Fitness: 44 ఏళ్ల వయసులో పూర్తిగా ఫిట్‍గా రణ్‍బీర్ కపూర్ సోదరి.. ఆమె ఫిట్‍నెస్ సీక్రెట్స్ ఇవే
Riddhima Kapoor: ఫాబ్యులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3లో రిద్ధిమా కపూర్ కనిపించారు. 44 ఏళ్ల వయసులోనూ ఫుల్ పిట్‍గా కనిపించారు. ఆమె ఫిట్‍నెస్ సీక్రెట్స్ ఏంటో ఇక్కడ చూడండి.
ఫాబ్యులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ మూడో సీజన్‍లో ఫుల్ పాపులర్ అయింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ సీజన్ ఫేమస్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ సోదరి ‘రిద్ధిమా కపూర్ సాహ్ని’ ఈ సీజన్‍లో తళుక్కుమన్నారు. 44 ఏళ్ల వయసులోనూ పూర్తి ఫిట్‍నెస్‍లో ఆశ్చర్యపరిచారు. తన ఫిట్‍నెస్ సీక్రెట్స్ ఏంటో రిద్ధిమా వెల్లడించారు.
నో డైట్
తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని, డైటింగ్ చేయనని రిద్ధిమా కపూర్ వెల్లడించారు. తాను అన్నీ తింటానని అన్నారు. “నేను డైట్‍లను పెద్దగా నమ్మను. నేను అన్నీ తింటా” అని రిద్ధిమా చెప్పారు. తాను ట్రూ కపూర్ అని, తన కుటుంబంలాగే తినేందుకు తాను చాలా ఇష్టపడతాని చెప్పారు. డైట్ విషయంలో కఠినంగా లేకపోయినా.. యోగా వల్ల తాను ఫిట్‍గా ఉన్నానని రిద్ధిమా చెప్పారు.
యోగానే.. జిమ్‍కు వెళ్లను
యోగా వల్లే తాను ఫిట్‍గా ఉన్నానని రిద్ధిమా కపూర్ తెలిపారు. తాను చేసే వర్కౌట్ అదొక్కటే అని చెప్పారు. “గత 14 ఏళ్లుగా నేను యోగా చేస్తున్నా. నేను చేసే ఏకైక వర్కౌట్ అదే. నేను జిమ్‍కు వెళ్లను. కార్డియో మిషన్లపై గంటలు గంటలు సమయం గడపను” అని రిద్ధిమా తెలిపారు.
ఫేవరెట్ ఆసనం ఇదే
యోగాలో రిద్ధిమాకు చక్రాసనం ఫేవరెట్‍గా ఉంది. ఈ షోలో ఆమె చక్రాసనం వేసి చూపించారు. తన అమ్మకు గౌరవంగా తాను ఈ ఆసనాన్ని ఎన్‍కే (నీతూ కపూర్) పోజ్ అని పిలుస్తానని చెప్పారు. యోగాలో చక్రాసనం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది. బ్లడ్ గ్లూకోజ్ నియంత్రణకు కూడా తోడ్పడుతుంది. బరువు కంట్రోల్‍లో ఉండేందుకు సహకరిస్తుంది. అలాంటి ముఖ్యమైన చక్రసనాన్ని రిద్ధిమా చాలా ఏళ్లుగా అనుకరిస్తున్నారు. యోగానే తన ఫిట్‍నెస్ ప్రధానమైన సీక్రెట్ అని తెలిపారు.
చక్రాసనం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం రెగ్యులర్‌గా చేస్తే శరీర ఫ్లెక్సిబులిటీ పెరగటంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది. గుండె సహా చాలా అవయవాల పనితీరు మెరుగవుతుంది. శక్తి కూడా అధికమవుతుంది. థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథులను ఇది ప్రేరేపించగలదు. జీవక్రియలు, హార్మన్ల సమతుల్యతకు కూడా ఈ ఆసనం మేలు చేస్తుంది.
టాపిక్