Relationship Tips: భార్యలూ.. మీ బంధం బాగుండాలంటే భర్త ఆఫీసు నుంచి రాగానే ఈ 4 పనులు చేయకండి.. గొడవలైపొతాయ్!
Relationship Tips: ఆలూమగల బంధం ఎంత ప్రత్యేకమైనదో అంతే సున్నితమైనది కూడా. కాబట్టి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య బంధం ఎల్లప్పుడూ బలంగా ఉండాలంటే భర్త ఆఫీసు నుంచి రాగానే భార్యగా మీరు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకున్నారంటే గొడవలు రాకుండా ఉంటాయి.
భర్త-భార్యల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రపంచంలోని ఏ ఇతర సంబంధానికి లేని విధంగా, ఇద్దరు అపరిచితులు సుఖ దుఃఖాలలో పరస్పరం సహకరించుకుంటూ, జీవితాంతం కలిసి చేసే ప్రయాణమిది. ఈ సంబంధం ఎంత అందంగా ఉంటుందో అంతే సున్నితంగా కూడా ఉంటుంది. చిన్న నిర్లక్ష్యం కూడా భార్యబంధంలో చిచ్చు పెట్టేస్తుంది కూడా. చాలా సార్లు తెలియకుండానే, భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు పొరబాటు చేయొచ్చు.
ప్రస్తుతం లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి, భార్యలు చేసే పొరబాట్ల గురించి ముందుగా తెలుసుకుందాం. నిజానికి, భర్తలు ఆఫీసు నుండి లేదా పని ప్రదేశం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీరు వ్యవహరించే తీరు చాలా ముఖ్యం. కొన్నిసార్లు భార్యల ప్రవర్తన గొడవకు కారణమై బంధం తెగిపోయేంత వరకూ వెళ్లిపోతుంది. ఈ విషయం గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం.
టీవీ లేదా మొబైల్ స్క్రీన్‌కు అతుక్కుని ఉండటం
ప్రస్తుత కాలంలో ఏ బంధంలోనైనా దూరం పెరగడానికి ప్రధాన కారణం స్క్రీన్‌కు అలవాటుపడటం. అది మొబైల్ అయినా లేదా టీవీ స్క్రీన్ అయినా. మీరు రోజంతా టీవీ లేదా మొబైల్ చూడవచ్చు. కానీ, మీ భర్త ఆఫీసు నుండి ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు స్క్రీన్‌కు అతుక్కుని ఉంటే, మీ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణంగా మారుతుంది.
నిజానికి, భర్తలు ఆఫీసు నుంచి వచ్చినప్పుడు వారు మీ నుంచి శ్రద్ధను ఆశిస్తారు. అలాంటి సమయంలో వారితో కూర్చొని వారు చెప్పే విషయాలు వినడం లేదా ఏవైనా మంచి సంగతులు ముచ్చటించడం లాంటివి చేయాలి. వారి పరిస్థితిని అడగడానికి బదులుగా మీరు స్క్రీన్‌కు అతుక్కుపోయి ఉంటే, మీ జీవితంలో భర్తకు ఎలాంటి ప్రాముఖ్యత లేదన్నట్లుగా అనిపిస్తుంది. అలా నెమ్మదిగా మీ ఇద్దరి సంబంధంలో అన్యోన్యత క్రమంగా అంతరించిపోతుంది.
భర్త అవసరాలను పట్టించుకోకపోవడం
రోజంతా ఆఫీసులో పని చేసిన తర్వాత భర్తలు ఇంటికి వచ్చినప్పుడు, భార్యల నుంచి కేరింగ్ ఆశిస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే టీ, స్నాక్స్ వంటివి ఇవ్వండి. ప్రేమగా మాట్లాడండి.
అలాంటి సమయంలో భార్యలు.. భర్త అవసరాలను పట్టించుకోకుండా తమ పనిలో నిమగ్నమై ఉంటే, వారి సంబంధంపై దాని ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు ఖాళీగా ఉన్నట్లయితే లేదా తర్వాత కూడా చేయగల పని చేస్తున్నట్లయితే, మీ భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. వారి పట్ల శ్రద్ధ చూపించి, కాసేపు సమయం వారితో గడపండి. దీని వల్ల మీ ఇద్దరి బంధం మరింత బలపడుతుంది.
భర్త ఇంటికి వచ్చిన వెంటనే ఛాడీలు చెప్పడం మానుకోండి
చాలా మంది మహిళలకు అలవాటు ఏమిటంటే, భర్తలు రోజంతా ఆఫీసులో పని చేసి, అలసిపోయి ఇంటికి వచ్చిన వెంటనే కంప్లయింట్లు చేయడం మొదలుపెడతారు. కొన్నిసార్లు పిల్లల గురించి, కొన్నిసార్లు అత్తమామల గురించి, మరి కొన్నిసార్లు బంధువుల గురించి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఇలా చెప్పడం సరైనదే.
కానీ, అలసిపోయిన వ్యక్తి ఎవరైనా సరే ప్రతిరోజూ ఇవన్నీ వినలేరు. స్పష్టంగా, ఒక రోజు అతను ఈ ప్రవర్తనతో చిరాకు పడతారు. కాబట్టి, భర్త ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఏదైనా ఫిర్యాదు చేయడం మానుకోండి. మీరు ఏదైనా విషయం గురించి ఇబ్బంది పడుతున్నట్లయితే, భర్త కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత, ప్రశాంతంగా మీ సమస్యను వారితో పంచుకోండి. పరిష్కారం కావాలని వెంటనే ఆశించకండి.
ఇంటికి వచ్చిన వెంటనే డిమాండ్లు వినిపించకండి
ఎవరైనా రోజంతా ఆఫీసులో పని చేసి, ఇంటికి వచ్చినప్పుడు వారి పరిస్థితిని అడుగుతారని వారు ఆశిస్తారు. కానీ, వచ్చిన వెంటనే భార్య ఏమీ మాట్లాడకుండా తన డిమాండ్ల జాబితాను భర్త ముందుంచితే నిరుత్సాహ పడతారు. భర్తకు తన భార్యకు తన పట్ల ఎలాంటి శ్రద్ధ లేదని బాధపడతారు. భార్య ప్రవర్తించే ఈ అలవాటు వల్ల నెమ్మదిగా భర్త-భార్యల మధ్య దూరం పెరుగుతుంది.