Dal Tadka: రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా రెసిపీ... ఇలా చేశారంటే ఏం కూర దీనికి సాటి రాదు-restaurant style dal tadka recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dal Tadka: రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా రెసిపీ... ఇలా చేశారంటే ఏం కూర దీనికి సాటి రాదు

Dal Tadka: రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా రెసిపీ... ఇలా చేశారంటే ఏం కూర దీనికి సాటి రాదు

Haritha Chappa HT Telugu
Apr 19, 2024 11:44 AM IST

Dal Tadka: దాల్ తడ్కా అనగానే పప్పే కదా అని తేలిగ్గా తీసుకోకండి. దీన్ని వండే రీతిలో సరిగ్గా వండితే రుచి అదిరిపోతుంది. రెస్టారెంట్ స్టైల్ లో దాల్ తడ్కా ఎలా వండాలో ఇక్కడ ఇచ్చాము.

దాల్ తడ్కా రెసిపీ
దాల్ తడ్కా రెసిపీ

Dal Tadka: సాధారణంగా ఇంట్లో అందరూ పప్పు వండుకుంటారు. ఆ పప్పు దాల్ తడ్కా ఒకటే అనుకుంటాము. రెస్టారెంట్ స్టైల్‌లో దాల్ తడ్కా వండి చూడండి. ప్రతి ఒక్కరికీ ఇది నచ్చడం ఖాయం. వేడి వేడి అన్నంలో ఈ దాల్ తడ్కా కలుపుకొని తింటూ మధ్య మధ్యలో అప్పడాలని నంజుకుంటే ఆ టెస్టే వేరు. దీన్ని చాలా సులువుగా చేయొచ్చు. దీన్ని ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు తెలుసుకోండి.

yearly horoscope entry point

దాల్ తడ్కా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మసూర్ దాల్ - పావు కప్పు

పెసరపప్పు - పావు కప్పు

కందిపప్పు - అరకప్పు

పచ్చిమిర్చి - మూడు

పసుపు - అర స్పూను

నూనె - రెండు స్పూన్లు

నీళ్లు - మూడు కప్పులు

నెయ్యి - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటి

టమాటాలు - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఇంగువ - పావు స్పూను

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

ఎండుమిర్చి - రెండు

బటర్ - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

రెస్టారెంట్ స్టైల్‌లో దాల్ తడ్కా రెసిపీ

1. కందిపప్పు, పెసరపప్పు, మసూర్ దాల్ అన్నింటినీ శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.

3. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెసరపప్పు కందిపప్పు, మసూర్ దాల్, పచ్చిమిర్చి, పసుపు, అర స్పూను నూనె వేసి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. నూనె వేడెక్కాక రెండు స్పూన్ల నెయ్యి వేయాలి.

6. ఉల్లిపాయల తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటో తరుగు, గరం మసాలా అన్ని వేసి బాగా వేయించాలి.

7. రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.

8. ఇదంతా ఇగురులాగా అవుతుంది.

9. కుక్కర్ మూత తీసి పప్పును బాగా కలిపి టమోటో ఇగురులో వేసి బాగా కలపాలి.

10. అలాగే 1/2 కప్పు నీళ్లను కూడా వేయాలి.

11. ఇదంతా బాగా ఉడికాక తాళింపు వేసుకోవాలి.

12. తాళింపు కోసం చిన్న కళాయిలో ఒక స్పూను నెయ్యి, పావు స్పూన్ ఇంగువ, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలు, ఒక స్పూను బటర్, ఒక స్పూను కారం వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పప్పులో కలుపుకోవాలి.

13. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో దాల్ తడ్కా రెడీ అయినట్టే.

14. ఇది ఏ కూరకు తీసిపోని విధంగా ఉంటుంది. దీన్ని ఒకసారి చేసుకున్నారంటే సాధారణ పప్పును మానేసి ఇదే ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు.

ఇందులో మనము పెసరపప్పు, మసూర్ దాల్, కందిపప్పు, ఇంగువ, నెయ్యి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, టమోటోలు వంటి ఎన్నో ఆరోగ్యకరమైన కూరగాయలను వినియోగించాము. కాబట్టి ఇది అన్ని రకాలుగా మేలే చేస్తుంది. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా నచ్చుతుంది. స్పైసీగా ఇష్టపడేవారు దీంట్లో కారాన్ని కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. పిల్లలకు కారాన్ని తగ్గించి కాస్త నెయ్యిని జోడించి పెడితే ఇష్టంగా తింటారు.

Whats_app_banner