Red Velvet Cake Recipe | మీ లైలాను చేయాలంటే ఇంప్రెస్.. తయారు చేయండిలా రెడ్ వెల్వెట్ కేక్!
Red Velvet Cake Recipe: మీ ప్రేమను వేడుక చేసుకోవాలనుకుంటున్నారా? మీ ప్రియాతి ప్రియమైన వ్యక్తికి మీరే స్వయంగా రెడ్ వెల్వెట్ కేక్ తయారు చేయండి, రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Valentine's Day Special: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు. ఇది మీరు ప్రేమించే వ్యక్తికి మీ ప్రేమను వ్యక్తపరచటానికి, మీ భాగస్వామితో మీ మనసులోని భావాలను తెలియజేయడానికి ఒక అవకాశం లాంటిది. ఈ ప్రేమికుల రోజు కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు, మీ స్నేహితులు, మీకు దగ్గరి ఆప్తులు, మీ కుటుంబ సభ్యులతో కలిసి కూడా మీ ప్రేమను, ఆప్యాయతను పంచుకోవచ్చు. మీ ప్రియమైన వారితో కలిసి విహారయాత్రలు చేయడం, వారికి బహుమతులు అందించి సంతోషపెట్టడం అలాగే మీకు ఇష్టమైన వారి కోసం ఇష్టంగా వండిపెట్టడం కూడా చేయవచ్చు.

మీ ప్రేమ రుచిని పంచాలనుకుంటే, మీకోసం ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ రెసిపీని అందిస్తున్నాం. రెడ్ వెల్వెట్ కేక్‌ని ఇష్టపడని వారు ఉండరు, ముఖ్యంగా అమ్మాయిలకు ఈ ఫ్లేవర్ కేక్ అంటే చాలా ఇష్టం. మరి మీ ప్రియాతి ప్రియమైన వారిని ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ సూచించిన రెడ్ వెల్వెట్ కేక్ తయారు చేయండి, ప్రేమతో తినిపించండి.
Red Velvet Cake Recipe కోసం కావలసినవి
- 2 1/2 కప్పులు మైదా పిండి
- 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్
- 1 టీస్పూన్ బేకింగ్ సోడా
- 1/2 టీస్పూన్ ఉప్పు
- 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్
- 1 కప్పు వెజిటెబుల్ నూనె
- 2 కప్పులు గ్రాన్యులేటెడ్ చక్కెర
- 4 గుడ్లు
- 1 కప్పు మజ్జిగ
- 2 టీస్పూన్లు వెనీలా ఎసెన్స్
- 1 టీస్పూన్ వైట్ వెనిగర్
- 2 టేబుల్ స్పూన్లు రెడ్ ఫుడ్ కలరింగ్
రెడ్ వెల్వెట్ కేక్ తయారీ విధానం
1. ముందుగా ఓవెన్‌ను 350 డిగ్రీల ఫారన్ హీట్ (175 డిగ్రీల సెల్సియస్) వరకు వేడి చేయండి. రెండు 9 అంగుళాల రౌండ్ కేక్ ప్యాన్‌లను గ్రీజు చేసి, పిండి చల్లండి.
2. ఒక మీడియం సైజు గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, కోకో పౌడర్ కలపండి, కాసేపు పక్కన పెట్టండి.
3. ఒక పెద్ద గిన్నెలో నూనె, పంచదార వేసి బాగా కలపండి. ఇందులో ఒక్కొక్క గుడ్డు వేస్తూ బాగా గిలక్కొట్టండి.
4. తర్వాత అందులో మజ్జిగ, వెనీలా ఎసెన్స్, వెనిగర్, ఫుడ్ కలరింగ్ వేసి కలపాలి. తడి పదార్ధాలకు పొడి పదార్థాలను నెమ్మదిగా, కేవలం కలిసే వరకు కలపండి.
5. ఇప్పటివరకు సిద్ధం చేసుకున్న కేక్ మిశ్రమాన్ని రెండు కేక్ పాన్‌ల మధ్య సమానంగా విభజించండి. అనంతరం దానిని 30-35 నిమిషాలు బేక్ చేయండి.
6. వైర్ రాక్‌లోకి తీసే ముందు కేక్‌లను పూర్తిగా చల్లబరచండి, బయటకు తీసి 10 నిమిషాలు చల్లబరచండి
7. చివరగా మీకు ఇష్టమైన క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్‌తో (క్రీమును) కేక్‌లపై పరచండి. ఆపైన రీఫ్రజరేటర్ లో ఉంచి ఫ్రీజ్ చేయండి.
పూర్తిగా చల్లబడ్డాక, ఫ్రిజ్ నుంచి తీస్తే రెడ్ వెల్వెట్ కేక్ రెడీ.
సంబంధిత కథనం