Pressure Cooker: ఆలూ నుంచి ఆకుకూరల వరకూ కుక్కర్లో వండకూడని ఆహారాలేంటో తెలుసుకోండి! ఆరోగ్యాన్ని కాపాడుకోండి
Pressure Cooker: సమయం లేక కొందరు, త్వరగా అయిపోతుందని మరికొందరు అన్నం నుంచి ఆకుకూరల వరకూ అన్నింటింనీ కుక్కర్లోనే వండేస్తున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం, రుచిని కాపాడుకోవడానికి ప్రెషర్ కుక్కర్లో వండకూడని వంటకాల గురించి తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ప్రెషర్ కుక్కర్ ఉపయోగించని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. స్కూళ్లకు, ఆఫీసులకు లంచ్ బాక్సులు రెడీ చేయడానికి నేటి గృహిణులు ప్రెషర్ కుక్కర్‌ను విపరీతంగా వాడేస్తున్నారు. ఇది కేవలం సమయాన్నే కాదు గ్యాస్ ను ఆదా చేస్తుంది కదా అనుకుని అన్నం నుంచి ఆలు వరకూ అన్నింటినీ కుక్కర్లో వేసిసి వండేస్తున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల ఆహార పదార్థాలను కుక్కర్లో వేసి వండటం వల్ల వాటి రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు కూడా దెబ్బతింటాయట. మీరు ఎంత బిజీగా ఉన్న ప్రెషర్ కుక్కర్లో వండకూడని ఆహారాలేంటో తెలుసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ప్రెషర్ కుక్కర్లో వండకూడని ఆహార పదార్థాలు ఏంటి?
చిక్కుళ్లు, బీన్స్..
శనగలు, బఠానీలు, చిక్కుళ్లు, బీన్స్ వంటివి ఉడకడానికి కాస్త ఎక్కువ సయమం తీసుకుంటాయి. పైగా కూర అడుగంట కుండా ఉంటడేందుకు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అందుకే వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి వండుతుంటారు గృహిణులు. కానీ వీటిని కుక్కర్లో వండకూడదట. ఎందుకంటే.. వీటిల్లో లెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో వండడం వల్ల ఇది విష పదార్థంగా మారుతుంది.పైగా రుచితో కూడా తేడా కనిపిస్తుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు రావచ్చు. కనుక కాస్త ఓపిక తెచ్చుకని, సమయం కుదుర్చుకుని వీటిని గిన్నెలో వండండి.
బంగాళాదుంపలు..
బంగాళదుంపలు వండటంలో వాటిని ముందుగా ఉడకబెట్టే ప్రక్రియ చాలా ముఖ్యమైనది. అయితే వీటిని త్వరగా ఉడికించేందుకు కుక్కర్లో వేస్తుంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు ఆహార నిపుణులు. ప్రెషర్ కుక్కర్లో బంగాళాదుంపలకు వండటం ఆరోగ్యానికి హానికరమట. ఎందుకంటే.. వీటిలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. జనరల్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ప్రెషర్ కుక్కర్లో వండడం వల్ల బంగాళాదుంపల్లోని పిండి పదార్థం ఒక రకమైన రసాయనంగా ఏర్పడుతుంది, ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే దీంట్లోని పోషక విలువలు కూడా తగ్గిపోతాయి.
ఆకుకూరలు..
పాలకూర వంటి ఇతర ఆకుకూరలను కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. ప్రెషర్ కుక్కర్‌లో ఆకుకూరలు వండడం వల్ల వాటిలోని ఆక్సాలేట్స్ కరిగి, మూత్రపిండాల్లో రాళ్లకు కారణం కావచ్చు. అంతేకాకుండా, ప్రెషర్ కుక్కర్లో వండడం వల్ల ఆకుకూరల పోషకాలు నశించి, రంగు, రుచి కూడా దెబ్బతింటాయి.
ఫ్రై వంటకాలు..
ప్రెషర్ కుక్కర్‌ను ఆవిరిలో వండే ఆహార పదార్థాలను వండడానికి మాత్రమే ఉపయోగించాలి. డీప్-ఫ్రైడ్ ఆహార పదార్థాలను దీంట్లో వండడం వల్ల రుచి మాత్రమే కాదు, మీ వంట అనుభవం కూడా చెడిపోతుంది. ప్రెషర్ కుక్కర్‌ను ఎప్పుడూ డీప్ ఫ్రై రెసిపీలకు ఉపయోగించకండి. ప్రెషర్ కుక్కర్‌ను ఎక్కువ ఉష్ణోగ్రతలో నూనెను వేడి చేయడానికి రూపొందించలేదు. అలా చేస్తే ఫ్రైడ్ ఫుడ్ రుచి బాగుండదు అలాగే ప్రెషర్ కుక్కర్ కూడా చెడిపోతుంది.
అన్నం..
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కడిగి పెడితే రెండంటే రెండు విజిల్స్ తో ఉడికిపోతుంది కదా అని రోజూ ప్రెషర్ కుక్కర్లోనే అన్నం వండుతున్నారంటే మీరు ప్రమాదాన్ని కొన్ని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే అన్నాన్ని ప్రెషర్ మీద వండటం వల్ల అందులోని అక్రిలమైడ్ అనే పిండి పదార్థం హానికర రసాయనాన్ని విడుదల చేస్తుంది. అన్నాన్ని ఎప్పుడూ తక్కువ మంట మీద అలాగే గాలి తాకేగిన్నెలోనే వండాలి. అప్పుడే అది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
సంబంధిత కథనం