Instant breakfast : పది నిమిషాల్లో చేసే రవ్వ గుంతపొంగనాలు.. టూ మినిట్స్‌‌లో చట్నీ-rava gunta ponganalu recipe making in 10 minutes step by step process in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Instant Breakfast : పది నిమిషాల్లో చేసే రవ్వ గుంతపొంగనాలు.. టూ మినిట్స్‌‌లో చట్నీ

Instant breakfast : పది నిమిషాల్లో చేసే రవ్వ గుంతపొంగనాలు.. టూ మినిట్స్‌‌లో చట్నీ

Anand Sai HT Telugu
Jan 23, 2024 06:30 AM IST

Instant breakfast Recipe : ఎప్పుడూ తినే బ్రేక్‌ఫాస్ట్‌ ఎందుకు.. ఈసారి ఏదైనా కొత్తది చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇన్‌స్టెంట్‌గా పది నిమిషాల్లో రవ్వ గుంతపొంగనాలు చేసేయండి. ముందు రోజు నుంచి ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా.. అప్పటికప్పుడు తేలిగ్గా చేసుకోవచ్చు.

రవ్వ గుంత పొంగనాలు
రవ్వ గుంత పొంగనాలు

వంట చేసే మహిళ ప్రతి రోజు వంటగదిలో ఒక పోరాటమే చేయాలి. ఎందుకంటే.. రోజుకో రకం కూర, వెరైటీ టిఫెన్‌ ప్రిపేర్‌ చేయాలి. మొన్న చేసింది ఈరోజు వండితే ఇంట్లో వాళ్లు తినరు. తినే ఆహారం బోర్‌ కొట్టకుండా రుచిగా హెల్తీగా ఏం వండాలి అని ప్రతి మహిళ ఆలోచిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఉదయం తినే టిఫెన్‌.. రోజూ ఆ ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా అంటే.. పిల్లలు తినరు. ఈరోజు ఇన్‌స్టెంట్‌గా చేసే గుంతపొంగనాల గురించి తెలుసుకుందాం. వీటిని చేయడం తేలిక.. అంతే కాదు.. రుచి కూడా అమోఘంగా ఉంటాయి.

రవ్వ గుంతపొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

సన్నటి బొంబాయి రవ్వ- ఒక కప్పు

ఉల్లి తరుగు- అరకప్పు

కట్‌ చేసిన పచ్చిమిర్చి- 4

ఒక మీడియం సైజ్‌ టమోటా ముక్కులు

తురుమిన క్యారెట్‌- పావుకప్పు

కట్‌ చేసిన క్యాప్సికమ్‌- 2 టేబుల్‌ స్పూన్స్‌

కొత్తిమీర- 2 టేబుల్‌ స్పూన్స్‌

ఉప్పు- తగినంత

వంటసోడా- పావుటీ స్పూన్‌

పెరుగు- అరకప్పు

తయారు చేసే విధానం..

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో పైన చెప్పిన పదార్థాలు అన్నీ వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలపండి. మరీ ఎక్కువ నీళ్లు పోయకండి. బోండా పిండిని ఎలా కలుపుకుంటారో అలానే కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఐదు నిమిషాల తర్వాత పిండి కాస్త గట్టిగా అవుతుంది. అప్పుడు కాస్త వాటర్‌ పోయాలి. ఇప్పుడు ఇలా అయినా పొంగనాలు వేసుకోవచ్చు.

రుచి ఇంకాస్త పెరగటానికి తాలింపు వేసుకోవచ్చు. తాలింపు కోసం..పొయ్యి మీద గిన్నె పెట్టుకోని ఒక ఆఫ్‌ టేబుల్‌ స్పూన్‌ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంగువా, పావుటీ స్పూన్‌ పసుపు, కరివేపాకు కట్‌ చేసి వేయండి. ఇది దోరగా వేగిన తర్వాత పొంగనాల పిండిలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద గుంతలు ఉన్న ప్యాన్‌ పెట్టుకోని గుంతల్లో టీ స్పూన్‌ చొప్పున ఆయిల్‌ వేసుకుని హీట్‌ అయిన తర్వాత.. టేబుల్‌ స్పూన్‌ పిండి చొప్పున గుంతల్లో వేయండి.

రెండు నిమిషాల తర్వాత రెండో వైపు ఫ్లిప్‌ చేసుకుని మరొక టీ స్పూన్‌ ఆయిల్‌ గుంతల్లో వేసుకుని రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోని వేయించుకోవాలి. రెండు వైపులా వేగే వరకూ తిప్పుతూ ఉండండి. అంతే గుంతపొంగనాలు రెడీ. డీ ఫ్రై చేసే పని లేకుండా టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌ ఇది.

చట్నీ చేసే విధానం

మిక్సీ జార్‌ తీసుకుని అరకప్పు దాకా చిన్న ముక్కలుగా కట్‌ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఆఫ్‌ ఇంచ్‌ అల్లాన్ని చిన్నగా కట్‌ చేసుకోని వేసుకోండి. ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి వేయండి. ఇందులోనే ఒక పావు ముక్క ఉల్లిపాయ, రెండు టేబుల్‌ స్పూన్స్‌ దాకా పుట్నాలు, ఒక టేబుల్‌ స్పూన్‌ దాకా కొత్తిమీర, ఒక రెమ్మ పుదినా, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు, కాస్త నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని గిన్నెలోకి వేసుకుని ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి వేసి తాలింపు వేసుకోవాలి.

Whats_app_banner