Roasted Chicken: అస్సామీల స్టైల్లో రోస్టెడ్ చికెన్ వండి చూడండి, రెసిపీ ఇదిగో-roasted chicken recipe in telugu make it in assam style ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Roasted Chicken: అస్సామీల స్టైల్లో రోస్టెడ్ చికెన్ వండి చూడండి, రెసిపీ ఇదిగో

Roasted Chicken: అస్సామీల స్టైల్లో రోస్టెడ్ చికెన్ వండి చూడండి, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Published Feb 10, 2025 05:30 PM IST

Roasted Chicken recipe: మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా… అయితే ఇక్కడ మేము అస్సామీ స్టైల్ లో రోస్టెడ్ చికెన్ రెసిపీ ఇచ్చాము. ఈ చికెన్ డిష్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకుంటే మీరు మళ్లీ మళ్లీ వండుకుని తింటారు.

రోస్టెడ్ చికెన్ రెసిపీ
రోస్టెడ్ చికెన్ రెసిపీ

నాన్ వెజ్ అంటే మీకు ఇష్టమా? చికెన్ తో రకరకాల వంటకాలు వండేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ మేము రోస్టెడ్ చికెన్ రెసిపీ ఇచ్చాము. ఇది అస్సామీ స్టైల్లో చేసే వంటకం ఇది. ఒక్కసారి దీన్ని వండి చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చే చికెన్ వేపుడు ఇది. చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నా లేక పెద్ద ముక్కలుగా చేసుకున్నా రుచి అద్భుతంగా ఉంటుంది.

రోస్టెడ్ చికెన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ - అరకిలో

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

మిరియాల పొడి - ఒక స్పూను

నిమ్మరసం - మూడు స్పూన్లు

నల్ల నువ్వులు - అర కప్పు

నూనె - నాలుగు స్పూన్లు

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

అల్లం తరుగు - రెండు స్పూన్లు

ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు

రోస్టెడ్ చికెన్ రెసిపీ

  1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
  2. అందులో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
  3. దీన్ని 20 నిమిషాల పాటూ మ్యారినేట్ చేయాలి.

4. ఆ తర్వాత బాణలి వేడి చేసి అందులో నల్ల నువ్వులు వేసి ఒక నిమిషం వేయించి ప్లేట్ లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి.

5. ఆ తర్వాత చల్లార్చిన నల్ల నువ్వుల గింజలను మిక్సీ జార్ లో వేసి నూనె, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి నీళ్లు లేకుండా గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.

6. ఇప్పుడు ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ నుంచి అదనపు నీటిని తీసి వేయాలి.

8. అందులో నల్ల నువ్వుల పేస్ట్ ను బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత చికెన్ ను మరో 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

9. ఇంతలో మీ మైక్రోవేవ్ ఓవెన్ ను 180 డిగ్రీలకు ప్రీహీట్ చేసి రెడీగా ఉంచాలి.

10. ముందుగా వేడి చేసిన ఓవెన్ లో ట్రేతో చికెన్ ఉంచి పూర్తిగా ఉడికే వరకు 30 నిమిషాలు ఉడికించాలి.

11. 30 నిమిషాల తర్వాత చికెన్ ను ఓవెన్ నుంచి తీసి వెంటనే దానిపై నెయ్యి లేదా వెన్న రాయాలి.

12. అంతే రుచికరమైన అస్సామీ రోస్టెడ్ చికెన్ రెడీ అయినట్టే.

13. మీ ఇంట్లో ఓవెన్ లేకపోతే సాధారణ స్టవ్ మీద కళాయి పెట్టి కూడా ఈ చికెన్ పీసులను వేయించుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.

చికెన్ వేపుడు మేం చెప్పిన పద్ధతిలో చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది. బగారా రైస్ వండుకుని పక్కన ఈ రోస్టెడ్ చికెన్ పెట్టుకుంటే రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులకు ఇది ఎంతగానో నచ్చుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం