తప్పు, కళ్లు పోతాయ్! వయసు పైబడుతున్నప్పుడు ఇలా చేయకూడదు కదా!!
Eye Care Tips in Summer: డాక్టర్ గణేష్ పిళ్లే.. ఈ వేసవిలో కంటి సంరక్షణకు కొన్ని చిట్కాలు సూచించారు. అవి ఇక్కడ తెలుసుకోండి.
కొందరు వయసు పైబడినా, ఇప్పటికీ తాము యూత్ అనుకుంటారు. ఇలా అనుకోవడం మంచిదే కానీ, యవ్వనంలో ఉనట్లుగా వ్యవహరిస్తే అందుకు మీ శరీరం సహకరించకపోవచ్చు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యువకులు కూడా ఎండలకు తాళలేక ఆనారోగ్యంబారిన పడతారు. అలాంటి వయసు పెరుగుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
వేసవిలో కఠినమైన సూర్య కిరణాలు ఒకవైపు, పెరిగిన స్క్రీన్ టైమ్ మరోవైపు అంటే.. తరచుగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ ఇతర డిజిటల్ పరికరాలను వీక్షించడం వలన కళ్లపై తీవ్రమైన భారం పడుతుంది. వయసు పెబడిన వారిలో ఇది మాక్యులర్ డీజెనరేషన్ (AMD- Age-Related Macular Degeneration) , డయాబెటిక్ రెటినోపతి వంటి రెటీనా వ్యాధులకు దారితీస్తుంది, ఇవి రెండూ కంటిలోని రెటీనా, ఆ ప్రాతంలోని రక్త నాళాలను దెబ్బతీసే పరిస్థితులు. ఇది కంటిచూపుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఎండకు గురికావడం, డిజిటల్ స్క్రీన్లను ఎక్కువగా చూడటం వంటి తప్పులు చేయొద్దు, కళ్లుపోతాయ్ అని కంటి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Eye Care Tips in Summer- వేసవిలో కంటి సంరక్షణ
HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, భోపాల్‌లోని ASG ఐ హాస్పిటల్‌లో మెడికల్ డైరెక్టర్ , కన్సల్టెంట్ డాక్టర్ గణేష్ పిళ్లే.. ఈ వేసవిలో కంటి సంరక్షణ (Eye care)కు కొన్ని చిట్కాలు సూచించారు. అవి ఇక్కడ తెలుసుకోండి.
సూర్యుని నుండి రక్షణ
సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాలు మన కళ్ళకు హాని కలిగిస్తాయి, ముఖ్యంగా ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు పీక్ అవర్స్ సమయంలో. ఆరుబయట సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు, సూర్యుని UVA, UVB కిరణాలను 100% నిరోధించే సన్ గ్లాసెస్, వెడల్పు అంచులు ఉన్న టోపీలు ధరించండి. ఇది UV రేడియేషన్ హానికరమైన ప్రభావాల నుండి మీ కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది , కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
స్క్రీన్ టైమ్ తగ్గించండి
మీ స్క్రీన్ టైమ్ తగ్గించాలి. అలాగే డిజిటల్ పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు తప్పకుండా మీ కళ్లకు విరామాలు ఇవ్వడం చాలా ముఖ్యం. "20-20-20" నియమం అనుసరించడానికి సులభమైన మార్గదర్శకం: ప్రతి 20 నిమిషాలకు, 20 సెకన్ల విరామం తీసుకోండి, 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడండి. ఇది కంటిపై ఒత్తిడిని, సుదీర్ఘ స్క్రీన్ సమయం వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
రెగ్యులర్ కంటి పరీక్షలు
ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి రెగ్యులర్ కంటి పరీక్షలు చాలా అవసరం. మధుమేహం ఉన్న వ్యక్తులలో డయాబెటిక్ రెటినోపతి వంటి రెటీనా వ్యాధులు సంభవించే అవకాశం ఎక్కువ. ఇది ముందుగానే గుర్తించి చికిత్స చేయకపోతే శాశ్వత దృష్టిని కోల్పోయేలా చేస్తుంది. మీ కంటి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, ఏవైనా సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి నేత్ర వైద్యుడు లేదా కంటి సంరక్షణ నిపుణుడిని సందర్శించండి.
సంబంధిత కథనం