Salsa Potatoes Recipe : సాల్సా పొటాటో.. మీ సాయంత్రానికి అదిరే స్నాక్​-salsa potatoes recipe for weekend evening snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Salsa Potatoes Recipe For Weekend Evening Snack

Salsa Potatoes Recipe : సాల్సా పొటాటో.. మీ సాయంత్రానికి అదిరే స్నాక్​

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 26, 2022 04:17 PM IST

Salsa Potatoes Recipe : వీకెండ్​లో మంచి స్నాక్​తో ఎంజాయ్ చేయాలనుకుంటే.. మీరు సింపుల్​గా, టేస్టీ ఐటమ్ తయారు చేసుకోవచ్చు. అదే సాల్సా పొటాటో. దీనిని తయారు చేయడం ఎంత సింపుల్ అంటే.. మీరు ఛాయ్ పెట్టుకుని.. అది అయ్యేలోపు.. ఈ స్నాక్ రెడీ చేసేసుకోవచ్చు.

సాల్సా బంగాళదుంపలు
సాల్సా బంగాళదుంపలు

Salsa Potatoes Recipe : సాల్సా బంగాళదుంపలు అనగానే ఇదేదొ పెద్ద ప్రాసెస్ రెసిపీ అనుకుంటారు. కానీ దీనిని చేయడం చాలా సింపుల్. ఇంట్లో ఉండే ఐటమ్స్​తోనే.. దీనిని సులువుగా, ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బంగాళదుపంలు - 3

* కారం - 1 టేబుల్ స్పూన్

* బ్లాక్ పెప్పర్ - 1 టేబుల్ స్పూన్

* ధనియాపొడి - 1 టేబుల్ స్పూన్

* ఉప్పు - తగినంత

* ఉల్లిపాయ - 1

* టమోటా - 1

* నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

కావాల్సిన పదార్థాలు

బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఓవెన్‌ను 150 డిగ్రీల సెల్సియస్ వద్ద ఐదు నిమిషాలు ముందుగా వేడి చేయండి. మీరు దానిపై కొంచెం నూనె వేయవచ్చు. లేదా నూనె లేకుండా కూడా రోస్ట్ చేయవచ్చు. బంగాళదుంపలు వేయించి.. వాటిని తీసి.. కారం, పెప్పర్, ధనియాపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపండి. దానిని తాజా టమోటాలు, ఉల్లిపాయలతో సర్వ్ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్