పుదుచ్చేరి కొబ్బరి పాయసం.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ స్వీట్, రెసిపీ ఇదిగో-puducherry coconut payasam this sweet will melt in your mouth here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పుదుచ్చేరి కొబ్బరి పాయసం.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ స్వీట్, రెసిపీ ఇదిగో

పుదుచ్చేరి కొబ్బరి పాయసం.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ స్వీట్, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

కొబ్బరితో చేసే రెసిపీలు ఎంతో రుచిగా ఉంటాయి. కొబ్బరితో నోట్లో కరిగిపోయేలా స్వీట్ తయారు చేయవచ్చు. దీన్నీ తయారుచేయడం చాలా సులువు. ఈరోజు మనం పుదుచ్చేరి కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

కొబ్బరి పాయసం రెసిపీ

భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో తయారుచేసే ఆహారానికి ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది విదేశీయులు వివిధ రకాల ఆహారాన్ని ప్రయత్నించడానికి భారతదేశానికి వచ్చారు. ఆయా దేశాలలో భారతీయ ఆహారానికి రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ మేరకు, విదేశీయులు భారతీయ ఆహారం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. భారతీయ స్వీట్లు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పవచ్చు. అన్ని భారతీయ ఆహారాలు మేడ్ ఇన్ ఇండియా భాగాలు కొంతవరకు సారూప్య రుచి మరియు సారూప్య రెసిపీని కలిగి ఉంటాయి. ఇది తీపి వంటకం అయితే, కొన్నిసార్లు మాత్రమే మారుతుంది. ఈ రోజు మనం పుదుచ్చేరి కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము.

పుదుచ్చేరి కొబ్బరి పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కొబ్బరి తురుము - అర కప్పు

బియ్యం - అర కప్పు,

బెల్లం తురుము - పావు కప్పు

యాలకులు - మూడు

జీడిపప్పులు - పది

కిస్మిస్లు - పది

పాలు - పావు కప్పు

నెయ్యి - మూడు స్పూన్లు

కొబ్బరి పాయసం రెసిపీ

  1. పచ్చి నీటిలో వేసి రెండు గంటలపాటూ నానబెట్టాలి.
  2. ఆ తరువాత బియ్యాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత తురిమిన కొబ్బరి తురుము వేసి పావుకప్పు నీళ్లు పోసి పేస్ట్ లా గ్రైండ్ చేయాలి.
  4. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి రుబ్బుకున్న బియ్యం వేసి మీడియం మంట మీద పావుగంట పాటూ ఉడకనివ్వాలి.
  5. అదే సమయంలో మరో పాత్రలో పావుకప్పు నీళ్లు పోసి మరిగించాలి. అందులో బెల్లం వేయాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
  6. బియ్యం మిశ్రమం చిక్కటి గంజిగా తయారయ్యాక అందులో ఈ బెల్లం పాకం వేసి బాగా కలిపి బాగా మరిగించాలి.
  7. పాన్ లో నెయ్యి వేడి చేసి జీడిపప్పును బంగారు రంగులోకి మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
  8. ఇప్పుడు బియ్యం ఉడుకుతున్న మిశ్రమంలో పాలు పోసి 5 నిమిషాలు కలపాలి. పైన జీడిపప్పును వేయాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
  9. అంతే టేస్టీ కొబ్బరి పాయసం రెడీ అయినట్టే. పాండిచ్చేరిలో కొబ్బరి పాయసం ఇలాగే వండుతారు. నోట్లో పెడితేనే కరిగిపోయేలా ఉంటుంది ఇది.

కొబ్బరి పాయసం ఎప్పుడూ ఒకేలా కాకుండా… ఇక్కడ చెప్పిన పద్ధతిలో వండి చూడండి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ప్రసాదంగా కూడా దీన్ని పూజలో సమర్పించవచ్చు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.