చైత్ర నవరాత్రులు మొదలయ్యే రోజు వచ్చేస్తోంది. హిందూమతంలో ఈ పవిత్రమైన నవరాత్రి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చాలా ప్రత్యేకమైనవి. కాబట్టి ఆ పండుగకు ముందుగానే ఇంటిని సిద్ధం చేసుకుంటారు.
తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఇంటికి వస్తారని భక్తుల నమ్మకం. అందువల్ల ఇంటిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. మీరు కూడా నవరాత్రులకు శుభ్రం చేస్తుంటే, ఖచ్చితంగా కొన్ని వస్తువులను ఇంటి నుండి బయటకు పడేయాలి. ఇవి మీ ఇంటి అలంకరణను పాడు చేయడమే కాకుండా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. నవరాత్రులు మొదలయ్యే ముందు ఇంటి నుంచి ఎలాంటి వస్తువులు బయట పడేయాలో తెలుసుకోండి.
మీ ఇంట్లో కూడా చిరిగిన బట్టలు, బూట్లు ఉంటే నవరాత్రుల ప్రారంభానికి ముందే బయటపడేయండి. చిరిగిన బట్టలు, బూట్లు ఇంటి అందాన్ని తగ్గించడమే కాకుండా స్థలాన్ని ఆక్రమిస్తాయి. అలాగే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. మీ పాత బట్టలను, చెప్పులను అవసరమైన వారికి దానం చేస్తే ఇంకా మంచిది. ఉపయోగించడానికి పనికిరాని వస్తువులను కూడా తీపిపడేయాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది.
అందరి ఇంట్లో కొన్ని అలంకరణ వస్తువులు ఉంటాయి. అవి కొన్ని పాడైపోతాయి, కొన్ని పనిచేయవు. చాలా మంది వాటిని పారవేయడానికి బదులుగా ఇంట్లో ఎక్కడో దగ్గర ఉంచుతారు. అలా చేయడం సరికాదు. వాస్తవానికి విరిగిన వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. దురదృష్టాన్ని కూడా తెస్తాయి. కాబట్టి పనిచేయని వస్తువులను రిపేర్ చేయించుకోవాలి. ఈ నవరాత్రులలో మీ ఇంటిని కొత్త అలంకరణ వస్తువులతో కొత్తగా మార్చండి.
ఇంట్లో దేవతల విగ్రహాలు విరిగినవి, పగిలినవి ఉంటే వాటిని ఉంచకూడదు. ముఖ్యంగా నవరాత్రులు ప్రారంభానికి ముందే వాటిని తొలగించాలి. మత విశ్వాసాల ప్రకారం, మీరు వాటిని నది లేదా చెరువులో నిమజ్జనం చేయవచ్చు. లేదా ఏదైనా దేవాలయంలో ఉంచవచ్చు. విరిగిన విగ్రహాల స్థానంలో ఈ నవరాత్రుల్లో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించండి.
నవరాత్రుల్లో సాత్వికమైన ఆహారమే ఇంట్లో ఉంచాలి. మీ ఇంట్లో మద్యం బాటిళ్లు ఉన్నా, మాంసాహారం వంటివి తొలగించండి. వీటితో పాటు వెల్లుల్లి, ఉల్లిగడ్డలను కూడా నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ఇంట్లో లేకుండా చూసుకోవాలి.
మీ ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో పూర్తిగా ఎండిపోయిన చెట్లు, మొక్కలు ఉంటే, నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు వాటిని తొలగించండి. అవి అందంగా కనిపించవు. పైగా ప్రతికూలత శక్తిని ఆకర్షిస్తాయి. బదులుగా, మీ ఆవరణలో అందమైన పచ్చని చెట్లు, మొక్కలను నాటండి. వాటిని బాగా సంరక్షించండి. ఇవి మీ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయి.
సంబంధిత కథనం