Necklace cost: ప్రియాంక చోప్రా మెడలోని పూసల దండ ధర ఎన్ని కోట్లో తెల్సా? మన ఊహకు కూడా అందని ధర
Priyanka chopra: ప్రియాంక చోప్రా తన సోదరుడి వివాహా వేడుకల్లో బల్గరీ బ్రాండ్ ఆభరణాలతో మెరిసిపోయింది. ఈ బ్రేస్ లెట్ ఖరీదు రూ.30 లక్షలు కాగా, నెక్లెస్ ధర ఇంకా ఖరీదు. దాని ధరతో పాటూ ప్రియాంక లుక్ వివరాలు చూసేయండి.
ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఇండియా వచ్చారు. ఈ వివాహ వేడుకలకు మొదటి కాస్టూమ్‌గా పింక్ మనీష్ మల్హోత్రా చీర కట్టుకుంది. బల్గరీకి చెందిన అద్భుతమైన ఆభరణాలతో ఆమె ఈ దుస్తులకు జత చేశారు. లోపల వాటి ధర తెలుసుకోండి.
బల్గరీ నగల్లో ప్రియాంక చోప్రా, వాటి ధర ఇదే
బల్గరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక చోప్రా లగ్జరీ ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్ కు చెందిన ఆభరణాలను ధరించింది. సర్పెంటైన్ కలెక్షన్ నుండి డైమండ్ బ్రాస్ లెట్, వింటేజ్ ముత్యాల చోకర్ నెక్లెస్ ను ఎంచుకుంది. సర్పెంటీ వైపర్ బ్రేస్ లెట్ గా పిలిచే ఈ బ్రేస్ లెట్ లో ఫుల్ పావే డైమండ్స్ తో కూడిన 18 క్యారట్ వైట్ గోల్డ్ సెట్ లో, వన్ కాయిల్ డిజైన్ ను కలిగి ఉంది. అధికారిక బల్గరి వెబ్సైట్ ప్రకారం దీని విలువ అక్షరాలా ముప్ఫై లక్షలకు పైగా. కచ్చితంగా చెప్పాలంటే 30,79,000/- రూపాయలు. ఇక ముత్యాల నెక్లేస్ ధర తెలిస్తే షాకవుతారు.
ముత్యాల నెక్లెస్ ధర కోట్లలో:
వింటేజ్ ముత్యాల చోకర్ నెక్లెస్ విషయానికి వస్తే, ప్రియాంక ఓహ్-సో-క్లాసీ యాక్సెసరీ ముత్యాలు, రుబీలు, వజ్రాలతో ఒదిగి ఉంది. అధికారిక వెబ్సైట్లో ఈ నెక్లెస్ ధర అందుబాటులో లేనప్పటికీ, నివేదికల ప్రకారం ఈ నెక్లెస్ ధర రూ .8 కోట్ల దాకా ఉంటుందట.
ప్రియాంక చోప్రా లుక్
తన సోదరుడి వివాహ వేడుకల కోసం ప్రియాంక ఫస్ట్ లుక్ లో ఆమె బాలీవుడ్ ఫేవరెట్ మనీష్ మల్హోత్రా కస్టమ్ డిజైన్ చేసిన పింక్ షిఫాన్ చీరలో కనిపించింది. తొమ్మిది గజాల్లో పూల ఎంబ్రాయిడరీ, మెరిసే సెక్విన్ పనితనం ఉంది. ఫ్లోరల్ డెకార్, ప్లంపింగ్ నెక్లైన్, బ్యాక్‌లెస్ డిజైన్‌తో కూడిన బ్లౌజ్ ధరించింది. చివరగా, మెరిసే గులాబీ పెదవులు, మెస్సీ టాప్ నాట్, గులాబీ ఐ షాడో, ఎరుపు రంగు బ్లష్, ఆకర్షణీయమైన మేకప్ గ్లామర్ ను మరింత పెంచాయి.
టాపిక్