Relationship Tips: భార్యాభర్తలు తమ తల్లిదండ్రులతో కూడా పంచుకోకూడని 5 విషయాలు ఏంటో తెలుసుకోండి!-relationship tips find out 5 things that husbands and wives should never share even with their parents ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship Tips: భార్యాభర్తలు తమ తల్లిదండ్రులతో కూడా పంచుకోకూడని 5 విషయాలు ఏంటో తెలుసుకోండి!

Relationship Tips: భార్యాభర్తలు తమ తల్లిదండ్రులతో కూడా పంచుకోకూడని 5 విషయాలు ఏంటో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

Relationship Tips: భార్యాభర్తల మధ్య చాలా విషయాలు ఉంటాయి. అయితే కొన్ని విషయాలు వారిద్దరి మధ్యనే ఉండాలి. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల సంబంధంలో విభేదాలు రావచ్చు. కనీసం తల్లదండ్రులకు కూడా తల్లిదండ్రులు చెప్పుకోకూడని కొన్ని 5 విషయాలు ఉన్నాయి.

रिलेशनशिप टिप्स (Shutterstock)

భార్యాభర్తల సంబంధం మిగతా అన్ని సంబంధాలకన్నా ప్రత్యేకమైనది. రెండు వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమ బంధంతో ఒక్కటై జీవితాతం కలిపి ప్రమాణం చేస్తారు. ఈ అందమైన సంబంధంలో ప్రేమ, గొడవలు, అలకలు సహజం. జీవితంలోని ప్రతి మలుపులోనూ కలిసి నడిచేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్పకుండా వస్తాయి. అయితే ఇది భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచకుండా ఉండాలంటే.. వారి సంబంధ గౌరవాన్ని కాపాడుకోవడానికి, కొన్ని విషయాలను వారు వారిద్దరి మధ్యనే ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఇతరుల ముందు బయట పెట్టకూడదు.

ఆలూమగల మధ్యలోకి మూడో వ్యక్తిని తీసుకురావడం వల్ల, వారు మంచిగా ఆలోచించిన విషయాలు కూడా, చిన్న చిన్న విషయాలు కూడా అనవసరంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వారి తల్లిదండ్రులతో కూడా పంచుకోకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందా రండి..

గొడవలను బయటపెట్టకండి

భార్యాభర్తల మధ్య ప్రేమ, గొడవలు సహజం. బాధ్యతలు పెరిగే కొద్దీ చిన్న చిన్న గొడవలు రావడం సర్వసాధారణం. కానీ, గొడవల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే, విషయం పెరిగి పెద్దదవుతుంది. సంబంధంలో విభేదాలు వస్తాయి. కాబట్టి, భార్యాభర్తలు తమ గొడవలను ఎవరితోనూ పంచుకోకూడదు, వారి తల్లిదండ్రులతో కూడా. చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు చెప్పకూడదు. సమస్య చాలా తీవ్రమైనది అయితేనే కుటుంబంలోని ఇతర తెలివైన వ్యక్తి సహాయం తీసుకోవచ్చు.

భాగస్వామికి సంబంధించిన రహస్యాలను బయటపెట్టకండి

సాధారణంగా భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు చాలా విషయాలు చెప్పుకుంటారు, తెలుసుకుంటారు. కానీ, భాగస్వామికి సంబంధించిన రహస్యాలను ఎప్పుడూ ఎవరి ముందూ వెల్లడించకండి. అది మీ కుటుంబంలోని వ్యక్తులతో అయినా, తల్లిదండ్రులతో అయినా. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామికి బాధగా ఉండవచ్చు లేదా అతను/ఆమె ఇబ్బంది పడవచ్చు. ఇలా రహస్యాలను బయటపెట్టడం వల్ల నమ్మకం విషయంలో సమస్యలు రావచ్చు, దాని ప్రభావం మీ సంబంధంపై పడవచ్చు.

తల్లిదండ్రుల ముందు భాగస్వామిని అవమానించకండి

కొంతమంది తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తమ భాగస్వామిని అవమానిస్తారు. అమ్మాయిల కంటే అబ్బాయిలు ఇలా చేసే అవకాశం ఎక్కువ. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం మంచిదే, కానీ దాని అర్థం వారి ముందు మీ భాగస్వామిని అవమానించాలని కాదు. ఇది మీ సంబంధం పునాదిని బలహీనపరుస్తుంది. మీ భార్య లేదా భర్త ఏదైనా చెడుగా చేస్తే, దాన్ని అందరి ముందు అవమానించడానికి బదులుగా, ఒంటరిగా ప్రశాంతంగా మాట్లాడండి.

ఆర్థిక పరిస్థితిని బయటపెట్టకండి

భార్యాభర్తలు సుఖ దుఃఖాలలో ఒకరికొకరు మద్దతుగా నిలబడితే వారి సంబంధం మరింత బలపడుతుంది. కాబట్టి, భార్య లేదా భర్త ఆర్థికంగా బలహీనంగా ఉన్నా లేదా కష్టకాలంలో ఉన్నా, వారి ఆర్థిక పరిస్థితి గురించి ఎవరితోనూ చెప్పకండి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామికి ఇబ్బందిగా ఉండవచ్చు లేదా ఇతరులు చెప్పే మాటలు మీ సంబంధాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మూడో వ్యక్తిని మధ్యలోకి తీసుకురాకండి.

భాగస్వామి లోపాలను ఎవరితోనూ చెప్పకండి

ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కాదు. ప్రతి ఒక్కరిలోనూ మంచి లక్షణాలతో పాటు కొన్ని లోపాలు కూడా ఉంటాయి. కానీ, నిజమైన బలమైన సంబంధం అంటే, మీరు మీ భాగస్వామిని అతని/ఆమె మంచి చెడులతో సహా అంగీకరించడం. కాబట్టి, మీ భాగస్వామిలో ఏదైనా లోపం ఉంటే, దాన్ని అంగీకరించి, ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించుకోండి. ప్రతి చిన్న లోపాన్ని ఇతరుల ముందు చెప్పడం మానుకోండి, ఎందుకంటే ఇది మీ ఇద్దరి సంబంధాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం