Relationship Tips : బహుమతుల కంటే సమయం విలువైనది.. ఎంత బిజీగా ఉన్నా భాగస్వామితో గడపండి
Relationship Tips In Telugu : బంధం బలంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. భాగస్వామితో మనం గడిపే సమయం కూడా బంధంలో చాలా ముఖ్యమైనది.
ఒక్కమాట అనగానే కోపం వస్తుంది. అతనితో జీవించడం కష్టమని ఆమె భావిస్తుంది, అతను కూడా తనతో జీవించడం నరకం అని భావించడం మెదలుపెడతాడు. ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుంటారు.. ఈ రోజుల్లో చాలా వివాహితుల జీవితాల కథ ఇది.
మన పెద్దల వైవాహిక జీవితంలో చాలా సమస్యలు ఉండేవి. కానీ అవి వారు చాలా చిన్నవిగా చూసేవారు. అందుకే 50 ఏళ్ల వివాహ వార్షికోత్సవం, 80 ఏళ్ల వార్షికోత్సవం జరుపుకోగలిగారు. కానీ ఇటీవలి వైవాహిక జీవితంలో పెళ్లైన కొన్నేళ్లకే సమస్య మొదలవుతుంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ విడాకులకు ప్రధాన కారణం ఏంటో మనం చూస్తున్నాం. ఇద్దరూ కలిసి సమయం గడపడం లేదు.
భాగస్వాములిద్దరూ ఫ్యూచర్ కోసం రన్నింగ్‌లో బిజీగా ఉంటారు. బంధం భవిష్యత్తు కోసం ఒక రోజులో అరగంట రిజర్వ్ చేయలేనంత బిజీగా అయిపోతాం. మరచిపోతాం, తద్వారా బంధంలో సంఘర్షణ పెరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు రోజులో కొంత సమయం మాట్లాడుకుంటే, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వారి భావాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.
మీరు సంతోషంగా ఉన్నా లేదా దేని గురించి ఆందోళన చెందుతున్నా ప్రతిదీ పంచుకోవడానికి సంకోచించకండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా అవుతుంది. ఇద్దరూ కలిసి సాయంత్రం వాక్ వెళ్తే చాలా బాగుంటుంది.
ఇద్దరూ మాట్లాడుకోవాలి
ఇద్దరూ స్వేచ్ఛగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. భాగస్వామిపై నమ్మకం పెరుగుతుంది. నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి అని భావించడం ప్రారంభిస్తారు. మంచి స్నేహం ఉంటుంది. మన భావాలన్నింటినీ మన స్నేహితులకు తెలియజేస్తాం. అదే విధంగా మన జీవిత భాగస్వామితో సంబంధం బాగా కలిగి ఉంటే.. ఆ బంధం చాలా బాగుంటుంది.
సమయం ఇచ్చుకోవాలి
ఇద్దరూ ఒకరికొకరు సమయం ఇచ్చుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం చిక్కబడుతుంది. లేదంటే పలుచగా మారి విడాకుల వరకు వెళ్తుంది. అవసరమైతే.. చిన్న ట్రిప్‌కి వెళ్లండి. డిన్నర్‌కి బయటకు వెళ్లండి లేదా కలిసి కొద్దిసేపు నడవండి. మీరిద్దరూ ఆనందించే హాబీలను కొనసాగించండి. సినిమాకి వెళ్లడం, విహారయాత్రకు వెళ్లడం, జాలీ రైడ్, పుస్తకం చదవడం వంటి ఈ అభిరుచి మీ ఇద్దరి మధ్య సాధారణమైనదైనా దానిపై శ్రద్ధ వహించండి.
పొగిడితే తప్పేం కాదు
జీవిత భాగస్వామి తప్పులను విమర్శించినట్లే, వారి మంచితనాన్ని మెచ్చుకోండి. వారిని ఎక్కువగా విమర్శించవద్దు. కొన్ని విషయాలకు వారిని ప్రశంసించండి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య సఖ్యత, ప్రేమ పెరుగుతుంది. మన పనిని మెచ్చుకున్నప్పుడు దాని ఆనందమే వేరు. మీరు పొగడటంలో తప్పు లేదు.
సమయమే పెట్టుబడి
మంచి బంధానికి సమయమే పెట్టుబడి. ఇది చాలా ముఖ్యం. మీ సంబంధాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు వారి కోసం సమయాన్ని కేటాయించాలి. ఏ సంబంధమైనా, తల్లితండ్రుల సంబంధమైనా వారికి కూడా సమయం ఇవ్వాలి. ఏదైనా బహుమతి కంటే సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. మీరు కష్టపడుతున్నది మీ కుటుంబం కోసం, వారి కోసం కొంత సమయాన్ని ఇస్తే పోయేది ఏమీ లేదు.