Rishabh pant and khichdi: యాక్సిడెంట్ తరువాత రిషబ్ పంత్ ఈ కిచిడీ డైట్‌తోనే కోలుకున్నాడట-rishabh pant recovered after the accident with this kichidi diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rishabh Pant And Khichdi: యాక్సిడెంట్ తరువాత రిషబ్ పంత్ ఈ కిచిడీ డైట్‌తోనే కోలుకున్నాడట

Rishabh pant and khichdi: యాక్సిడెంట్ తరువాత రిషబ్ పంత్ ఈ కిచిడీ డైట్‌తోనే కోలుకున్నాడట

Haritha Chappa HT Telugu
Jul 31, 2024 06:06 PM IST

Rishabh pant and khichdi: 2022లో రిషభ్ పంత్‌కు కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు. అతను త్వరగా కోలుకోవడానికి కిచిడీ డైట్ ఎంతో ఉపయోగపడిందని అతని న్యూట్రిషనిస్టు శ్వేతా తెలిపారు.

కిచిడీ డైట్
కిచిడీ డైట్

క్రికెటర్ రిషభ్ పంత్ 2022లో కారు యాక్సిడెంట్ కు గురయ్యాడు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అతని కాలికి తీవ్రమైన గాయం తగలింది. అతను కనీసం కదలలేని స్థితికి చేరుకున్నాడు. అతను ఇప్పుడు డబుల్ ఎనర్జీతో క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రమాదం కారణంగా 5-6 నెలలు నడవలేని, తినలేని పరిస్థితి ఏర్పడింది. కానీ కిచిడీ డైట్ తో రిషబ్ ఆరోగ్యం ఎంతగా మారిందో అతని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.

yearly horoscope entry point

రిషభ్ పంత్ న్యూట్రిషనిస్టు శ్వేతా షా శ్లోకా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ… రిషబ్ తనకు 2022లో ప్రమాదానికి ముందే తనకు తెలుసని చెప్పారు. ఈ ప్రమాదానికి రెండేళ్ల ముందు నుంచి రిషభ్ తనకు తెలుసని శ్వేతా అన్నారు. అతని జీవనశైలి ఎలా ఉంటుందో, ఏం తింటాడో కూడా ఆమెకు తెలుసు. ప్రమాదం జరిగిన అయిదు నుంచి ఆరు నెలల తర్వాత జూమ్ కాల్ ద్వారా శ్వేతా… రిషబ్ తో మాట్లాడారు. ఆ సమయంలో "శ్వేతా, నేను కొంచెం కూడా తినలేకపోతున్నాను. ఒక్క నిమిషం కూడా నడవలేను’ అని చెప్పాడు. వెంటనే శ్వేతా రిషభ్ పంత్ వాడే మందులన్నింటినీ ఆపేశారు. ఆ తర్వాత కిచిడీ డైట్ స్టార్ట్ చేశారు. శరీరంలోని గాయాలను నయం చేయడానికి కిచిడీ ఉత్తమమైనదని ఆయుర్వేదంలో కూడా చెప్పారు.

అనారోగ్యంతో ఉన్నవారికి కిచిడీ ఇస్తారని, ఆరోగ్యంగా ఉన్నవారు తిన్నా ప్రయోజనం ఉంటుందని శ్వేత అన్నారు. శాకాహారులకు ఇది అధిక-నాణ్యత ప్రోటీన్ ను అందించే ఆహారం అని చెప్పారు. కాయధాన్యాలు, బియ్యం కలిసి కిచిడీలో అమైనో ఆమ్లాలను ఏర్పరుస్తాయి. కిచిడీ చేయడానికి బ్రౌన్ రైస్ లేదా బాస్మతి రైస్ కాకుండా కోలం, సోనా మసూరి వంటి బియ్యం రకాన్ని వాడడం మంచిది. బాస్మతి బియ్యాన్ని పాలిష్ చేసి శుద్ధి చేస్తారు. బ్రౌన్ రైస్ ముతకగా ఉంటుంది. కిచిడీ తేలికగా ఉంటే, శరీరం శుభ్రపడటానికి సమయం లభిస్తుంది. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది.

కిచిడీ డైట్‌ను ప్రారంభించాక రిషబ్ ఆరోగ్య సమస్యలు యాభై శాతం వరకు తగ్గినట్టు శ్వేత తెలిపింది. ఆ తరువాత శరీరంలో ఉన్న ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గించే ఆహారాలను అందించారు. ఇందుకోసం లెమన్ షాట్, నల్ల ఎండుద్రాక్ష, నల్ల మిరియాలు ఇవ్వడం ప్రారంభించారు. దీని తరువాత, అతను తన శక్తిని తిరిగి పుంజుకోవాలంటే గతంలో మాదిరిగానే తినడం మొదలుపెట్టాడు. అతని శక్తి తిరిగి వచ్చింది, అతను బరువు పెరగడం కూడా ప్రారంభమైంది. రిషభ్ పంత్ కిచిడీ తినడం మొదలుపెట్టాక అతను కోలుకోవడం వేగవంతమైంది.

కిచిడీ వండడం కూడా చాలా సులువు. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పప్పులు, బీన్స్, బియ్యం వంటివి వేసి వండే కిచిడీ శరీరానికి ఎంతో బలాన్ని అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని అందిస్తుంది. కిచిడీని వండడం చాలా సులువు. బియ్యం, కంది పప్పు లేదా పెసరపప్పు, బీన్స్, క్యారెట్ వంటివి వేసి వండడమే. దీనిలో ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.

Whats_app_banner