Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్నవారు చాలా తెలివైనవారు, జీవితంలో సాధించలేనిది ఏమీ లేదు
Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో తెలివిగా విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయని పేర్కొన్నాడు.
చాణక్యుడు భారతదేశంలోని ప్రసిద్ధ పండితుడు, గొప్ప దౌత్యవేత్తగా పేరుగాంచాడు. చాణక్యుడు తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాల సమాహారమే చాణక్య నీతి. మనిషి తన జీవితంలో పాటించాల్సిన అంశాలు, సూత్రాలను అందులో పేర్కొన్నాడు. చాణక్య నీతిలో మీరు సంతోషకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపడం గురించి ముఖ్యమైన సమాచారాన్ని చూడవచ్చు.

చాణక్యుడికి రాజకీయాలు, దౌత్యం గురించి మంచి అవగాహన ఉంది. ఇది కాకుండా అనేక ఇతర రంగాలలో ఆయనకు లోతైన జ్ఞానం ఉంది. చాణక్యుడు ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు. అందుకే అతడిని కౌటిల్య అని కూడా అంటారు. ఎవరైనా తన జీవితంలో చాణక్యుడి సలహాలను పాటిస్తే.. సంతోషంగా, విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
మనిషి కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాల గురించి చాణక్యుడు చెప్పాడు. ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తిని ఎల్లప్పుడూ మేధావి అని పిలుస్తారు. తెలివైన వ్యక్తి ప్రతిచోటా గౌరవించబడతాడు. సమాజం వారి మాటలు వింటుంది, అనుసరిస్తుంది. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తిని మేధావిగా మార్చే లక్షణాలు ఏంటో చూద్దాం..
భావోద్వేేగాలను అదుపులో ఉంచుకోవాలి
జీవితంలో కష్ట సమయాల్లో కూడా భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే వ్యక్తిని సమాజం మేధావిగా పిలుస్తుందని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని క్లిష్టమైన సమయాల్లో ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. సంక్షోభం తలెత్తినప్పుడు, మీ అధికారాలను దుర్వినియోగం చేయవద్దు.
ప్రశాంతంగా ఉండాలి
మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఇబ్బందులను నివారించడానికి ప్రయత్నించండి. సంక్షోభాలు వచ్చినప్పుడు సంకోచించకండి. మీ స్వంత బలాలు, బలహీనతలను అన్వేషించండి. మీ సంక్షోభాలను అధిగమించాలి.
తప్పులకు దూరంగా ఉండాలి
చాణక్యుడి సూత్రాల ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడూ తప్పులకు దూరంగా ఉండాలి. మంచి పనులు చేసి, చెడు పనులకు దూరంగా ఉండే వ్యక్తిని ప్రజలు జ్ఞాని అంటారు. ఒక వ్యక్తి ఎప్పుడూ తప్పులు, వివాదాలకు దూరంగా ఉండాలి. తన తెలివితేటలను ఎలా ఉపయోగించాలో తెలిసినవాడిని, వివాదాలకు దూరంగా ఉండేవాడిని జ్ఞాని అని అంటారు అని చాణక్య నీతి చెబుతుంది.
భవిష్యత్ ప్రణాళికలను రహస్యగా పెట్టాలి
తన భవిష్యత్ ప్రణాళికలను రహస్యంగా ఉంచేవాడు ఉత్తమ జ్ఞాని అని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే పని పూర్తికాకముందే ఒకరి ప్రణాళికలను ఇతరులకు వెల్లడించడం వారి పనికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి తన ప్రణాళికలను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచాలి.
లక్ష్యం కోసం పని చేయాలి
ఎల్లప్పుడూ తన లక్ష్యం కోసం పని చేసేవాడే తెలివైనవాడు అని, ఎలాంటి అడ్డంకులు వచ్చినా నిర్భయంగా అధిగమించగల సామర్థ్యం కలిగి ఉంటాడని చాణక్య నీతి వివరిస్తుంది. సమయం లేదా పరిస్థితి గురించి వెనుకాడని వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కువ సమయం తీసుకోడు.
అడ్డంకులను అధిగమించాలి
అన్ని అడ్డంకులను అధిగమించగల సామర్థ్యం ఒక వ్యక్తిని జ్ఞానవంతుడిని చేస్తుంది. చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన పనిని పూర్తి చేయడంలో ఎటువంటి అడ్డంకులకు భయపడకుండా నిరంతరం తన లక్ష్యం వైపు పయనిస్తే మేధావి అంటారు. అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. పైన చెప్పిన లక్షణాలు ఉన్నవారు జీవితంలో కచ్చితంగా విజయం సాధిస్తారు. తెలివిగా ముందుకు వెళ్తారు.