Raksha Bandhan 2023 Songs : అన్నయ్య అన్నావంటే ఎదురవనా.. ఈ పాటలతో వీడియో చేసి సర్‌ప్రైజ్ ఇవ్వండి
Raksha Bandhan 2023 : అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా.. ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. వారి అనుబంధాన్ని గురించి చెప్పే చాలా పాటలు వచ్చాయి. అవి ఏంటో చూద్దాం.
సోదరుడు అంటే.. నాన్న తర్వాత నాన్న. సోదరిని సోదరుడు అమ్మలాగే చూస్తాడు. ఒకరికొకరు జీవితాంతం తోడుగు ఉంటారు. ఏదైనా కష్టం వస్తే.. నేను ఉన్నా అంటూ.. ముందుకు వస్తారు. అమితమైన ప్రేమను పంచుతారు. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని గుర్తుచేసే పవిత్రమైన రోజు రాఖీ పౌర్ణమి. ఈ రోజున అక్కలు, చెల్లెల్లు అతమ సోదరులకు రాఖీలను కట్టి తమకు రక్షగా ఉండమని కోరుకుంటారు. ఇలాంటి అదమైన, అనుబంధంతో కూడిన పండగ రోజున అన్నా చెల్లెళ్ల అనుగారంతో వచ్చిన తెలుగు సినిమా పాటలు వింటే మనసుకు ఎంతో హాయి. టాలీవుడ్ లో అన్నాచెల్లెళ్ల బంధంపై మంచి మంచి పాటలు వచ్చాయి. అవి ఏ చిత్రంలోనివే.. ఏ పాటో చూద్దాం..
ట్రెండింగ్ వార్తలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అన్నవరం సినిమా అందరికీ తెలిసిందే. ఈ సినిమా మెుత్తం సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ చుట్టే తిరుగుతుంది. ఇందులో చాలా సీన్స్ ఎమోషనల్‍గా ఉంటాయి. ఈ చిత్రంలోని అన్నయ్య అన్నావంటే ఎదురవన అలుపై ఉన్నావంటే నిదరవన కల్లలే కన్నవంటే నిజమై ముందుకు రానా.. అనే పాట బాగుంటుంది.
బాలకృష్ణ హీరోగా వచ్చిన లక్ష్మీనరసింహ సినిమాలోనూ చెల్లి గురించి ఓ పాట ఉంటుంది. మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అనే సాంగ్ ఆకట్టుకుంటుంది.
యాక్షన్ హీరో అర్జున్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం పుట్టింటికి రా చెల్లి. ఈ సినిమా చూస్తూ.. థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఈ చిత్రంలో చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి.. జోలాలి జో జో లాలి జో.. చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింక జోలాలి జో జో లాలి జో అనే పాట అన్నాచెల్లెలి అనుబంధాన్ని చక్కగా చూపిస్తుంది.
రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నాచెల్లెలిగా నటించిన చిత్రం గోరింటాకు. ఈ సినిమాలో అన్నా చెల్లెలి అనుబంధం.. జన్మ జన్మలా సంబంధం.. అంటూ సాగే పాటను ఇప్పటికీ చాలా మంది వింటుంటారు. చెల్లెల్లి కోసం అన్న పడే ఆరాటం ఇందులో చక్కగా చూపించారు.
వెంకటేశ్ హీరోగా వచ్చిన గణేశ్ సినిమాలోనూ ఓ పాట బాగుంటుంది. సిరిసిరి మువ్వలూ ఆ విరిసిన పువ్వులూ చిరుచిరు ఆశలూ ఈ గలగలా ఊసులూ కలబోసి చేసినవి.. అంటూ సాగే ఈ పాటలో మీ సోదరికి రాఖీ రోజున వినిపించండి.
పిపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి నటించిన ఊరుమనదిరా సినిమాలో ఓ మంచి పాట ఉంటుంది. నా చెల్లి చంద్రమ్మ, మా పల్లె చంద్రమ్మ.. పెళ్లి కూతురయేనమ్మా.. అనే సాంగ్.. లిరిక్స్ బాగుంటాయి. రాఖీ రోజున మీ సిస్టర్ కోసం ప్లే చేయండి.
చిట్టి చెల్లెలు అనే పాత సినిమాలోనూ సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి బాగుంటుంది. అందాల పసిపాప అందరికి కనుపాప బజ్జోరా బుజ్జాయి కథలెన్నో చెపుతాలే కలలన్ని అంటూ ఈ పాట వస్తుంది.
పైన చెప్పినవే కాకుండా.. చాలా తెలుగు పాటలు అన్నాచెల్లెల్లు అనుబంధం గురించి చెప్పేవి ఉన్నాయి. మీ అక్కాచెల్లెలకు ఈ పాటలు నేరుగా వినిపించండి. లేదంటే.. వాళ్ల ఫొటోలతో కలిపి ఓ వీడియో తయారు చేసి.. ఇవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.