నిద్రపోయేటప్పుడు తల కింద దిండు పెట్టుకొని నిద్రపోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. నూటికి 90 మంది ఇదే అలవాటును కలిగి ఉంటారు. మెడకు మద్దతు ఇచ్చేందుకు ఇలా తలగడను పెట్టుకుంటారు. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే తల కింద దిండు పెట్టుకోవడం వల్ల నిద్రా నాణ్యత ప్రభావితం అవుతుంది. మీకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. తలకింద దిండు పెట్టుకోవడం పూర్తిగా మానేస్తేనే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
తలకింద దిండు పెట్టుకోవడం వల్ల వెన్నెముక, దానిని అతుక్కుని ఉండే మెడ సహజ భంగిమకు ఇబ్బంది కలుగుతుంది. ఇది నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. మెడ వెనుక కండరాలపై ఒత్తిడిని పెంచుతుంది. వెన్నెముక తిమ్మిరి పెట్టడం నొప్పి రావడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్రపోయేటప్పుడు తలకింద దిండును తీసేందుకు ప్రయత్నించండి. ఇది మీకు నిద్రా నాణ్యతను పెంచుతుంది. అలాగే వెన్నముక సమస్యలు, మెడ నొప్పి వంటివి రాకుండా కాపాడుతుంది.
తలకింద దిండును ఉపయోగించడం వల్ల తల పైకి లేచినట్టు అవుతుంది. దీని వలన కండరాలపై ఒత్తిడి పడుతుంది. తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. దిండు లేకుండా నిద్రపోతే మెడ, తల రెండింటి అమరికా సరిగ్గా ఉంటాయి. తలనొప్పి మైగ్రేన్ వంటివి రాకుండా గొప్ప ఉపశమనం కలుగుతుంది.
దిండుపై పడుకోవడం వల్ల చర్మంపై కూడా ఒత్తిడి పెరిగిపోతుంది. దీనివల్ల ముఖ చర్మంపై ముడతలు త్వరగా వస్తాయి. మొటిమలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే దిండు తీసేసి నిద్రపోతే అలాంటి సమస్యలు రావు. ముఖానికి రక్తప్రసరణ కూడా ఎక్కువగా జరుగుతుంది. చర్మం మెరిసే అవకాశం ఉంది. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా వస్తాయి. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ నిద్రకూ ఎలాంటి ఆటంకం కలగదు. ఎక్కువ గంటలో మీరు నిద్రపోయే అవకాశం ఉంది. కావాలంటే ఒకరోజు దిండు తీసేసి నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది.
ఎంతోమంది గురక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కచ్చితంగా దిండును తీసేసే నిద్రపోవాలి. దీని కారణంగా శ్వాసనాళం తెరిచినట్టు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మీరు దిండి పెట్టుకుంటారో తల పైకి లేచినట్టు అవుతుంది. అప్పుడు శ్వాసనాళం కాస్త మూసుకుపోయినట్టు అయ్యి గురక సమస్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి కొన్ని రోజులు దిండు లేకుండా నిద్రపోవడానికి ప్రయత్నించండి. మీలో కనిపించే ఆరోగ్యం మార్పులను గమనించండి.
సంబంధిత కథనం