Bread Dosa: బ్రెడ్‌తో ఎప్పుడైనా దోసెలు వేసుకున్నారా..? పది నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేసేయండిలా!-quick and easy bread dosa recipe a crispy breakfast ready in just 10 minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bread Dosa: బ్రెడ్‌తో ఎప్పుడైనా దోసెలు వేసుకున్నారా..? పది నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేసేయండిలా!

Bread Dosa: బ్రెడ్‌తో ఎప్పుడైనా దోసెలు వేసుకున్నారా..? పది నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేసేయండిలా!

Ramya Sri Marka HT Telugu
Jan 21, 2025 06:30 AM IST

Bread Dosa: దోసెలు వేయడానికి గంటల పాటు నానబెట్టిన పిండి మాత్రమే అవసర్లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉండే బ్రెడ్ తో కూడా దోసెలు వేసుకోవచ్చు. ట్రై చేద్దామా?

Bread Dosa: బ్రెడ్‌తో దోసెలు వేసుకున్నారా.. పది నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేసేయండిలా!
Bread Dosa: బ్రెడ్‌తో దోసెలు వేసుకున్నారా.. పది నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేసేయండిలా!

దోసెలంటే మీకు ఇష్టమా? కానీ, గంటల కొద్దీ పిండి నానబెట్టడం సమస్యగా ఉందా..? లేదా మర్చిపోయారా? ఏం బాధపడకండి. మీ కోసం కేవలం బ్రెడ్ స్లైసెస్‌తోనే తయారు చేసుకోగల రెసిపీని తీసుకొచ్చాం. వీటితో పాటుగా కేవలం వంటగదిలోనే దొరికే పదార్థాలతో దోసెలు వేసుకోండి. బ్రెడ్ దోసె లేదా బ్రెడ్ ఊతప్పం పేరేదైనా రెసిపీ ఇదే..

yearly horoscope entry point

కావాల్సిన పదార్థాలు:

  • బ్రెడ్ స్లైసెస్ - 4-6
  • ఉప్మా రవ్వ - 1/2 కప్పు
  • బియ్యపు పిండి - 3/4 కప్పు
  • పుల్లటి పెరుగు - 1 కప్పు
  • పచ్చి మిరపకాయలు - 2
  • కొత్తిమీర ఆకులు - 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - తగినంత
  • నూనె - 1 టీ స్పూన్
  • చిన్న ఉల్లిపాయ - 1
  • కరివేపాకులు - కొన్ని
  • క్యారెట్స్ - అవసరానికి తగినంత
  • ఉల్లిపాయ - అవసరానికి తగినంత

తయారుచేసే విధానం:

  1. బ్రెడ్ స్లైసెస్ తీసుకుని రెండు నుంచి మూడు నిమిషాల వరకూ నీళ్లలో నానబెట్టాలి.
  2. తర్వాత బ్రెడ్ తీసుకుని నీళ్లు పోయేలా గట్టిగా పిండి పక్కకు పెట్టుకోండి.
  3. ఇప్పుడు ఉప్మారవ్వ తీసుకుని కడిగి మిక్సీ గిన్నెలో వేసుకోండి. బ్రెడ్, బియ్యపు పిండి, మిరపకాయలు, పెరుగు వేసుకుని పిండిగా చేసుకోండి. పూర్తిగా నలిగేందుకు సరిపడ నీటిని పోసుకోండి. ఇలా చేయడం వల్ల పిండి సున్నితంగా ఉంటుంది.
  4. ఇప్పుడు పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకోండి. పిండి దోసెెలు వేసుకునేందుకు వీలయ్యేంత వదులుగా కలుపుకోండి.
  5. దోసెెలు వేసే ముందు మీకు ఉల్లిపాయలు కలుపుకోవాలని అనిపిస్తే పిండిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకులు వేసుకుని బాగా తిప్పండి.
  6. ఇప్పుడు అందులో కొత్తిమీర ఆకులు వేసి బాగా మిక్స్ చేయండి.
  7. రెడీ అయిన పిండితో దోసెలు వేసుకునేందుకు దోసె పెనం తీసుకోండి. పిండిని పోస్తూ రౌండ్ షేప్ లో సర్దుకోండి. దానిపై కాస్త నూనె చుక్కలు వేస్తే మంచి రుచిగా ఉంటుంది.
  8. అలాగే మీడియం ఫ్లేమ్ మీద 1-2 నిమిషాలు ఉంచి తర్వాత దోసెను వెనక్కి తిప్పండి. దోసెె వేగిందనుకున్న తర్వాత పాన్ మీద నుంచి ఈజీగా వచ్చేస్తుంది. అదే దోసెె రెడీ అయిందనుకోవడానికి గుర్తు.
  9. అంతే మీ క్రిస్పీ బ్రెడ్ దోసెె రెడీ అయినట్లే. దీనిని కొబ్బరి చట్నీతో లేదా సాంబార్ తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం