న్యూ ఇయర్ పార్టీలో మద్యం తాగేందుకు సిద్ధమయ్యారా? తాగాక మీ శరీరంలో జరిగేది ఇదే-ready to drink too much alcohol at the new years party this is what happens in your body after drinking ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  న్యూ ఇయర్ పార్టీలో మద్యం తాగేందుకు సిద్ధమయ్యారా? తాగాక మీ శరీరంలో జరిగేది ఇదే

న్యూ ఇయర్ పార్టీలో మద్యం తాగేందుకు సిద్ధమయ్యారా? తాగాక మీ శరీరంలో జరిగేది ఇదే

Haritha Chappa HT Telugu
Dec 31, 2024 01:31 PM IST

కొత్త ఏడాది వచ్చిందంటే జనవరి 31 రాత్రి పార్టీలలో ఆల్కహాల్ ఏరులై పారుతుంది. మద్యం తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీరు ఆల్కహాల్ తాగడమే మానేస్తారు.

ఆల్కహాల్ వల్ల అనర్థాలు
ఆల్కహాల్ వల్ల అనర్థాలు (Pixabay)

కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు పార్టీలు, పబ్బులు సిద్ధమైపోయాయి. పార్టీలు అంటే అక్కడ ఖచ్చితంగా ఆల్కహాల్ ఉండాల్సిందే. ఆల్కహాల్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏవైనా సరే ఆల్కహాల్ ఆరోగ్యానికి చేసేది కీడే. ఆ విషయం తెలిసికూడా మద్యాన్ని తాగడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. మద్యం తాగాక మన శరీరంలో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుంటే మీరు దాని జోలికే వెళ్ళరు. మద్యం వినియోగం అనేది ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. జనవరి 31 రాత్రి అతిగా మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువే. ఇలా అతిగా తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి.

yearly horoscope entry point

మద్యం అతిగా తాగితే మీకు వికారంగా అనిపిస్తుంది. వెంటనే వాంతులు అయిపోతాయి. హ్యాంగోవర్ లోకి వెళ్లి పోతారు. ఆ హ్యాంగోవర్ లో ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు కూడా మీకు తెలియదు. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీ పనిని, జీవనశైలిని, విద్యను కూడా ప్రభావితం చేస్తుంది. చదివింది ఏది గుర్తుపెట్టుకోలేరు, ఏకాగ్రతగా పని కూడా చేయలేదు.

కాలేయంలోకి మద్యం చేరాక

మద్యం తాగాక ఆ మద్యంలోని ఇథనాల్ ఆహారనాళంలోకి వేగంగా జారుతుంది. ఆ తర్వాత అది నేరుగా కాలేయానికి వెళుతుంది. ఏ ఆహారాన్నైనా కాలేయం విచ్ఛిన్నం చేసి జీవక్రియలు నిర్వహించడానికి ప్రోత్సహిస్తుంది. కాలేయంలో ఆల్కహాల్ డిహైడ్రోజెనీస్ అనే ఎంజైముల ద్వారా దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే మద్యం అతిగా తీసుకుంటే ఈ ఎంజైముల యాక్టివిటీ తీవ్రంగా పెరిగిపోతుంది. ఇది కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడేలా చేస్తుంది. దీనివల్ల కాలేయంలోని కణాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పొట్టలో కూడా ఇన్ప్లమేషన్ మొదలైపోతుంది. దీనివల్ల ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు కూడా రావచ్చు.

అనేక రకాల క్యాన్సర్లు వస్తాయి

ఆల్కహాల్ వల్ల కేవలం కాలేయమే కాదు, ఊపిరితిత్తులు, గుండె కూడా ప్రభావితం అవుతాయి. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. గుండె స్పందన క్రమ రహితంగా మారుతుంది. తలనొప్పి అధికమైపోతుంది. తీవ్ర అలసట, చిరాకు పెరిగిపోతుంది. మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇక అనేక రకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ వంటివన్నీ కూడా ఆల్కహాల్ వల్ల రావచ్చు. కాబట్టి ఆల్కహాల్ తాగే ముందు ఆలోచించుకోండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner