Protein Deficiency: ప్రోటీన్ లోపం ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే.. పరిష్కారమేంటో చెప్పిన డైటిషియన్-protein deficiency common signs tips for tackle problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Protein Deficiency: ప్రోటీన్ లోపం ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే.. పరిష్కారమేంటో చెప్పిన డైటిషియన్

Protein Deficiency: ప్రోటీన్ లోపం ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే.. పరిష్కారమేంటో చెప్పిన డైటిషియన్

Protein Deficiency: శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోటీన్ పొందాలి. ఈ విషయాలపై ఓ డాక్టర్ ఏం చెప్పారో ఇక్కడ చూడండి.

Protein Deficiency: ప్రోటీన్ లోపం ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే.. పరిష్కారమేంటో చెప్పిన డైటిషియన్

శరీరం ఆరోగ్యంగా, ఫిట్‍‍గా ఉండాలంటే ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. శరీర పనితీరుకు ఇది సరిపడా ఉండాలి. ఒకవేళ ప్రొటీన్ లోపం ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రోటీన్ లోపం ఉంటే కనిపించే లక్షణాల గురించి హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍తో ఇంటర్వ్యూలో వెల్లడించారు సీనియర్ డైటిషియన్ ఉమాశక్తి. శరీరానికి ప్రోటీన్ అందించే మార్గాలను కూడా చెప్పారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రోటీన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు

శరీరానికి ఆహారం ద్వారానే పూరిస్థాయిలో ప్రోటీన్ అందాలి. అయితే, తగినంత ప్రోటీన్ లేకపోతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. “రోజులో కావాల్సిన ప్రోటీన్ తీసుకోకపోతే అది లోపంగా మారుతుంది. కొన్ని లక్షణాలు ద్వారా ప్రోటీన్ లోపాన్ని గుర్తించవచ్చు. అలసటగా ఉండడం ప్రధానమైన లక్షణం. పాదాల్లో వణుకు, జుట్టు రాలడం, గోళ్లు పెళుసుగా మారడం, చర్మ సమస్యలు, దంతాల్లో ఇబ్బంది, హర్మోన్ల వల్ల మూడ్ మారుతుండడం, పీరియడ్స్ క్రమంతప్పడం, ఆహారం ఆలస్యంగా జీర్ణమవడం, కండరాలు, కాళ్ల నొప్పులు, స్థిరంగా నడవలేకపోవడం ఇతర లక్షణాలుగా ఉన్నాయి” అని ఉమాశక్తి వెల్లడించారు.

రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే కూడా ప్రోటీన్ చాలా ముఖ్యమని ఉమాశక్తి వెల్లడించారు. శరీరంలో యాంటీబాడీలు పెరిగేందుకు ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని, ఇది తక్కువగా ఉంటే సమస్యలు ఎదురవుతాయని చెప్పారు.

ప్రోటీన్ పొందేందుకు మార్గాలు

ప్రోటీన్ లోపం సమస్య పరిష్కరించుకునే మార్గం చెప్పారు. ప్రతీ రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్ పుష్కలంగా ఉండే వాటిని తప్పకుండా యాడ్ చేసుకోవాలని చెప్పారు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏవంటే..

  • వెజిటేరియన్ ఫుడ్స్: బాదం, వాల్‍నట్స్, పిస్తాలు లాంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చియా సీడ్స్, గుమ్మడి గింజలు, ఫ్లాక్ సీడ్స్ సహా పప్పు ధాన్యాలు, కాయధాన్యాల్లో ప్రోటీన్ మెండుగా దక్కుతుంది. టోఫు ద్వారా కూడా ప్రోటీన్ బాగా అందుతుంది.
  • పాలు, పన్నీర్, పెరుగు, యగర్ట్ సహా పాలఉత్పత్తుల్లో ప్రోటీన్ మెండుగా ఉంటుంది. వీటిని మీ డైట్‍లో రెగ్యులర్‌గా తీసుకోవాలి.
  • నాన్‍వెడ్ ఫుడ్స్: నాన్‍వెజ్ తింటే, చేపలు, చికెన్, కోడిగుడ్లలో ప్రోటీన్ మెండుగా ఉంటుంది. మటన్‍లోనూ ప్రోటీన్ ఉన్నా కాస్త తక్కువే తీసుకోవాలి.
  • ప్రోటీన్ లోపం ఎక్కువగా ఉండే సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. వే ప్రోటీన్ కూడా ప్రయోజనాలను ఇస్తుంది. సప్లిమెంట్స్ వాడే ముందు నిపుణుల సలహా తీసుకుంటే మేలు.