Nagula Chavithi Prasadam: నాగుల చవితి ప్రసాదాలు చలిమిడి, నువ్వుల చిమ్మిలి ఇలా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేయండి-prepare nagula chaviti prasadas in five minutes chalimidi and chimmili recipes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nagula Chavithi Prasadam: నాగుల చవితి ప్రసాదాలు చలిమిడి, నువ్వుల చిమ్మిలి ఇలా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేయండి

Nagula Chavithi Prasadam: నాగుల చవితి ప్రసాదాలు చలిమిడి, నువ్వుల చిమ్మిలి ఇలా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేయండి

Haritha Chappa HT Telugu
Nov 05, 2024 06:00 AM IST

Nagula Chavithi Prasadam: నాగుల చవితికి కచ్చితంగా రెండు రకాల ప్రసాదాలను నాగేంద్రుడికి సమర్పిస్తారు. అవి బియ్యప్పిండితో చేసే చలిమిడి, నువ్వులతో చేసే చిమ్మిలి. ఈ రెండు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

నాగుల చవితి ప్రసాదం రెసిపీలు
నాగుల చవితి ప్రసాదం రెసిపీలు

దీపావళి అమావాస్య ముగిసాక కార్తీక శుద్ధ చతుర్ధినాడు నాగుల చవితి పండుగను నిర్వహించుకుంటారు. దీపావళి తర్వాత వచ్చే ముఖ్యమైన పండగల్లో ఇది ఒకటి. పవిత్ర మాసమైన కార్తీక మాసంలో ఈ నాగుల చవితి పండుగ వచ్చింది. సుబ్రమణ్య స్వామిని ఆరాధించే భక్తులు నాగులు చవితిని వైభవంగా నిర్వహించుకుంటారు. నాగుల నుంచి రక్షణ కల్పించమని ఆ సుబ్రమణ్యేశ్వర స్వామిని కోరతారు. నాగులకు పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే నాగుల చవితి రోజు పొట్ట దగ్గర పూజ చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. నాగేంద్రుడికి కచ్చితంగా నాగుల చవితి రోజు చలిమిడి, నువ్వులతో చేసే చిమ్మిలి ప్రసాదాలుగా పెడతారు. వీటి రెసిపీలను ఇక్కడ ఇచ్చాము. చాలా సులువుగా వీటిని చేసేయండి.

చలిమిడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బియ్యప్పిండి - ఒక కప్పు

నెయ్యి - ఒక స్పూను

యాలకుల పొడి - చిటికెడు

బెల్లం తురుము - అరకప్పు

చలిమిడి రెసిపీ

1. కొందరు తడి బియ్యప్పిండితో చలిమిడిని చేస్తారు.

2. బియ్యాన్ని కడిగి మెత్తగా పొడి చేసి ఆ పొడి తడిగా ఉన్నప్పుడే వండుతారు.

3. ఇది వీలుకాని వాళ్లు నేరుగా బియ్యప్పిండితో వండుకోవచ్చు.

4. మిక్సీ జార్లో ఈ బియ్యప్పిండిని, బెల్లాన్ని, యాలకుల పొడిని, నెయ్యిని వేసి ఒకసారి రుబ్బుకోవాలి.

5. ఇది గట్టిగా అయ్యాక అవసరమైతే కాస్త పాలు పోసుకోవచ్చు.

6. ఈ మొత్తం మిశ్రమాన్ని మళ్లీ బాగా కలిసేలా రుబ్బుకోవాలి.

7. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

8. అంతే చలిమిడి రెడీ అయినట్టే.

9. ఇందులో కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు.

10. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి

.........…………………...................

నువ్వుల చిమ్మిలి రెసిపీ కోసం కావలసిన పదార్థాలు

నువ్వులు - ఒక కప్పు

బెల్లం తురుము - అరకప్పు

నువ్వుల చిమ్మిలి రెసిపీ

1. ఈ రెసిపీ చేయడం చాలా సులువు.

2. నువ్వులను మిక్సీ జార్ లో వేసి బెల్లం తురుమును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

3. కావాలనుకుంటే ఒక రెండు స్పూన్ల పాలను పోసుకోవచ్చు.

4. ఇది ముద్దలాగా అవుతుంది. వీటిని లడ్డూల్లా చుట్టుకొని చిమ్మలిని రెడీ చేసుకోవాలి.

5. వీటిని చిన్నచిన్న ఉండలుగా చేసి నాగేంద్రుడికి పుట్టలో వేసి ప్రసాదాన్ని సమర్పిస్తారు.

చలిమిడి, చిమ్మిలి... రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. నాగేంద్రుడికి పూజ చేసుకున్నాక వాటిని ప్రసాదంగా తింటే ఎన్నో పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

Whats_app_banner