Propose Day 2025: “ప్రపోజ్ డే” రోజున ఈ కవితలతో మీ ప్రియమైన వారిని ఆకట్టుకోండి.. వారి మనసును ఇట్టే గెలుచుకోండి!-propose day 2025 win your loved ones heart with these beautiful poems capture their heart instantly ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Propose Day 2025: “ప్రపోజ్ డే” రోజున ఈ కవితలతో మీ ప్రియమైన వారిని ఆకట్టుకోండి.. వారి మనసును ఇట్టే గెలుచుకోండి!

Propose Day 2025: “ప్రపోజ్ డే” రోజున ఈ కవితలతో మీ ప్రియమైన వారిని ఆకట్టుకోండి.. వారి మనసును ఇట్టే గెలుచుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Feb 08, 2025 05:30 AM IST

ప్రపోజ్ డే వచ్చేస్తోంది. మీ ప్రియుడు లేదా ప్రేయసి మీద మీకున్న ప్రేమను వ్యక్తపరచడానికి సింపుల్‌గా ‘ఐ లవ్ యు’ చెప్తే ఏం బాగుంటుంది. కొన్ని ప్రేమతో నిండిన కవితలతో చెబితే అదిరిపోతుంది కదా. ఈ వాలెంటైన్స్ వీక్‌లో మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి మీకు ఉపయోగపడే కవితలు ఇక్కడ బోలెడు ఉన్నాయి.

“ప్రపోజ్ డే” రోజున ఈ కవితలతో మీ ప్రియమైన వారిని ఆకట్టుకోండి..
“ప్రపోజ్ డే” రోజున ఈ కవితలతో మీ ప్రియమైన వారిని ఆకట్టుకోండి..

ప్రేమికులకు అంటే ఒకరికోసం ఒకరు అని పరితపించే ప్రతి ఒక్కరికీ ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఫిబ్రవరి 14 రోజున వచ్చే వాలెంటైన్స్ డే, ఈ సందర్భంగా జరుపుకునే వాలెంటైన్స్ వీక్ ఈ నెల మొత్తాన్ని స్పెషల్ చేసేస్తాయి. ఒకరికొకరు మనసులో భావాలను తెలుపుకుంటూ, ఇన్ని రోజులుగా తమలో దాచుకున్న ఫీలింగ్స్ ను బయటపెట్టేస్తుంటారు. ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే సందర్భంగా తాము ఇష్టపడే వారిని ఇంప్రెస్ చేసేందుకు, ప్రేమను వ్యక్తపరిచేందుకు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. కానీ, ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినప్పుడైనా దానితో పాటు ప్రత్యేకమైన మెసేజ్ లేదా కవిత లేకుంటే అందులోని ప్రేమ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.

మరి, మీ ప్రియతమ వ్యక్తుల కోసం కవితలు లేదా ప్రత్యేక మెసేజ్ లు లాంటివి సిద్ధం చేసుకున్నారా.. లేదంటే, మీ కోసం ఇక్కడ ఉంచిన ప్రత్యేక సందేశాలు వాడుకోండి మరి.

1) పదేపదే జ్ఞాపకాలతో గుర్తొచ్చి చంపేయకు,

ఇక శిక్షింది చాలు, దర్శనమిచ్చి కనికరించు.

2) నా గుండెలో పదిలంగా చూసుకుంటా,

మేలిమి వజ్రాన్ని కాపాడే కంచు కోటలా.

3) విలువైన ఆభరణాలు ఒకవైపు, నీవు ఉండటం మరోవైపు,

నీ కళ్ళు ఒకవైపు, విశ్వపు అందం మరోవైపు.

4) నీ నవ్వుతో నా మనస్సు దోచుకున్నావ్,

నీ మాటతో నా ప్రపంచాన్ని లోబరుచుకున్నావ్,

నీ కోసం ఇలా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతా..

5) నాకు జాతి మతాల భయం లేదు,

ధనధాన్యాల కోరిక అసలే లేదు,

నేను వేరే రకమైన ప్రేమికుడిని,

నీ ప్రేమ దాహం తప్ప వేరేదీ అడగని వైరాగిని

6) నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను,

నీ ఊసులో పడి నన్నే మర్చిపోతాను

7) అపరిచితులుగా కలిశాము,

కానీ, ఇప్పుడు ఒకరంటే ఒకరికి ప్రాణమయ్యాము

8) నీతో మాట్లాడని ప్రతి రోజు అసంపూర్ణమే,

నీ మాట చెవిన పడిన ప్రతి క్షణం ఆనందమే

9) ఒక అందమైన, ఆహ్లాదకరమైన గురుతు నువ్వు,

నా సంతోషం, ఉత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండనివ్వు.

10) ప్రేమలో చేసేదంతా ప్రాణప్రదమే,

మనం అయి నడిచిన ప్రతిక్షణం శుభప్రదమే.

11) నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను,

ప్రాణం పోతున్నా సరే, నీ కోసమే పరితపిస్తాను

12) నేను పగలూ, రాత్రీ కోరుకునేది ఒకటే,

చిరునవ్వుతో ఉండే అందమైన నువ్వు,

నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టే నీ తోడు

13) ప్రతి సంతోషంలో నువ్వు ఉన్నావ్,

నువ్వొచ్చాక ప్రతి క్షణం సంతోషం కలిగేలా చేశావ్.

14) అన్ని వదిలేసి, నన్ను ప్రేమించు,

నువ్వు కోరుకున్న ప్రతీది నీ ముంగిట పోస్తా

15) నీతో మాట్లాడితే వచ్చే హాయి,

ప్రశాంతమైన నిద్రను కలిగించె ఆ రేయి

16) ఆ పదం వినగానే గుండెకు ప్రశాంతత వచ్చింది,

అది నీ పేరే నా ప్రాణమా.

17) గుండె కొట్టుకునే శబ్దాన్ని నియంత్రించాలా,

శ్వాసను నియంత్రించాలా,

నిన్ను చూడటంలోనే చాలా కష్టం ఉంది.

18) నిన్ను కలవడానికి ఎంతో ఆశగా ఉన్నాను,

ఎంతని చెప్పను, మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను.

19) ఈ క్షణాలు నాకు గుర్తుండిపోతాయి,

నేను నీకు దగ్గరగా ఉన్నప్పుడు,

నువ్వు నాతో ఉంటానని అన్నప్పుడు.

20) నా జీవన గమ్యం నువ్వే,

నా ఆశల సౌధం నువ్వే,

నా ప్రేమకు రూపం నువ్వే,

నా సర్వస్వం నీ చిరునవ్వే

Whats_app_banner

సంబంధిత కథనం