గుమ్మడికాయ గింజలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ, మీకు తెలుసా? ఈ గింజలను ఎక్కువగా తినడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా కలిగే ప్రమాదం ఉందట. జింక్, మెగ్నీషియం, పాస్పరస్, కాపర్, నియాసిన్, ట్రైప్టోఫాన్, ప్రొటీన్‌లు ఉండే ఈ గింజలను మితంగా మాత్రమే తీసుకోవాలి.
గుమ్మడికాయల్లో ఉండే గింజలనే గుమ్మడి గింజలు అంటారు. చిన్న సైజులో ఓవల్ షేప్ లో ఉండే ఈ గింజల్లో మెగ్నీషియం ఉండి కండరాలకు, నరాల పనితీరుకు ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గాయాలను మానేందుకు తోడ్పడుతుంది. వీటిల్లో ఉండే ఐరన్ శరీరం మొత్తానికి ఆక్సిజన్, ఒమెగా 3, ఫైబర్‌ను సరఫరా చేస్తుంది.
పోషకాలతో నిండి ఉండే ఈ గింజలను రోజుకు ఒక పావు కప్పు అంటే 28 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకూ తినవచ్చు. ఈ డోస్ మించి తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిని మీ డైట్ లో చేర్చుకునే ముందు ఒకసారి నిపుణుల సలహా తీసుకోండి.
గుమ్మడి గింజల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ లలో తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి రావడం సహజం. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి ఉబ్బరంగా, గ్యాస్ పెరుగుతున్నట్లుగా అనిపించొచ్చు. వీటిల్లో ఫ్యాటీ ఆయిల్స్ కండరాలు పట్టేయడం, నొప్పికి కారణం కావొచ్చు. అందుకే ఇవి తినేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి.
ఇవి తినడం వల్ల చాలా మందిలో అలర్జీలు కూడా రావచ్చు. గొంతు ఇరిటేషన్ కు, తలనొప్పికి కారణం కావొచ్చు. ఎగ్జిమాతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలకు దారి తీస్తాయి. అందుకే గుమ్మడి గింజలు తీసుకునేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
పరిమిత మొత్తం కంటే ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. వీటిల్లో ఉండే కేలరీలు శరీరంలో అదనపు బరువును పెంచుతాయి.
గుమ్మడి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లో బీపీ ఉన్నవారికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవి మీ డైట్లో చేర్చుకునే ముందు కచ్చితంగా నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. నిర్దేశించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోకండి.
గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్, ఫ్యాటీ యాసిడ్లు పిల్లలకు ఇబ్బందికరం కావొచ్చు. కడుపులో నొప్పి, డయేరియా వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇవి చిన్న సైజులో ఉండటం వల్ల పిల్లలు పొరబాటును మింగే అవకాశం ఉంది. అప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది.
ఈ గింజలను నేరుగా తినవచ్చు లేదా రుచి, కరకరలాడే ఆకృతి కోసం సలాడ్లు, స్మూతీస్ వంటి వంటకాల్లో కలపవచ్చు. దుష్ప్రభావాలను తగ్గించడానికి మీరు వీటిని స్నాక్స్ లేదా సలాడ్, స్మూతీస్ వంటి ఇతర ఆహార పదార్థాలలో కూడా వేసుకోవచ్చు. బేక్ చేసుకుని లేదా వేయించుకుని కూడా తినొచ్చు. అయితే కాయ నుంచి తీసిన తర్వాత ముందుగా వాటిని ఆరబెట్టాలని గుర్తుంచుకోండి.