Bread Storage: బ్రెడ్డు మిగిలిపోయిందని ఫ్రిజ్లో పెడుతున్నారా? అది ఆరోగ్యానికి ప్రమాదకరం
Bread Storage: బ్రెడ్ ఒకేసారి అంతా తినలేరు. సగం తిన్నాక మిగతా దాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు. ఇలా స్టోర్ చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు డైటీషియన్లు. ఎందుకు స్టోర్ చేయకూడదో కూడా వివరిస్తున్నారు.
Bread Storage: ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో బ్రెడ్ కనిపిస్తోంది. ముఖ్యంగా రకరకాల బ్రెడ్స్ అందుబాటులో ఉండడంతో వాటితో చేసే వంటకాల సంఖ్య కూడా పెరిగిపోయింది. మిల్లెట్ బ్రెడ్స్, బ్రౌన్ బ్రెడ్ ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి వీటిని తినే వారి సంఖ్య పెరిగిపోయింది. బ్రెడ్ మొత్తాన్ని ఒకేసారి తినలేము. ఎంతో కొంత మిగిలిపోతుంది, అలా మిగిలిపోయింది దాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలా ఫ్రిడ్జ్‌లో బ్రెడ్‌ని స్టోర్ చేయడం మంచిది కాదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బ్రెడ్‌ను ఫ్రిజ్లో పెట్టడం వల్ల అది తాజాగా ఉంటుంది అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని చెబుతున్నారు. ఫ్రిజ్లో బ్రెడ్‌ను పెట్టడం వల్ల ఎంతో చెడు ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు.
ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టకూడదు?
బ్రెడ్ గది ఉష్ణోగ్రత వద్ద తాజాగా ఉంటుంది. మీరు సూపర్ మార్కెట్లలో చూసినా కూడా వారు ఫ్రిజ్లో బ్రెడ్ ను నిల్వ చేయరు. వారి దగ్గర ఫ్రిజ్ లు అందుబాటులో ఉన్నప్పటికీ బ్రెడ్‌ను ఫ్రిడ్జ్‌లో ఎందుకు నిల్వ చేయట్లేదో ఒకసారి ఆలోచించండి. శీతలీకరణం అనేది బ్రెడ్ కు హానికరమైనది. ఇలా బ్రెడ్‌ను చల్లని ఉష్ణోగ్రతల వద్ద స్టోర్ చేస్తే అందులో చాలా మార్పులు వస్తాయి. తాజాగా ఉండే రొట్టె మృదువుగా, మెత్తగా ఉంటుంది. అదే ఫ్రిజ్లో బ్రెడ్ ను పెడితే అందులో ఉన్న స్టార్చ్ అణువులు స్పటికీకరణ ప్రారంభిస్తాయి. దీనివల్ల అది గట్టిగా మారిపోతుంది. స్టార్చ్ రెట్రో గ్రేడేషన్ రేటులో ఉష్ణోగ్రత కీలకపాత్ర పోషిస్తుంది.
రొట్టెను ఫ్రిజ్లో నిల్వ చేసినప్పుడు స్టార్చ్ చాలా వేగంగా స్పటికీరణకు గురవుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద నిలువ చేస్తే ఇలా జరగదు. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టిన స్టాలింగ్‌కు గురవుతుంది. స్టాలింగ్ అంటే స్టార్చ్ అణువులు తిరోగమనాన్ని ప్రారంభిస్తాయి. అంటే అవి తిరిగి గట్టిగా మారడం మొదలుపెడతాయి. ఇలాంటప్పుడు బ్రెడ్ ను కాల్చితే స్టార్చ్ అణువులు నీటిని గ్రహించి జిలాటినైజ్ చేస్తాయి. రొట్టె రుచితో పాటు ఆకృతి మారిపోతుంది. అందులోని పోషకాలు తగ్గిపోతాయి.
ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టిన బ్రెడ్‌ను తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పైగా అది శరీరంలో చేరాక ఇతర చెడు ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అది పాత రొట్టెలాగా మారిపోతుంది. ఒక్కోసారి ఆ రొట్టె తినటం వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి. పిల్లలకు ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టిన రొట్టెలను తినిపించకపోవడమే మంచిది. అవి ఫ్రిజ్లో పెట్టినా కూడా బూజుపట్టే అవకాశాలు ఉంటాయి.
రొట్టెను స్టోర్ చేయడానికి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది. ఇంట్లోనే చల్లటి, పొడి ప్రదేశంలో రొట్టె ఉంచిన డబ్బాను నిలవ చేయండి. ఇలా చేయడం వల్ల రొట్టెలోని తేమ సమతుల్యత కూడా సరిగ్గా ఉంటుంది.