Health Benefits Of Rose: గులాబీతో ప్రేమను బయటపెట్టడం మాత్రమే కాదు మొటిమల నుంచి బరువు తగ్గడం వరకూ ఎన్నో ప్రయోజనాలు
Health Benefits Of Rose: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికులు తమ ప్రేమను బయటపెట్టేందుకు రోజా పువ్వులతో సిద్దమవుతున్నారు.అయితే గులాబీ పువ్వులు కేవలం ప్రేమను బయట పెట్టేందుకు మాత్రమే కాదని తెలుసుకోండి. మొటిమల నుంచి బరువు తగ్గించడం వరకూ అనేక రకాల సమస్యలను నయం చేస్తాయట.

ఇప్పటి వరకు మీరు గులాబీ పువ్వును మీ హృదయంలోని భావాలను పంచుకోవడానికి మాత్రమే ఉపయోగించినట్లయితే వాలెంటైన్స్ డే దగ్గర పడుతున్న ఈ సమయంలో దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి. ప్రేమ అనగానే గుర్తొచ్చే ఈ రోజా పువ్వు దాని అందం, సువాసన వల్ల మాత్రమే కాదు, దానిలో దాగి ఉన్న అనేక ఔషధ గుణాల వల్ల కూడా పువ్వుల రాజుగా నిలిస్తుంది. గులాబీ పువ్వులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. రోజా పువ్వులను క్రమం తప్పకుండా సేవించడం వల్ల చర్మంపై మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, సీజనల్ ఇన్ఫెక్షన్లతో పాటు అలెర్జీ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. గులాబీ పువ్వు వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఆరోగ్యానికి గులాబీ పువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు:
1) బరువు తగ్గడం
మీరు పెరుగుతున్న బరువుతో బాధపడుతున్నట్లయితే, గులాబీ పువ్వు మీ బాధను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడం కోసం 10 నుండి 15 గులాబీ రేకులను తీసుకుని నీటిలో నానబెట్టండి లేదా మరగబెట్టండి. నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారిన తర్వాత, దానిలో ఒక చెంచా తేనె, ఒక చిటికెడు దాల్చినచెక్క పొడిని వేసి ఆ నీటిని త్రాగాలి. 15-20 రోజులు క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మీ బరువులో తేడా అనిపిస్తుంది.
2) మొటిమలకు మేలు
మొటిమల సమస్యను తగ్గించడంలో గులాబీ పువ్వు చాలా సహాయపడుతుంది. దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిపోయేందుకు సహాయపడతాయి. ఇందుకోసం మీరు కొన్ని మెంతి విత్తనాలను వేయించి పొడి చేయండి. దాంట్లో రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌గా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖంపై రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. నిర్ణీత సమయం తర్వాత ముఖాన్ని రోజ్ వాటర్‌తో కడగండి.
3) జీర్ణక్రియను సులభతరం చేస్తుంది
గులాబీని లేదా గులాబీ నీటిని సేవించడం వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది, అలాగే గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం, వాపు వంటి పొట్టకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. గులాబీ రేకుల్లోని వాపు నిరోధక గుణాలు పొట్టలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి, దీనివల్ల గ్యాస్ట్రైటిస్ లేదా అల్సర్ వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
4) మానసిక స్థితి మెరుగుపరుస్తుంది
కొన్ని అధ్యయనాల ప్రకారం గులాబీలో మానసిక స్థితిని మెరుగుపరిచే, ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఉన్నాయని తేలింది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి గులాబీ ఆకుల ఆవిరిని పీల్చడం వల్ల ఉపశమనం లభిస్తుంది. గులాబీ పువ్వు, దాని సారం హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గులాబీ పువ్వులో ఉన్న విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
5) రోగనిరోధక శక్తిని పెంచుతుంది
గులాబీ రేకులను సేవించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ Cతో సమృద్ధిగా ఉన్న గులాబీ రేకులు ఇనుము శోషణలో సహాయపడతాయి, దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూతో పోరాడటంలో సహాయపడుతుంది. గులాబీ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం