‍తో ఈ డ్రెస్ తళతళ మెరిసింది. పర్‌ఫెక్ట్ పార్టీ లుక్‍లో సామ్ కనిపించారు. హూప్ ఇయర్‌రింగ్స్, గోల్డ్ బ్లాక్ హీల్స్ ధరించారు సమంత. సాఫ్ట్ బ్లో అవుట్ కర్ల్స్ హెయిర్ స్టైల్‍తో మరింత గ్లామరస్‍గా కనిపించారు.
మయోసైటిస్‍కు చికిత్స కారణంగా సుమారు ఏడాదిగా సమంత సినిమాలకు దూరంగా ఉన్నారు. తాను పాటిస్తున్న చికిత్స విధానాలు, కొన్ని ఆరోగ్య జాగ్రత్తలను కూడా సోషల్ మీడియా ద్వారా సమంత ఈ ఏడాది కాలంలో కొన్నిసార్లు పంచుకున్నారు సమంత. నటనకు బ్రేక్ ఇచ్చినా ఇన్‍స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు టచ్‍లోనే ఉంటున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు. సిటాడెల్: హనీబన్నీ సిరీస్‍లో వరుణ్ ధావన్‍తో కలిసి సమంత ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్‍లో యాక్షన్ సీన్లు కూడా చేశారు సామ్. త్వరలోనే మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఓ సిరీస్‍కు ఓకే చెప్పారు. తన సొంత బ్యానర్‌లో ఓ మూవీని కూడా ఇప్పటికే అనౌన్స్‌చేశారు.