జిమ్ చేయడం మొదలు పెట్టాక బరువు ఇంకా పెరుగుతున్నారా? ఇందుకు 5 కారణాలు ఉన్నాయి
చాలా మంది బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళతారు. అయితే కొందరు జిమ్ స్టార్ చేశాక బరువు తగ్గడానికి బదులుగా మరింత పెరుగుతారు. ఇలా జరగడానికి కారణాలేంటి? బరువు పెరగకుండా ఉండాలంటే జిమ్ కు వెళ్లే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి తెలుసుకుందాం రండి.
నేటి జీవనశైలిలో బరువు పెరగడం చాలా సాధారణం. దాదాపు ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలను తగ్గించుకోవడానికి వ్యాయామం, యోగా, వాకింగ్, స్కిప్పింగ్, డైట్ వంటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఈ మధ్య చాలా మంది జిమ్‌కు వెళతారు. సెలబ్రిటీలు కూడా ఫిట్‌గా ఉండటానికి జిమ్ డైలీ జిమ్ చేస్తుంటారు.
అయితే బరువు తగ్గడం కోసం జిమ్‌కు వెళుతున్న చాలా మంది తగ్గడానికి బదులుగా మరింత పెరగడం ప్రారంభిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది. జిమ్ స్టార్ట్ చేశాక బరువు తగ్గడానికి బదులుగా మరింత పెరిగడానికి కారణాలేంటి? తెలుసుకుందా రండి.
జిమ్‌కు చేయడం మొదలు పెట్టాక బరువు పెరగడానికి గల కారణాలు:
1) అధికంగా తినడం
జిమ్‌లో అధిక శ్రమతో కూడిన ఎక్సర్‌సైజెస్ చేస్తుంటారు. రోజూ ఇలా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఇంతకు ముందు కంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది. ఫలితంగా ఆకలి పెరగుతుంది. దీని వల్ల జిమ్ చేసే వ్యక్తుల్లంలో అధికంగా తినే అలవాటు ఏర్పడుతుంది. చాలా మంది ఈ కారణంగానే జిమ్ స్టార్ చేశాక బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతున్నారని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.
2) తాత్కాలిక నీటి బరువు
వ్యాయామం వల్ల కండరాలలో తాత్కాలిక వాపు, ద్రవాల నిలుపుదల ఏర్పడతాయి. దీనివల్ల శరీర బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. అదనంగా, మీరు వ్యాయామం చేయడం మొదలుపెట్టినప్పుడు శరీరం ముందు కన్నా ఎక్కువ గ్లైకోజెన్ నిల్వ చేస్తుంది. ఇది మీ కండరాలకు శక్తిని ఇవ్వడానికి నీటితో కలిసి ఉంటుంది. ఇది మీ తాత్కాలికంగా బరువు పెరగుదలకు కారణమవచ్చు.
3) హార్మోన్ల అసమతుల్యత
అధిక శిక్షణ, అధిక శ్రమతో కూడా వ్యాయామాలు, తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల జిమ్ స్టార్ చేశాక హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడవచ్చు. ఉదాహరణకు కొందనిలో తక్కువ టెస్టోస్టెరాన్, మరికొందిలో అధిక కార్టిసోల్ స్థాయిలు కనిపించవచ్చు. ఇలా హార్మోన్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు కూడా కండరాల కణజాల నష్టానికి, బరువు పెరగుదలకు దోహదం చేస్తాయి.
4) ఒత్తిడి, వాపు
జిమ్ లో మునుపెన్నడూ లేని విధంగా శారీరకంగా శ్రమించడం, బరువు విషయంలోని మానసిక ఒత్తిడి కూడా బరువు పెరుగదలకు కారణం కావచ్చు. ఎందుకంటే అధిక ఒత్తిడి జీవక్రియను దెబ్బతీసి, శరీర బరువను ప్రభావితం చేస్తుంది.
5) ఆహారం, జీవనశైలి
జిమ్ చేసే వాళ్లు కష్టపడి వ్యాయామాలు చేయడం ఎంత ముఖ్యమో వారు తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అంత ముఖ్యం. ఆకలిగా వేస్తుందని అధికంగా తినడం, అధిక కేలరీలను తీసుకోవడం మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకలిని, అనారోగ్యపు ఆహారాలు, పానీయాల కోరికలను అదుపులో ఉంచుకోవడం చాలా అసవరం. అలాగే జిమ్ కు తగ్గట్లుగా మీ డైలీ రొటీన్‌లో చురుగ్గా ఉండటం కూడా మీ బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. లేదంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయలేరు. బరువు తగ్గడానికి బదులుగా పెరిగే అవకాశాలుంటాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం