Telugu News  /  Lifestyle  /  Relationship Tis - Is Your Lovable Partner Using Bad Language, Deal This Way
Relationship Tips
Relationship Tips (iStock)

Relationship Tips | కోపంలో మీ భాగస్వామి మీపై మాటజారితే.. ఈ సమస్యకు పరిష్కారం ఇలా

17 August 2022, 19:49 ISTHT Telugu Desk
17 August 2022, 19:49 IST

మీ భాగస్వామి, మీ ఆత్మీయులు కోపంలో మాట జారుతున్నారా? మీ బంధం పదిలంగా ఉండాలంటే వారి మాటల్లో మార్పు రావాలి, ఇందుకోసం ఈ మార్గాలను ప్రయత్నించి చూడండి.

ఎదుటివారు ఎంత మంచి మనసు కలిగిన వారైనా, వారు ఎన్ని మంచి పనులు చేసినా.. పొరపాటున ఒకానొక సందర్భంలో ఒక మాటజారితే పరిస్థితి తారుమారవుతుంది. వారిపై మీకున్న మంచి అభిప్రాయం కూడా పూర్తిగా మారిపోతుంది. ఎన్నో జంటలు విడిపోవటానికి ఈ మాటలే కారణం. ఎందుకంటే మాటలు చాలా పదునైనవి, ఒక ఆయుధంతో చేసే గాయం కంటే మాట గాయం ఎక్కువగా దహించివేస్తుంది. చివరకు విడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత కలిసి ఉందామనుకున్నా కూడా కొన్నిసార్లు ఆ మాటలు గుర్తుకొచ్చి వెనకడుగు వేస్తాం. అందుకే పెద్దలు అంటారు నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుందని. ఎంత చెడ్డవారైనా, వారు ఎవరికీ ఏ ఉపకారం చేయకపోయినా తేనెలొలికే మాటలు మాట్లాడేవారే అందరికీ ఆప్తులు. ఎంత ఉపకారం చేసినా మాట సరిగ్గా లేకపోతే వారు అందరికీ శత్రువులే.

ట్రెండింగ్ వార్తలు

అయితే మీరు ఎంతో ఇష్టపడే మీ భాగస్వామి కోపంలో ప్రతీసారి మీపై మాటజారుతుంటే, పరుష పదజాలం ఉపయోగించి ఆపై బాధపడుతుంటే ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించాలి. వారు మంచివారే కానీ కోపంలో ఏదో అనేస్తున్నారు. దీనిని వారు మార్చుకోవాలని ప్రయత్నించినా.. వారికి సాధ్యం కాలేకపోతే ఏం చేయాలి? ఇందుకోసం మనస్తత్వ నిపుణులు కొన్ని మార్గాలను సూచించారు. మీ భాగస్వామికి లేదా మీ ఆత్మీయులకు ఈ మార్గాలను అనుసరించమని చెప్పండి. వారి మాటాల్లో మార్పు రావచ్చు. తమ ఈ అలవాటును వదిలించుకోవడంలో మీరు చాలా వరకు సహాయపడిన వారవుతారు. అంతేకాకుండా మీ బంధం విడిపోకుండా ఉంటుంది.

ధ్యానం చేయాలి

మీ భాగస్వామిని ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయమని కోరండి. వీలైతే వారితో పాటు మీరు కూడా కలిసి ధ్యానం చేయండి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మీ భాగస్వామి రిలాక్స్‌గా ఉంటారు. ధ్యానం కోపాన్ని కూడా అదుపుచేస్తుంది. నోటి నుంచి ప్రతికూల మాటలు కూడా తక్కువగా వస్తాయి.

పరుషమాటలపై ప్రశాంతంగా మాట్లాడండి

మీ భాగస్వామి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, వారితో కూర్చొని నిదానంగా మాట్లాడండి. వారు అన్న కొన్ని మాటలు మిమ్మల్ని, ఇతరులను ఎంతగా బాధపెడతాయో వారికి వివరించండి. అలాంటి పరుష పదజాలం, ప్రతికూలమైన మాటలు వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయని తెలపండి. ఇలా చేస్తే వారిలో మార్పు కలగవచ్చు.

కోపాన్ని కొంచెం పాజ్ చేయండి

భాగస్వామికి కోపం వచ్చినప్పుడల్లా వెంటనే రియాక్ట్ కాకుండా కొద్దిగా పాజ్ చేయమని అడగండి. వారికి ఏదైనా నెంబర్ కౌంట్ చేయమని కోరండి. ఈ పాజ్ బటన్ వలన కోపం అనేది వెనక్కి జారుతుంది. ఈ క్రమంలో వారి నోటి నుంచి తప్పుడు మాటలు రావటం ఆగిపోతుంది.

లేదా మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిని గుర్తు చేయండి. ఈరకంగా కూడా వారిని కంట్రోల్ చేయవచ్చు.

వారు వాడిన పదజాలాన్ని తెలియజేయండి

మీ భాగస్వామి కోపంతో తప్పుడు మాటలు మాట్లాడినట్లయితే, వారు ఏం మాట్లాడారో వారికి అది తరువాత గుర్తు చేయండి. నేరుగా మీరు మాట్లాడకుండా రాసి చూపించండి. అదే సమయంలో మీరు ఎప్పుడూ కూడా మాట జారకుండా చూసుకోండి. మీరు గౌరవంగా మాట్లాడుతూ ఉండండి. అది మీ విలువను పెంచుతుంది. ఎదుటివారిని మార్చుతుంది.