Rasagulla: పాలు, రవ్వతో రసగుల్లా ఇలా సులువుగా చేసుకోండి, జ్యూసీ టేస్టీగా ఉంటాయి-rasagulla with milk and rava is easy to make know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rasagulla: పాలు, రవ్వతో రసగుల్లా ఇలా సులువుగా చేసుకోండి, జ్యూసీ టేస్టీగా ఉంటాయి

Rasagulla: పాలు, రవ్వతో రసగుల్లా ఇలా సులువుగా చేసుకోండి, జ్యూసీ టేస్టీగా ఉంటాయి

Haritha Chappa HT Telugu
Published Feb 10, 2025 03:30 PM IST

మీకు రసగుల్లా అంటే ఇష్టమా? ఇంట్లోనే రవ్వ, పాలతో రసగుల్లాలను నిమిషాల్లో తయారు చేయవచ్చు. మెత్తగా, స్పాంజిగా, జ్యూసీగా ఉండేలా వీటిని తయారు చేయవచ్చు. రసగుల్లా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

రవ్వతో రసగుల్లా రెసిపీ
రవ్వతో రసగుల్లా రెసిపీ (Shutterstock)

రసగుల్లా పేరు చెబితేనే తినాలన్న కోరిక పుడుతుంది. మెత్తగా, జ్యూసీగా ఉండే ఈ స్వీట్ అద్భుతంగా ఉంటుంది. రసగుల్లా అనగానే అందరూ బయటికి వెళ్లి కొనుక్కుని తీసుకువస్తారు. నిజానికి వీటిని ఇంట్లోనే రుచికరంగా వండుకోవచ్చు. ఇక్కడ మేము రవ్వ, పాలతో రసగుల్లా సులభమైన రెసిపీని ఇచ్చాము. వీటితో చాలా సులువుగా చేయవచ్చు. ఎంతో తక్కువ సమయంలో ఇది సిద్ధమైపోతుంది. ఒక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

రసగుల్లా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఉప్మా రవ్వ - అర కప్పు

పంచదార - పావు కప్పు

దేశీ నెయ్యి - రెండు స్పూను

పాలు - ఒకటిన్నర కప్పు

చక్కెర - రెండు కప్పులు

యాలకుల పొడి - అరస్పూను

రోజ్ వాటర్ - ఒక స్పూను

రసగుల్లా రెసిపీ

  1. ఉప్మా రవ్వతో రుచికరంగా రసగుల్లా వండుకోవచ్చు. ఇందుకోసం మొదట చక్కెర సిరప్ తయారుచేసుకోవాలి.
  2. ఒక బాణలిలో రెండు కప్పుల పంచదార వేసి అందులో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి.
  3. సిరప్ లోనే రుచి కోసం యాలకుల పొడి, రోజ్ వాటర్ కలుపుకోవచ్చు.
  4. సిరప్ రెడీ అయిన వెుంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.
  5. ఇప్పుడు రసగుల్లాను వండేందుకు సిద్దం చేసుకోవాలి.
  6. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక స్పూను నెయ్యి వేయాలి.
  7. ఆ నెయ్యి పాలు వేసి వేడి చేయాలి. పాలు వేడెక్కా రవ్వను వేసి కలుపుతూ ఉండాలి.

8. రుచి కోసం అందులో పావు కప్పు పంచదార, యాలకుల పొడి కలపాలి.

9. రవ్వ పాలల్లో కలిపి దగ్గరగా, గట్టి అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

10. ఇప్పుడు మళ్లీ ముందుగా చేసుకున్న పంచదార సిరప్ గిన్నెను స్టవ్ మద పెట్టి చిన్న మంట మీద మళ్లీ వేడి చేయాలి.

11. ఉడికించుకున్న రవ్వను చిన్న చిన్న బాల్స్ లాగా చేత్తోనే చుట్టి వాటిని పంచదార సిరప్ లో వేయాలి.

12. పైన మూతపెట్టి రసగుల్లాలను అయిదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

13. పావుగంట సేపు వరకు అలా వదిలేయాలి. ఇవి ఉబ్బినట్టు అవుతాయి.

14. అంతే టేస్టీ రసగుల్లాలు రెడీ అయిపోతాయి. చాలా రుచిగా ఉంటాయి.

రసగుల్లాలు ఎంతోమంది ఇష్టపడే స్వీట్. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో దీన్ని అధికంగా తింటారు. అక్కడే అందరికీ దీన్ని వండడం కూడా వస్తుంది. రుచిలో అద్భుతంగా ఉండే రసగుల్లాలు పుట్టిందే పశ్చిమబెంగాల్ లోనే అని చెప్పుకుంటారు..

Whats_app_banner

సంబంధిత కథనం