Restaurant Style Egg Keema Recipe: ఎగ్ కీమా రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్‌లో అదరగొట్టండిలా-restaurant style egg keema recipe by home chef in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Restaurant Style Egg Keema Recipe: ఎగ్ కీమా రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్‌లో అదరగొట్టండిలా

Restaurant Style Egg Keema Recipe: ఎగ్ కీమా రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్‌లో అదరగొట్టండిలా

HT Telugu Desk HT Telugu

Restaurant Style Egg Keema Recipe: రెస్టారెంట్‌లో లభించే ఎగ్ కీమా నోరూరిస్తుంది. అదే రెసిపీ ఇంట్లో కూడా సులువుగా తయారు చేసుకోవచ్చు. హోం మేకర్ సింధు అందించిన ఈ రెసిపీ మీరూ చూసేయండి. దీనికి ఏమేం కావాలి? స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కీమా రెసిపీ

ఇంట్లో ఎన్ని వంటకాలు చేసుకున్నా రెస్టారెంట్ వైపే మొగ్గు చూపడం ఇటీవలికాలంలో పెరిగిపోయింది. అయితే రెస్టారెంట్ స్టైల్ రెసిపీలు మనం ఇంట్లో కూడా సులువుగా చేసుకోవచ్చు. ఖర్చు ఆదా. అలాగే ఆరోగ్యమూ పదిలంగా ఉంటుంది. ఈ కోవలో ఎగ్ కీమా రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం

ఎగ్ కీమా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

  1. టమాటాలు - రెండు మూడు
  2. జీలకర్ర పొడి - చిటికెడు
  3. ఉల్లిపాయలు - 2
  4. పసుపు - పావు టీ స్పూన్
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
  6. పచ్చి మిర్చి - రెండు
  7. కోడి గుడ్లు - 3 లేదా 4
  8. వంట నూనె - 3 టేబుల్ స్పూన్లు
  9. మిరప పొడి - ఒకటిన్నర టీ స్పూన్
  10. ధనియాల పొడి - ఒక టీ స్పూన్
  11. ఉప్పు - ఒక టీ స్పూన్
  12. జీలకర్ర పొడి - అర టీ స్పూన్
  13. ఉడికించిన పచ్చి బఠానీలు - రెండు టీ స్పూన్లు
  14. గరం మసాలా - చిటికెడు

ఎగ్ కీమా తయారీ విధానం

స్టెప్ 1: రెండు మూడు టమోటాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రెండు ఉల్లిపాయలు తురుముకోవాలి. అలాగే మూడు లేదా నాలుగు గుడ్లు ఉడికించి తురిమి పెట్టుకోవాలి.

స్టెప్ 2: పాన్ వేడి చేసి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర వేసి, 2 కప్పుల ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగనివ్వాలి. మూత పెట్టి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.

స్టెప్ 3: పావు టీస్పూన్ పసుపు పొడి కలపాలి.ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ కలపాలి. టొమాటో పేస్ట్‌కు బదులుగా, టొమాటో ముక్కలను కూడా వేసుకోవచ్చు. నూనె పేరుకునే వరకు ఉడికించాలి.

స్టెప్ 4: ఈ సమయంలో రెండు పచ్చి మిర్చి ముక్కలు, ఒకటిన్నర టీస్పూన్ల మిర్చి పొడి వేసి కలుపుకోవాలి.

స్టెప్ 5: కాసేపు మగ్గిన తరువాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి.

స్టెప్ 6: ఇప్పుడు ఉడికించి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి కలపాలి.

స్టెప్ 7: ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలు వేసి కలుపుకోవాలి.

స్టెప్ 8: ఒక కప్పు నీరు పోసుకుని మిక్స్ చేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడికించాలి.

స్టెప్ 9: చివరగా పావు టీ స్పూన్ గరం మసాలా పొడి కలుపుకోవాలి. దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి.

- సింధు, హోమ్ మేకర్