Saggubiyyam Vada Recipe : సగ్గుబియ్యంతో వడలు.. పెరుగుతో తింటే అస్సలు వదలరు..
Saggubiyyam Vada Recipe : ఉదయాన్నే క్రిస్పీగా, టేస్టీ, మృదువుగా ఉండే వడలు తినాలి అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా సగ్గుబియ్యంతో చేసే వడలు తినొచ్చు. దీనిని తయారు చేయడం కష్టం అనుకుంటున్నారేమో.. కానీ వీటిని వండడం చాలా సులభం.
Saggubiyyam Vada Recipe : స్పెషల్ టిఫెన్ తినాలి అనుకున్నప్పుడు చాలా మంది వడలు ఎక్కువగా తింటారు. వాటిని ఎక్కువగా మినపప్పుతో చేస్తారు. అయితే మీరు సగ్గుబియ్యంతో కూడా అదిరే టేస్టీ వడలు తయారు చేసుకోవచ్చు. మరి వీటని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* సగ్గుబియ్యం - 1 కప్పు (నానబెట్టిన)
* వేరుశెనగ - 1/2 కప్పు (గ్రౌండ్ చేసిన)
* పచ్చిమిర్చి - 1 tsp
* ఉప్పు - 1 tsp
* కారం - 1 tsp
* ఆలు - 1 కప్పు (ఉడికించినవి)
* కొత్తిమీర - 1 tbsp
* నిమ్మరసం - 1 tbsp
సగ్గుబియ్యం వడ తయారీ విధానం
ఒక గిన్నెలో నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకోండి. అందులో పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ఉడికించిన బంగాళదుంపలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసంతో పాటు.. వేరుశెనగ పిండి చేయాలి. మందపాటి మిశ్రమాన్ని తయారు చేయడానికి మెత్తగా చేసి కలపండి. వాటితో చిన్న, గుండ్రని, టిక్కీని తయారు చేసుకోండి.
వాటిని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయండి. అవి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి. వీటిని పెరుగుతో పాటు కలిపి తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి.
సంబంధిత కథనం