Sabudana Kheer: పూర్వం సగ్గుబియ్యాన్ని అధికంగా వినియోగించేవారు. కానీ ఇప్పుడు సగ్గుబియ్యంతో ఏం వండాలో కూడా ఈ తరం వారికి తెలియడం లేదు. దీన్ని వినియోగించే వారి సంఖ్య తగ్గిపోయింది. సగ్గుబియ్యంతో చేసే వడలు, పాయసం చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. సగ్గుబియ్యం పాయసం అప్పుడప్పుడు పిల్లలకు తినిపించడం చాలా ముఖ్యం. ఈ సగ్గుబియ్యాన్ని కర్ర పెండలం అనే దుంపతోనే తయారు చేస్తారు. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. అయితే ఇది పూర్తిగా పిండి పదార్థం. కాబట్టి మధుమేహ రోగులు తక్కువగా తింటే మంచిది. పాయసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
సగ్గుబియ్యం - 100 గ్రాములు
కొవ్వు తీయని పాలు - లీటరు
చక్కెర - 150 గ్రాములు
బాదం - గుప్పెడు
పిస్తా - గుప్పెడు
యాలకుల పొడి - చిటికెడు
ఎండు ద్రాక్ష- మూడు
1. సగ్గుబియ్యాన్ని ముందు రోజే 12 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. అప్పుడే అవి మెత్తగా నానిపోతాయి.
2. ఇప్పుడు ఒక పాత్రలో పాలు వేసి మరిగించాలి. అందులో యాలకుల పొడిని వేయాలి.
3. పాలు మరుగుతున్నప్పుడే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని పాలల్లో వేయాలి.
4. సగ్గుబియ్యం గాజు ముక్కల్లా మెరిసేలా అయ్యే వరకు ఉడికించాలి.
5. చిన్న మంట మీద ఉడికిస్తే కాసేపటికి పాల పరిమాణం తగ్గుతుంది. అవి సగం వరకు అవుతాయి. అంటే మిశ్రమం చిక్కగా అవుతుంది.
6. అప్పుడు పంచదార, బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష తురుమును వేసి బాగా కలపాలి.
7. దీన్ని చల్లార్చి తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇందులో పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని కలుపుకోండి.
సగ్గుబియ్యాన్ని అప్పుడప్పుడు ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. ఇందులో పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. సగ్గుబియ్యాన్ని తరచూ తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. సగ్గుబియ్యాన్ని తరచూ తినేవారి మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక అభివృద్ధికి సగ్గుబియ్యం చాలా అవసరం. సగ్గుబియ్యంలో ఫొలేట్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గర్భిణులు సగ్గుబియ్యంతో చేసిన ఆహారాన్ని తినడం చాలా అవసరం. రక్తహీనతతో బాధపడే వారు తరచూ సగ్గుబియ్యంతో చేసిన వంటకాలను తినాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే ఐరన్ శరీరంలో చేరి హిమోగ్లోబిన్ ఉత్పత్తి ఎక్కువవుతుంది. సగ్గుబియ్యం తరచూ తినేవారిలో ఎముక సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆర్ధరైటిస్ వ్యాధి బారిన పడకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తినాలి. ఇది శరీరాన్ని మంచి షేప్ లో ఉంచుతుంది. వీటిలో ప్రొటీన్లు, ఐరన్, క్యాల్షయం అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఉపవాసం చేసినప్పుడు ఆ ఉపవాసాన్ని విరమించడానికి సగ్గుబియ్యం వంటకాలు ఎంతో మేలు చేస్తాయి.
టాపిక్