ఒకప్పుడు పుల్లట్లనే అధికంగా తినేవారు. ఇప్పటికీ కూడా గ్రామాల్లో పుల్లట్లను ఇష్టంగా తినేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ మేము పుల్లట్ల రెసిపీ ఇచ్చాము. ఇప్పటికి బండ్లపై పుల్లట్లను అమ్ముతూ ఉంటారు. వాటిని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పుల్లట్లు రెసిపీ తెలుసుకోండి. వీటిని రేషన్ బియ్యంతో టేస్టీగా వండుకోవచ్చు. సాధారణ సన్న బియ్యంతో వీటిని వండితే అంత టేస్టీగా రావు. కాబట్టి రేషన్ బియ్యంతో వండితే రుచిగా వస్తాయి.
రేషన్ బియ్యం - రెండు కప్పులు
పెరుగు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - ఒక స్పూను
నీరు - తగినన్ని
1. పుల్లట్లు చేసేందుకు రేషన్ బియ్యం అనువుగా ఉంటాయి.
2. రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
3. తర్వాత ఒక కప్పు పెరుగును అందులో వేసి బాగా కలపాలి.
4. అలాగే ఒక కప్పు నీటిని కూడా వేసి బాగా కలిపి రాత్రంతా వదిలేయాలి.
5. ఉదయం లేచాక ఆ బియ్యం, పెరుగు మిశ్రమాన్ని మెత్తగా రుబ్బి గిన్నెలో వేసుకోవాలి.
6. అది అట్లు వేయడానికి కావలసినంత మందంగా వచ్చేలా నీరు పోసుకోవాలి.
7. రుచికి సరిపడా ఉప్పును, జీలకర్రను వేసుకోవాలి.
8. దీన్ని అరగంట పాటు పక్కన పెట్టేయాలని.
9. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనానికి నూనె రాసి దీన్ని అట్లు లా పోసుకోవాలి.
10. అంతే టేస్టీ పుల్లట్లు రెడీ అయిపోయినట్టే.
11. వీటిని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, పల్లీల చట్నీలతో తింటే అద్భుతంగా ఉంటుంది.
12. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో పుల్లట్లను చేసి చూడండి. మీకు అద్భుతంగా అనిపిస్తుంది.
ఒకప్పుడు అమ్మమ్మలు, నానమ్మల కాలంలో పుల్లట్లను వారంలో నాలుగు రోజులు చేసేవారు. మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అమ్మమ్మల కాలంలో పావలాకి ఒక పుల్లటును అమ్మేవారు. అందుకే వాటిని పావలా పుల్లట్లు అని చాలా చోట్ల పిలుస్తారు. ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో ఈ పుల్లట్లను అమ్ముతున్నారు. ఇప్పుడు పది రూపాయలకు రెండు పుల్లట్లను అమ్ముతున్నారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
సంబంధిత కథనం
టాపిక్