Propose day 2024: ప్రపోజ్ డే రోజు మీ ప్రేమను చెప్పాలనుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి-propose day 2024 want to express your love on the day of the proposal dont make these mistakes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Propose Day 2024: ప్రపోజ్ డే రోజు మీ ప్రేమను చెప్పాలనుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

Propose day 2024: ప్రపోజ్ డే రోజు మీ ప్రేమను చెప్పాలనుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

Haritha Chappa HT Telugu

Propose day 2024: మీ ప్రేమను ప్రపోజ్ డే నాడు వ్యక్తపరచాలనుకుంటున్నారా? కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేయడం మీకు నచ్చిన పద్ధతిలోనే కాదు, మీ ప్రేయసికి కూడా నచ్చేలా ఉండాలి. ఆమె ఇష్టయిష్టాలు తెలుసుకున్నాక ప్రపోజ్ ఎలా చేయాలో ప్లాన్ చేయండి.

ప్రపోజ్ డే (Pexels)

Propose day 2024: వాలెంటైన్స్ వీక్ లోని రెండో రోజు ప్రపోజ్ డే. ఈ రోజు కోసం ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఆ రోజునే తాము ప్రేమించిన వారికి ప్రేమను వ్యక్తపరచడానికి ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రోజ్ డే మరుసటి రోజు ప్రపోజ్ డే నిర్వహించుకుంటారు. ప్రేమలో ఉన్న వ్యక్తులు, ఈ వారాన్ని తమ ముఖ్యమైన వ్యక్తితో జరుపుకుంటారు. రోజ్ డే నాడు గులాబీ పువ్వును బహుమతిగా ఇవ్వడం నుండి గ్రాండ్ ప్రపోజల్ చేయడం వరకు ప్రపోజ్ డే చాలా ప్రత్యేకం.

ఈ ఏడాది వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమైంది. ఫిబ్రవరి 8న ప్రపోజ్ డేను నిర్వహించుకుంటారు. ఈ రోజున ఎంతో మంది తమ భాగస్వాముల పట్ల వారి ప్రేమను వ్యక్తపరుస్తారు. కొందరు తాము ప్రేమించిన వారికి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తుంటారు. ఈ ప్రత్యేకమైన రోజును నిర్వహించుకోవడానికి ఎంతో రెడీ అవుతారు. అయితే ప్రపోజ్ చేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

సర్‌ప్రైజ్: కొందరు తాము ప్రేమించిన వారికి గ్రాండ్ ప్రపోజల్ చేయడానికి సిద్ధమవుతారు. ఫ్లాష్ మాబ్ వంటివి ప్లాన్ చేస్తారు. అలాంటివి చేసేముందు అవతలి వ్యక్తికి అలాంటివి ఇష్టమో లేదో తెలుసుకోవాలి. కొంతమందికి పదిమందిలో అలా బయటపడడం ఇష్టముండదు. కాబట్టి ఎదుటివారి అభిప్రాయాలను అర్థం చేసుకుని అప్పుడు గ్రాండ్ ప్రపోజల్స్ ప్లాన్ చేయాలి. ఎదుటి వారికి సౌకర్యవంతంగా లేకపోతే వారు మీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.

వారి కోరికలను బట్టి: మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా అది మీ భాగస్వామికి నచ్చితేనే సక్సెస్ అయ్యేది. ప్రపోజల్ అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇది ఇద్దరికీ కంఫర్ట్ గా ఉండాలి. మీ భాగస్వాముల కోరికను దృష్టిలో ఉంచుకుని ప్రపోజల్ ప్లాన్ చేయండి.

అందమైన భాష: ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమ, భావోద్వేగాలను వ్యక్తపరచడం చాలా సున్నితమైన ప్రక్రియ. దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మీరు వారికి ఎలా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో ముందుగానే ప్రిపేర్ అవ్వండి. మీ మాటల్లో సున్నితత్వం, ప్రేమ ఉండాలి. మీ మాటల్లో అందమైన పదాలు ఉండాలి. అంతే తప్ప నిర్లక్ష్యంగా మాట్లాడినట్టు ఉన్నా, మొరటుగా వ్యక్తపరిచినా కూడా ఎవరూ ఇష్టపడరు. మీ ప్రపోజల్ గుండెను తాకేలా ఉండాలి.

ఉంగరాన్ని దాచిపెట్టి: వివాహ ప్రతిపాదనలు చేసేటప్పుడు చాలా మంది ఉంగరాన్ని దాచిపెట్టి ఉంచుతారు. కొన్ని సార్లు వారికి పెట్టే ఆహారంలో, కేకులో, పానీయంలో ఉంచడం వంటివి చేస్తారు. అలాంటివి చేయకండి. అవి చాలా ప్రమాదాలకు కారణం కావచ్చు. ఉంగరం దాచి పెట్టి సర్ ప్రైజ్ చేయాలనుకుంటే ఆహారంలో ఉంచడం తప్ప ఇంకేదైనా ప్లాన్ చేయండి.

సందర్భాన్ని బట్టి: ప్రపోజ్ చేసేముందు ఎదుటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసుకోండి. వారు ఇంట్లో పరిస్థితులు బాగోలేక బాధలో ఉన్నప్పుడు మీరు ఆనందంగా వెళ్లి ప్రపోజ్ చేయడం సరికాదు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు రాబోయే కష్టాల్లో నేను తోడుంటాను అని భావోద్వేగంతో ప్రపోజ్ చేయండి అంతేకానీ పువ్వులు, చాక్లెట్లు ఇచ్చి ప్రేమను వ్యక్తపరచకండి.