లంచ్ చేయడానికి రెండు గంటలు పడుతుంది.. కానీ టిఫిన్ చేయడానికి ఒకరోజు ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది. ముందు రోజు ఉదయం పప్పు నానపెట్టాలి, సాయంత్రం గ్రైండ్ చేయాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి రెడీ అవుతుంది. అప్పుడు చేసుకోవాలి.. సో.. ఇంత ప్రాసెస్. ఇన్‌స్టంట్‌గా ఏదైనా చేసుకోవచ్చు కానీ దోశలు చేసుకోవాలంటే మాత్రం ఇంతే ఉంటుంది.. ఇలాంటి ప్రాసెస్ ఏం లేకుండా.. మీకు కారం దోశ తినాలనిపించిందా.. తినేసేయండి. ఇంట్లో దోశ పిండి లేకుండానే ఇన్‌స్టంట్‌గా కారం దోశ చేయొచ్చు. దీని టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇన్‌స్టెంట్ కారం దోశ ఎలా చేసుకోవాలో చూద్దామా..
ఉప్మారవ్వ – ఒక కప్పు,
పంచదార – ఒక టీ స్పూన్,
నూనె – 2 టీ స్పూన్స్,
గోధుమపిండి – 2 టేబుల్ స్పూన్స్,
బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్,
పెరుగు – ఒక కప్పు,
నీళ్లు – ఒక కప్పు,
ఉప్పు – తగినంత,
వంటసోడా – 1/3 టీ స్పూన్,
షెజ్వాన్ సాస్ – ఒక టేబుల్ స్పూన్,
గరం మసాలా – పావు టీ స్పూన్,
సాంబార్ మసాలా పొడి – పావు టీ స్పూన్,
క్యారెట్ తురుము – కొద్దిగా,
తరిగిన కొత్తిమీర – కొద్దిగా,
చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా.
ముందుగా ఒక జార్‌లో ఉప్మా రవ్వ తీసుకోవాలి. తర్వాత పంచదార, నూనె వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గోధుమపిండి, బియ్యంపిండి, పెరుగు, నీళ్లు, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. ఇలా అన్నింటిని కలుపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టాలి. రవ్వ నానిన తరువాత అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి.
ఇప్పుడు పెనం మీద నూనె వేసి వేడి చేయాలి. తరువాత టిష్యూ పేపర్‌తో తుడుచుకోవాలి. పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. దోశ తడి ఆరిన తరువాత షెజ్వాన్ సాస్, గరం మసాలా, సాంబార్ మసాలా పొడి వేసి దోశ అంతట చేయాలి. ఆపై క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కూడా చల్లుకోవచ్చు. దోశ పూర్తిగా కాలిన అనంతరం ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కారం దోశ రెడీ అయినట్టే. దీనిని ఇలాగే తినొచ్చు లేదా టమోటా చట్నీతో కూడా లాగించేయెుచ్చు.