Relationship Breakup: లవ్ బ్రేకప్ అయిందా? పదేపదే ఆ చేదు గతం గుర్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?-relationship breakup has the love breakup happened what should you do to avoid constantly remembering painful past ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship Breakup: లవ్ బ్రేకప్ అయిందా? పదేపదే ఆ చేదు గతం గుర్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Relationship Breakup: లవ్ బ్రేకప్ అయిందా? పదేపదే ఆ చేదు గతం గుర్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Ramya Sri Marka HT Telugu
Published Feb 08, 2025 05:00 PM IST

Relationship Breakup: ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో బాధాకరమైన గతం ఉంటుంది. ఆ బంధం మంచిది కాదనే వదిలేసుకుంటాం. కానీ, అది మనల్ని పదేపదే గుర్తు చేస్తూ మనసుకు మరింత భారంగా అనిపిస్తుంది. లవ్ బ్రేకప్ తర్వాత కలిగే ఇటువంటి ఫీలింగ్స్ నుంచి ఎలా బయటపడాలని సతమతమవుతున్నారా?

లవ్ బ్రేకప్ అయిందా? పదేపదే ఆ చేదు గతం గుర్తు రాకుండా ఉండాలంటే
లవ్ బ్రేకప్ అయిందా? పదేపదే ఆ చేదు గతం గుర్తు రాకుండా ఉండాలంటే (PC: Canva)

ప్రేమలో పడటం సులభం, ప్రేమకు బ్రేకప్ చెప్పుకోవడమూ సులభమే. కానీ, ప్రేమను కాపాడుకోవడం కష్టం. అదే బ్రేకప్ అయ్యాక తట్టుకోవడమూ కష్టమే. మీరు లైఫ్‌లో ఎదుర్కొన్న చేదు గతం నుంచి బయటకు రావాలని బ్రేకప్ చెప్పేసి ఉంటారు. కానీ, ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తూ సతమతమవుతూ ఉంటే, మానసికంగా చాలా నష్టపోతారు. కొత్త జీవితం మొదలుపెట్టాలంటే, ముందుగా అందులో నుంచి బయటకు రావాలి. మీ జీవితాన్ని నరకంగా మార్చేసే గురుతుల నుంచి కొత్త దారి వెతుక్కోవాలి. టాక్సిక్ రిలేషన్‌షిప్ నుండి బయటపడిన తర్వాత, దాని నుండి కోలుకోవడానికి కొద్దిగా కష్టపడాలి.ప్రేమను ఖచ్చితంగా కాపాడుకోవడానికి చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం.

విషపూరిత సంబంధం మిమ్మల్ని నిరాశలోకి నెట్టేయెచ్చు. గందరగోళానికి గురిచేయవచ్చు. ప్రపంచమే మునిగిపోయినట్లుగా కూడా అనిపించవచ్చు. అదెంతలా అంటే, మన జీవితం ఇక్కడితో ఆగిపోయి, ఇక ముందుకు వెళ్లడం లేదనే ఫీలింగ్ ను కూడా కల్పిస్తుంది. అటువంటి బాధను అనుభవిస్తున్న వారికి ధ్యానం చాలా చక్కటి పరిష్కారం కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నిర్దిష్ట ధ్యాన మార్గాలు బ్రేకప్ తర్వాత కోలుకోవడానికి బాగా సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది జీవితానికి కొత్త ఆశను కూడా అందిస్తుంది.

బ్యాడ్ రిలేషన్ వల్ల కలిగే నష్టాలు

చెడు లేదా విషపూరిత సంబంధాలు గుండెపోటు కంటే ఎక్కువ ప్రమాదంగా ఉంటాయి. మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడంతో పాటు, ప్రేమ గురించి మళ్ళీ ఎప్పటికీ నమ్మకం రాకుండా కూడా చేయవచ్చు. ఇది మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేసి, గతం తాలూకూ ఘటనలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెస్తుంది. భయానికి గురయ్యే పరిస్థితిని కల్పించి మానసిక అల్లకల్లోలానికి కారణమవుతుంది. ఫలితంగా ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందికరంగా మారిపోతుంది.

ధ్యానంతోనే సాధ్యపడుతుంది

ధ్యానంలో ప్రాథమిక సూత్రం మన మనస్సును తెలుసుకోవడం. ధ్యానం రెగ్యూలర్‌గా చేయడం ద్వారా మన ఆలోచనలను మార్చుకోవడం సాధ్యమవుతుంది. భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఇది అనుభవాలు, ప్రతిస్పందనల మధ్య ఖాళీని సృష్టిస్తుంది. దీని వలన నెమ్మదిగా మనసులో బాధ తగ్గుతుంది.

ధ్యానం చేస్తున్నప్పుడు, బాధ నుండి దూరంగా ఉండటానికి బదులుగా, నొప్పితో జీవించడం నేర్చుకుంటాం. నొప్పిని ఎదుర్కొనే ధైర్యాన్ని పొందగలం. ప్రస్తుతం మనకు ఉన్నది తాత్కాలిక స్థితి, ఇది శాశ్వతం కాదనే విషయం అర్థం చేసుకుంటాం.

నొప్పి నుండి ఆశకు ప్రయాణం

ధ్యానం చేయడం ద్వారా బ్రేకప్ ద్వారా కలిగిన నొప్పి తగ్గి జీవితం గురించి ఆశ కలుగుతుంది. ఇది మనం ఎవరు, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏమి కోరుకుంటున్నాం అనే విషయాలపై అవగాహన పెంచుతుంది. ధ్యానం గత సంబంధంలో మనం ఎక్కడ తప్పు చేశాము, మనం ఏమి తప్పు చేశాము అనేది అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ విధంగా గత అనుభవం నుండి పాఠాలు నేర్చుకునేలా చేస్తుంది.

కొత్త అధ్యాయం మొదలుపెట్టే ముందు ఇలా చేయండి

బ్యాడ్ రిలేషన్‌కి ముగింపు పలకడం ఒక మంచి విషయమైతే, దానిని త్వరగా మర్చిపోయి మరో అధ్యాయం మొదలుపెట్టడం ఇంకొక ఉత్తమమైన విషయం. ఈ ప్రక్రియకు ధ్యానం ద్వారా పరిష్కారం వెదుక్కోవచ్చు. స్వీయ అన్వేషణను ప్రారంభించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతర్గత శాంతి, స్వీయ-అవగాహనను పెంపొందించుకుంటూ, భవిష్యత్ సంబంధాలకు మీరు బలమైన పునాదిని నిర్మించుకోవచ్చు. ధ్యాన సమయం కొత్త ఆశను కలిగించడమే కాకుండా, చాలా భయంకరమైనదిగా భావించిన జీవితాన్ని చాలా అందంగా మారుస్తుంది. దీని వలన కొత్త సంబంధానికి చాలా చక్కటి మార్గాన్ని కనబరుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం