Ragi Pakodi: రాగి పకోడీ రుచి మామూలుగా ఉండదు, చూస్తేనే నోరూరిపోతుంది-ragi pakodi recipe in telugu know how to make this pakora ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ragi Pakodi Recipe In Telugu, Know How To Make This Pakora

Ragi Pakodi: రాగి పకోడీ రుచి మామూలుగా ఉండదు, చూస్తేనే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu
Mar 15, 2024 03:30 PM IST

Ragi Pakodi: శనగపిండితో చేసే పకోడీలు ఎక్కువ మంది తింటూ ఉంటారు. ఒకసారి రాగి పిండితో పకోడీ చేసి చూడండి. రుచికి రుచి పైగా ఎంతో ఆరోగ్యం. ఈ రాగి పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

రాగి పకోడి రెసిపీ
రాగి పకోడి రెసిపీ (Youtube)

Ragi Pakodi: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని వాడే వారి సంఖ్య చాలా తక్కువ. రాగులతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మేము పకోడీ ఎలా చేయాలో చెప్పాము. ఈ రాగి పకోడీ సాయంత్రం స్నాక్‌గా ఉపయోగపడుతుంది. పిల్లలకు, పెద్దలకు ఇది చాలా నచ్చుతుంది. ఒక్కసారి రాగి పకోడీ చేసుకుని చూడండి. మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.

రాగి పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు

రాగి పిండి - ఒక అర కప్పు

ఉల్లిపాయలు - నాలుగు

ఉప్పు - రుచికి సరిపడా

జీలకర్ర - ఒక స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

ఎండుమిర్చి - ఆరు

పల్లీలు - పావు కప్పు

రాగి పకోడీ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి పల్లీలను కాసేపు వేయించుకోవాలి.

2. తర్వాత స్టవ్ కట్టేయాలి. మిక్సీ జార్లో ఈ పల్లీలు, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి.

3. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా తరిగి ఒక గిన్నెలో వేయాలి.

5. ఆ గిన్నెలోని శెనగపిండి, జీలకర్ర, రాగి పిండి వేసి బాగా కలుపుకోండి.

6. రుచికి సరిపడా ఉప్పును వేయండి.

7. ఇప్పుడు నీళ్లు వేసి పకోడీకి ఎంత మందంగా కలుపుకుంటారో అంత మందంగా కలుపుకోండి.

8. ఈ మిశ్రమంలోనే ముందుగా గ్రైండ్ చేసిన పల్లీల పొడిని కూడా వేయండి.

9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.

10. నూనె వేడెక్కాక రాగి పిండిని పకోడీల్లా వేసుకోండి.

11. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

12. నూనెలోంచి తీసిన వెంటనే రాగి పకోడీ కాస్త మెత్తగా అనిపించవచ్చు. చల్లారాక అది గట్టిగా క్రిస్పీగా మారుతుంది.

స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా ఏం ఇవ్వావో ఆలోచించే తల్లులకు ఇది బెస్ట్ రెసిపీ. దీని ద్వారా రాగి పిండి కూడా శరీరంలో చేరుతుంది. రాగి పిండి, శెనగపిండి, ఉల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. నూనెలో డీప్ ఫ్రై చేశాము కాబట్టి ప్రతిరోజూ వీటిని తినిపించే కన్నా వారానికి ఒకసారి తినిపిస్తే సరిపోతుంది.

డీప్ ఫ్రై చేసే వంటకాలు ప్రతిరోజూ తినడం ఆరోగ్యకరం కాదు. ఒకసారి ఈ రాగి పకోడీ చేసుకుని తినండి మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. రాగులు సులువుగా అరుగుతాయి. అలాగే త్వరగా ఆకలి కూడా వేయకుండా అడ్డుకుంటాయి. హైబీపీతో బాధపడేవారు రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. రాగులు తినడం వల్ల గుండె, ఉబ్బసం, కాలేయ వ్యాధులు రాకుండా ఉంటాయి. రాగి పిండి ప్రాసెస్ చేయకుండా లభిస్తుంది. రాగులు తెచ్చి మిల్లు దగ్గర మర పట్టించుకున్నా చాలు. వీటిలో పకోడీలే కాదు, రోటీలు, దోశెలు, ఇడ్లీలు, ఉప్మా, పరాటాలు వంటివి చేసుకుని తినవచ్చు.

రాగుల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి వీటితో చేసిన ఆహారాలు తిన్నాక పొట్ట నిండుగా ఉంటుంది. దీని వల్ల ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహకరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ రోగులు రాగి పిండితో చేసిన వంటకాలను తినవచ్చు.

WhatsApp channel

టాపిక్