Saggu Biyyam Punugulu Recipe : సాయంత్రం వేళ కరకరలాడే.. సగ్గుబియ్యం పునుగులు
Saggu Biyyam Punugulu Recipe : కరకరలాడే స్నాక్స్ తినాలనిపిస్తే.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే ఓ సింపుల్ రెసిపీ ఉంది. అదే సగ్గుబియ్యం పునుగులు. అదేంటి సగ్గుబియ్యంతో పాయసం చేస్తున్నారు కానీ.. పునుగులు ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి.
Saggu Biyyam Punugulu Recipe : సగ్గుబియ్యం పునుగులు అనేది ఆంధ్రా స్టైల్ స్నాక్. ఇది లోపల మెత్తగా, బయట క్రిస్పీగా ఉంటుంది. సాయంకాలం హాయిగా కరకరలాడే స్నాక్స్ తినాలనిపిస్తే.. మీరు హాయిగా దీనిని తయారు చేసుకోవచ్చు. దీనిని వండుకోవడం చాలా తేలిక. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* సగ్గు బియ్యం - 1 కప్పు (2 గంటలు నానబెట్టాలి)
* పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
* బియ్యం పిండి - 1 కప్పు
* జీలకర్ర - 1 టీస్పూన్
* కారం - 1 టేబుల్ స్పూన్
* కరివేపాకు - 1 రెమ్మ (తరిగిన)
* పచ్చిమిర్చి - 2 (తరిగినవి)
* ఉల్లిపాయ - 1 (ముక్కలు)
* ఉప్పు - తగినంత
సగ్గుబియ్యం పునుగులు
సగ్గుబియ్యం పునుగులు తయారు చేయడానికి.. నానబెట్టిన సగ్గుబియ్యంను సాస్ పాన్‌లో తీసుకుని మరికొంత నీటితో కలిపి 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఉడికించిన సగ్గుబియ్యం, బియ్యంపిండి, పచ్చిమిర్చి సహా అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి. ఉప్పు కూడా వేసి బాగా కలపండి.
డీప్ ఫ్రై కోసం నూనె వేడి చేసి.. మిశ్రమాన్ని పునుగులుగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ రంగు వచ్చే వరకు.. కరకరలాడేలా వేయించుకోవాలి. వీటిని మీరు టీతో కలిపి తీసుకోవచ్చు. లేదా స్పైసీ కొబ్బరి చట్నీతో అయినా వీటిని తీసుకోవచ్చు.
సంబంధిత కథనం