Rakshabandhan wishes: తోబుట్టువుల అనుబంధాన్ని ఈ సందేశాలు పంపి ప్రత్యేకం చేయండి.. మీకోసమే ఈ బెస్ట్ మెసేజీలు
Raksha bandhan wishes: రాఖీ పండగ రోజు వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ కోసం మంచి సందేశాలు చూడండి. ఈ పండగ ప్రత్యేకతను గుర్తు చేసే మెసేజీలు మీకోసం ప్రత్యేకంగా ఇస్తున్నాం. ఈ మెసేజీలు పంపి ఈ పర్వదినం వేడుకలు మొదలుపెట్టేయండి.
రక్షాబంధన్ రోజు మీ సోదరికి, సోదరుడికి శుభాకాంక్షలు తెలపడానికి కొన్ని మంచి సందేశాలు ఇక్కడ ఇస్తున్నాం. మీ వాట్సాప్ స్టేటస్‌లో, ఫేస్‌బుక్ స్టేటస్‌లో వీటిని షేర్ చేసుకోవచ్చు. మీ అనుబంధాన్ని సెలెబ్రేట్ చేసుకోవచ్చు. కొన్ని అర్థవంతమైన మెసేజీలు చూసేయండి.
రక్షాబంధన్ శుభాకాంక్షల సందేశాలు:
1. సోదరా నువ్వే నా వెన్నెల, నా కళ్ళకు వెలుగు.
నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణం.
రక్షాబంధన్ శుభాకాంక్షలు
మన బంధం ఎల్లప్పుడూ ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.
2. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మన ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ రైడ్
నేను ఆ ప్రయాణాన్ని ఎప్పటికీ మరచిపోలేను. రాఖీ శుభాకాంక్షలు
3. నా శత్రువు నువ్వే, నా మిత్రువు నూవే.
నా తోడూ నువ్వే, నా నీడా నువ్వే
నువ్వెంత దూరంలో ఉన్నా, నీ సోదరి ప్రేమ నీతోనే ఉంటుంది.
హ్యాపీ రక్షా బంధన్
4. అక్కా చెల్లెళ్లు పూల పరిమళం లాంటి వాళ్లు
వాళ్లెక్కడున్నా సంతోషాలు కురిపిస్తారు. రాఖీ పండగ శుభాకాంక్షలు చెల్లి.
5. మనది జన్మజన్మల అనుబంధం
విశ్వాసంతో కూడిని ప్రియమైన బంధం
రాఖీ అనే బలమైన ముడితో మన బంధాన్ని బలపరుద్దాం. హ్యాపీ రాఖీ
6. భగవంతుడు నీకు అన్నీ సంతోషాలను ప్రసాదించాలని,
జీవితంలో సుఖసంతోషాలు పొందాలని,
ప్రతి జన్మలోనూ నువ్వు నాతో ఉండాలని,
ప్రతి జన్మలో నాకు సోదరుడిగా నువ్వే కావాలని కోరుకుంటున్నాను.
హ్యాపీ రక్షా బంధన్
7. ఈ బంధంలో ప్రేమ ఉంది. గొడవలు ఉన్నాయి. చిన్ననాటి జ్ఞాపకాల ఖజానా ఉంది. మనది అందమైన సోదరీసోదర బంధం. రాఖీ పండగ శుభాకాంక్షలు
8. రాఖీ అంటే కేవలం దారం కాదు. ఇది లెక్కలేనన్ని జ్ఞాపకాలను, మన రహస్యాలను, మనం గడిపిన క్షణాల దారాలతో అల్లుకున్న జ్ఞాపకం. హ్యాపీ రాఖీ.
9. రాఖీ అనేది బంధం. మన జీవిత సంగమం. మన సంతోషం అంతా ఈ బంధంలోనే ఉంది. హ్యాపీ రక్షా బంధన్!
10. సోదరి ప్రేమ దేవుడి ఆశీర్వాదం కంటే తక్కువేమీ కాదు.
దుఃఖానికి తావులేని బంధం మనది. దూరం విడదీయలేని అనుబంధమిది.
రక్షాబంధన్ శుభాకాంక్షలు
11. గొడవ పడటం, అలగడంలోనే ఉందీ బంధం మహిమ
ఒకరి సంతోషానికి సంబరాలు చేసుకోవడమే ఈ బంధం విలువ.
హ్యాపీ రక్షా బంధన్
12. పుట్టుకతో మొదలైంది మన బంధం
నమ్మకం, ప్రేమతో నిండింది మన బంధం
ఈ విడదీయలేని బంధాన్ని పండగలా జరుపుకుందాం
హ్యాపీ రక్షాబంధన్