Premix Sambar: ప్రీమిక్స్ సాంబారు పొడి ఇలా చేసి పెట్టుకోండి, అరగంటలో సాంబారు వండేసుకోవచ్చు, రెసిపీ ఇదిగో-prepare the premix sambar powder like this you can cook the sambar in half an hour here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Premix Sambar: ప్రీమిక్స్ సాంబారు పొడి ఇలా చేసి పెట్టుకోండి, అరగంటలో సాంబారు వండేసుకోవచ్చు, రెసిపీ ఇదిగో

Premix Sambar: ప్రీమిక్స్ సాంబారు పొడి ఇలా చేసి పెట్టుకోండి, అరగంటలో సాంబారు వండేసుకోవచ్చు, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Jan 01, 2025 05:30 PM IST

Premix Sambar: ఎక్కువ సమయం లేకుండా త్వరగా సాంబార్ తయారు చేయాలనుకుంటే ఈ ప్రీమిక్స్ సాంబార్ పౌడర్ ను తయారు చేసి ఇంట్లో పెట్టుకోవాలి. దోశ, ఇడ్లీ తయారు చేయడం చాలా సులభం.

ప్రీమిక్స్ సాంబారు పొడి
ప్రీమిక్స్ సాంబారు పొడి (shutterstock)

ఇంట్లో దోశ, ఇడ్లీ వంటి దక్షిణాది వంటకాలు చేసినప్పుడల్లా అవి సాంబార్ లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తాయి. అలాగే, సాంబార్, చట్నీ తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఇంట్లో రెడీమేడ్ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ఎక్కువ సమయం లేకుండా త్వరగా సాంబారును తయారుచేసుకోవచ్చు. కాబట్టి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ తయారుచేసే రెసిపీని గమనించండి.

yearly horoscope entry point

సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

శనగపప్పు - రెండు స్పూన్లు

కంది పప్పు - ముప్పావు కప్పు

మినపప్పు - రెండు స్పూన్లు

బియ్యం - ఒక స్పూను

కాశ్మీరీ ఎండుమిర్చి - నాలుగు

కరివేపాకులు - పది

ధనియాలు - మూడు స్పూన్లు

ఆవాలు - అర స్పూను

మెంతులు - అర స్పూను

చింతపండు - ఉసిరి కాయ సైజులో

పసుపు - అర స్పూను

ఉప్పు - అర స్పూను

సాంబారు ప్రీమిక్స్ పొడి

  1. స్టవ్ మీద కళాయి పెట్టి శెనగపప్పు, కంది పప్పు, మినపప్పు, అన్నం వేయించాలి.
  2. వాటిని తీసి పక్కన పెట్టి అదే కళాయిలో ఎండు మిర్చి, ధనియాలు, ఆవాలు, నల్ల మిరియాలు, మెంతులు, చింత పండు, కరివేపాకులు వేసి వేయించాలి.
  3. అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
  4. అన్నీ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పొడిలా మార్చుకోవాలి.
  5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనే వేయాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి వేయించాలి.
  6. అందులోనే మిక్సీలో రుబ్బుకున్న పొడిని వేసి వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
  7. అంటే సాంబార్ ప్రీమిక్స్ పొడి రెడీ అయిపోయినట్టే.
  8. మీరు సాంబార్ వంబాలనుకుంటే చింతపండు రసంలో కూరగాయ ముక్కలు, ఈ పొడి కూడా వేసి ఒకేసారి ఉడికించి తాళింపు వేసుకుంటే సరిపోతుంది.
  9. అరగంటలోనే సాంబారు రెడీ అయిపోతుంది. ముందు కంది పప్పు ఉడకబెట్టుకోవడం వంటి పనులు ఉండవు.

దోసె, ఇడ్లీ, ఊతప్పం వంటివి తయారు చేసుకున్నప్పుడు ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ తో సులువుగా సాంబార్ వండుకోవచ్చు. మీరు ఒక్కసారి దీన్ని ప్రయత్నించి చూడండి…. సాంబార్ చేయడం ఇంత సులువా అనిపిస్తుంది.

Whats_app_banner