Period Cramps in Winter : శీతాకాలంలో పీరియడ్ అలసటను ఇలా దూరం చేసుకోండి..-reduce period cramps with these ways in winter here is the ways to deal with menstrual fatigue ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Reduce Period Cramps With These Ways In Winter Here Is The Ways To Deal With Menstrual Fatigue

Period Cramps in Winter : శీతాకాలంలో పీరియడ్ అలసటను ఇలా దూరం చేసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 07, 2023 08:45 PM IST

Period Cramps in Winter : ఋతుస్రావంతో వచ్చే అనేక అవాంఛిత లక్షణాలలో నీరసం కూడా ఒకటి. ఇది మిమ్మల్ని మంచం నుంచి కిందకి దిగనీయదు. అందుకే ఈ సమయంలో సౌకర్యవంతమైన ఆహారం, వెచ్చని పానీయాలు తీసుకుంటారు. కానీ ఇది ఉత్తమ మార్గం కాదని.. కొన్ని చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు.

పీరియడ్ క్రాంప్స్
పీరియడ్ క్రాంప్స్

Period Cramps in Winter : పీరియడ్స్ సమయంలో అలసటగా అనిపించడం సహజమే. అయినప్పటికీ.. మీరు నిరంతరం అలసిపోతూ ఉంటే.. ముఖ్యంగా మీ పీరియడ్స్ సైకిల్‌కు ముందు లేదా తరువాత సమయంలో.. ఇబ్బంది ఎదుర్కొంటుంటే అది మీ రుతుక్రమ అలసటకు సంకేతం కావచ్చు. మీ పీరియడ్స్ సమీపిస్తున్న కొద్దీ.. మీ శరీరంలో ఉబ్బరం, మూడ్ స్వింగ్స్, తలనొప్పి, తిమ్మిర్లు వంటి అనేక మార్పులను మీరు గమనించవచ్చు.

శారీరక శ్రమ, నిద్ర, ఆహారపు అలవాట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమస్యలన్నింటి కారణంగా హార్మోన్లపై అలసట పడుతుంది. అయినప్పటికీ.. ఈ అలసటను అధిగమించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటంటే..

జాగింగ్ కోసం వెళ్లండి

మీరు ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు.. రుతుక్రమ అలసటను భరించడం సవాలుగా ఉండొచ్చు. అయినప్పటికీ.. అలసటతో ఉన్నవారు జాగింగ్ వంటి తక్కువ-తీవ్రత వ్యాయామాలు మరింత శక్తిని పొందడంలో సహాయపడతాయి అంటారు. అదనంగా ఇది హృదయ ఆరోగ్యాన్ని, కండరాల బలాన్ని, ఎముక సాంద్రతను పెంచుతుంది.

హైడ్రేషన్

నిర్జలీకరణం అనేది సాధారణంగా అలసిపోవడంతో ముడిపడి ఉంటుంది. హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 2 లీటర్ల నీటిని తీసుకోవాలి. చక్కెర పానీయాలు లేదా కెఫిన్ కలిగిన పానీయాల కంటే నీటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది మీకు శక్తిని అందిస్తుంది. నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే ఆల్కహాల్ మానుకోండి. ఎందుకంటే ఇది అలసటను మరింత తీవ్రతరం చేసే డిప్రెసెంట్.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి

ఋతుస్రావం లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల అలసటను ఎదుర్కొన్నప్పుడు.. నిద్ర, విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. అదనపు విశ్రాంతి కొంత అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది. శక్తి స్థాయిలను పునరుద్ధరిస్తుంది.

సరిగ్గా తినండి

ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం విషయానికి వస్తే.. అతిగా తినకుండా ఉండటాన్ని ఒక పాయింట్‌గా చేసుకోండి. ముఖ్యంగా మీరు సాధారణ కార్బోహైడ్రేట్‌లు, చక్కెరలు ఎక్కువగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటే.. ఇది మీకు మరింత కోరికను కలిగిస్తుంది. చాలా అవసరమైన పోషకాలను పొందడానికి సరైన రకాల పూర్తి ఆహారాలను తినండి. జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడానికి భోజనాల మధ్య సమయాన్ని కేటాయించండి. లేకపోతే అతిగా తినడానికి, చిరుతిండికి ఉత్సాహం ఉబ్బిన అనుభూతిని కలిగిస్తుంది. కార్బోనేటేడ్ లేదా షుగర్ పానీయాలు అలాగే కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మానేయడం మంచిది.

యోగా

తగినంత విశ్రాంతితో తక్కువ-తీవ్రత వ్యాయామం చేయడం నిజానికి ఋతు అలసటతో వ్యవహరించడానికి ఒక వరం. యోగా ఆసనాలు (భంగిమలు) చేయడం కూడా శక్తి స్థాయిలను పెంచుతుంది. ఈ సమయంలో అధిక-తీవ్రత వ్యాయామాలకు బదులుగా.. మీరు శరీరాన్ని స్ట్రెచ్ చేయడంపై దృష్టి పెట్టండి. దీనితోపాటు ధ్యానం చేయండి.

సూర్యకాంతి

ఎండలో సమయం గడపడానికి ట్రై చేయండి. విటమిన్ D సహజ వనరుగా ఉండటం వలన ఇది PMS లక్షణాలు, ఋతు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ డి లేకపోవడం ప్రాథమిక డిస్మెనోరియా తీవ్రత, దానితో పాటు వచ్చే లక్షణాలకు సంబంధించినదై ఉంటుంది.

ఋతు చక్రంలో చాలా మందికి అలసట అనిపించడం అనేది ఊహించినదే కాబట్టి.. ఈ చిట్కాలతో అలసటను అధిగమించేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం