Railway Recruitment: పరీక్ష లేకుండానే రైల్వేలో అప్రెంటీస్‌ల నియమాకం!
Railway Recruitment: దక్షిణ రైల్వే వివిధ ట్రేడ్‌లలో 3150 అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ వంటి అనేక ట్రేడ్‌ల కోసం ఈ నియామకాలు జరుగుతాయి.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, దక్షిణ రైల్వే అనేక ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మెుత్తం 3150 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. గ్యారేజ్, వ్యాగన్ వర్క్‌షాప్ పెరంబూర్, సెంట్రల్ వర్క్‌షాప్ పొన్మలై తిరుచ్చి, S&T వర్క్‌షాప్ పోదనూర్ యూనిట్లలో ఎంపికైన అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలు మూడు కేటగిరీల్లో ఉంటాయి. సాధారణ 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఒక కేటగిరీ, సాధారణ 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి రెండో కేటగిరీ రిక్రూట్‌మెంట్, ఐటీఐ డిప్లొమా సర్టిఫికెట్ హోల్డర్లకు మూడో కేటగిరీ. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ వంటి అనేక ట్రేడ్‌ల కోసం ఈ నియామకాలు జరుగుతాయి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 1 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 31 అక్టోబర్ 2022. ఈ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. ఈ రిక్రూట్‌మెంట్ 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఈ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు sr.indianrailways.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
అర్హత:
కొన్ని పోస్టులకు - కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత.
కొన్ని పోస్టులకు - కనీసం 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత.
నిర్దిష్ట పోస్టులకు:- పోస్ట్ సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్.
వయోపరిమితి
- కనీసం వయసు 15, గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి.
గరిష్ట వయోపరిమితిలో OBC కేటగిరీకి మూడేళ్లు, SC/ST కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు. వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
10వ, 12వ తరగతి మార్కుల మెరిట్, ఐటీఐ సర్టిఫికేట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
స్టైపెండ్:10వ తరగతి ఉత్తీర్ణతకు రూ.6000. 12వ తరగతి ఉత్తీర్ణత, ITI వారికి 7000 రూపాయలు.
అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్
దరఖాస్తు రుసుము -రూ.100.ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
శిక్షణ వ్యవధి ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది.శిక్షణ ముగిసిన తర్వాత ఆ వ్యక్తికి ఉద్యోగాన్ని అందించడానికి యజమాని కట్టుబడి ఉండడు లేదా యజమాని అందించే ఏదైనా ఉపాధిని అంగీకరించడానికి ట్రైనీ కట్టుబడి ఉండడు.
సంబంధిత కథనం